అగమ్యగోచరం

అగమ్యగోచరం

రచన: యువశ్రీ బీర

సాఫీగా సాగుతున్న జీవితనావ…
అనుకోని మలుపులెన్నో తిరుగుతుంది…
హాయిగా నిద్రించి ఎన్నాళ్ళయిందో…
గుండెనిండా అభద్రతాభావం…
వెల్లువై ముంచేస్తుంటే…
కునుకేయటానికి నిదురరాదంతే…

మనసు సంద్రంలో, బాధల భూకంపాలు…
సునామీలా కన్నీరు తన్నుకొస్తుంటే…
ఆపలేక, ఆ కన్నీటికి అడ్డుకట్టలేయలేక…
దుఃఖంలో మునిగిపోతుంది మనసు…

ఎటుచూసినా ఆవేదనలే…
ఏదిక్కుకు వెళ్లినా కరోనా బాధలే…
బాధలన్నీ నావకు చుక్కానిగా మారితే…
ఏదిక్కుకు వెళ్ళాలో తెలియక…
అగమ్యగోచరంగా బ్రతుకు నావ…
నడిసంద్రంలో కొట్టుమిట్టాడుతుంది…
మనసు సుడిగుండంలో మునగలేక…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!