మరువలేని నీ పరిచయం

మరువలేని నీ పరిచయం

రచన: కార్తీక్ దుబ్బాక

ఏ బంధమో ఏమో, నాకు
నీ పరిచయం,తో
కనిపించింది తీయని కలల ప్రపంచం,
కనిపించని భావాలెన్నోమదిలో కలిగించావు
ఎప్పుడు కనని కన్నులుకి ఆశల ప్రపంచం చూపించావు

బ్రతుకు లో తీపి దనాన్ని రుచిగా తినిపించావు
జీవిత బంధాలు ఎన్ని ఉన్నా
అన్నీ నువ్వే అనిపించావు

పగలు రాత్రి బేధం లేని
సమయాన్ని గడిపాము
ఎక్కడ ఉన్నామో, ఏమేమి చేసామో,
అనురాగ బంధం పెనవేసుకొని
మై మరిచాము,
సముద్రఇసుక తిన్నెల
పరుపుపై పవళించాము
గుండెల్లో ఆలయాలు కట్టుకొని
ప్రతిమలై ఉన్నాము

అర్దాంతరంగా కనుమరుగయ్యి
నా జీవితాన్ని చీకటిలో ఉంచి
నీదారినువ్వెళ్ళి పోయిఒంటరి చేసావు
నా జీవితంచుక్కాని లేని నావల,
నీ జ్ఞాపకాలతో నడిసముద్రం నీటి పైతేలుతూ , ఊగుతుంది
కడలి లో కలసిన నా కన్నీటి
దారలు,లక్షల అక్షరాలు అయి నా సందేశాన్ని నీకు పంపాలి
నువ్వు మరిచిన నన్ను,
మరల నీకు చేరువ చెయ్యాలి
నీ జ్ఞాపకాలు నను వీడలేదు
నీపరిచయాన్నిమరువలేను.
కనిపిస్తావో, కాటికి పంపుతావో
కలల ప్రపంచాన్ని చూపిస్తావో
కన్నీటికథగామిగుల్చుతావో…మరువలేను మనపరిచయం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!