చావుబ్రతుకులు

చావుబ్రతుకులు 

రచన::బండి చందు

నాకు తెలిసి
ఈ ప్రపంచంలో చావు బ్రతుకులు
అనేవి రెండూ లేవు
బ్రతక లేకపోవడమే చావు
చావు రాకపోవడమే బ్రతుకు
అప్పుడెప్పుడో పుట్టాను
ఇప్పటికీ బ్రతకడానికి భయపడుతున్నాను
గతం నన్ను గాయపరిచింది
అందుకే నిన్నటి రోజుని తలచుకోలేను
భవిష్యత్తు హెచ్చరిస్తున్నది
ధైర్యంగా సమస్యలతో పోరాడమని
ప్రస్తుతం ప్రశ్నిస్తున్న బదులు
ఇవ్వగలిగే జ్ఞానం మాత్రం శూన్యం
నిశ్శబ్దపు యుద్ధం మొదలైందని
మౌనం నన్ను ఆవహించేసింది
బ్రతికే అర్హత క్షీణిస్తుందని
మరణం మర్యాదగా శాసిస్తున్నది
బాధ్యతలను మరిచి అలిసిన భుజాలపై
ఆలనాటి బరువు భారమవుతున్న వేళా
నేను నమ్మిన నిజాలు ఇంకా
అబద్దాలనే మోస్తున్నాయి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!