నువ్వు వస్తావని

నువ్వు వస్తావని

రచన::నాగ మయూరి

 కనులు కాయలుకాచేలా  ఎదురుచూస్తున్నా  నువ్వు వస్తావని

ఎండ వేడిమి తాళలేక సతమతమవుతూ నీరాకకై  తపిస్తున్నాను

నల్లని కారుమబ్బుల మాటున దాగి      ఊరిస్తావే కానీ నింగిని విడిచి నన్నుచేరగ రావే

మెల్లగ నువ్వు పుడమిని ముద్దాడు వేళ
వెల్లి విరిసేటి సుగంధ పరిమళాలను ఆశ్వాదించాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది

ఉరుములు శబ్దాలతో భయపెడుతూ
మెరుపుల తళుకులతో  ఊరిస్తూ
నింగిలోనే  దాకుంటివి

నీ ఆగమన సూచికలు కనపడగానే లేడిపిల్ల లా పరుగెత్తి డాబాపై ఉన్న బట్టలన్నీ తెచ్చేశా

నీవు తెచ్చే చల్లదనాన్ని ఆశ్వాదిస్తూ సేవించుటకు తేనీటి విందు సిద్దం చేశా

అయినా  రాక, అలిగి కూర్చుంటివి ఏల నేస్తమా!

నువ్వు వస్తావని మహీరుహము లన్నీ ఎదురు చూచుచుంటివి
నీ ముత్యపు చినుకుల స్పర్శతో పులకించాలని పత్రములు ఆరాట పడుచున్నవి

అలక మాని ,చల్లని గాలులతో కూడి మము పరవశింపచేయగా రావా వాన

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!