నీలి మేఘాలు కురిసిన వేల

నీలి మేఘాలు కురిసిన వేల

రచన::బండారు పుష్పలత

నాకు ఈ రోజుసాయంత్రం ఎందుకో..
మనసు బాగోలేక…
బాల్కనీ లో వచ్చి కూర్చుని..
బయట వైపు చూసాను.. అప్పుడే బూడిద రంగు ఆకాశంలో నారింజపండులా వున్న సూర్యుడు నన్ను పలకరిస్తూ…
ఉదయం నుండి ఏడుగుర్రాల పై ప్రయాణం సాగించి…
పొద్దంతా డ్యూటీచేసి అలసిపోయెన ట్రాఫిక్ పోలీసులా…
పడమరవైపు మెల్లగా మబ్బుల్లో కి దిగివెళ్లిపోయాడు..
అంతలోనే ఆదర బాదరాగా..
ఈదురుగాలి మొదలైంది..
ఆ ఆకాశం గర్జనలు వింటూవుంటే.. .
కొంటె పనులు చేసిన పిల్లవాణ్ణి అమ్మ బెదిరించే అరుపుల్ల వున్నాయి..
ఆ అరుపులకి బయపడి వర్షం తడిపేస్తుందని తెలుకొన్న చుట్టుపక్కలవాళ్ళు ..
పొద్దున ఆరేసిన బట్టలని ఇళ్లలోకి చేర్చేప్రయత్నం లోవున్నారు….
అంతలోనే ఆకాశమంత నిలి వర్ణనాన్ని నింపుకొని పిలవనిచుట్టంలా…. ఆణిముత్యాల వంటి చినుకులు జాలువారుతు ముద్దుగా… ఈనగరంలోనిఏతైనా.. భవనాలను ముద్దాడుతూ వయ్యారంగా కిందికి జారీ వరదగా మారి సిమెంటు రోడ్డు పైవున్న చెత్త నంత తనలో కలుపుకొని ప్రయాణం సాగిస్తోంది…
ఆ వర్షపు నీళ్లు ఆలా వెళుతూ వెళుతూ మోరీతో డ్రైనేజి లో కలిసి కల్తీ అయిపోయాయి… మరి ఆదివెళ్లి మూసీలో కలుస్తుందేమో?…
అవినీతితో కూడుకున్న రాయకీయనాయకు లంతా ఒకే పార్టీలో చేరినట్లు …
అంతలో చీకటి ముసిరింది..
ఎప్పుడు వాహనాలతో బిజి గావుండే ఈనగరపురోడ్లన్నీ
ఇంకా హడావిడిగా మారాయి..
వర్షపు నీటిలో మునిగి…
నదిలో తెలుతున్న పడవళ్లా..
వాటి యజమానులు పడవ జాలరుల్లా…
తొందరగా ఇంటికి వెళ్ళడానికిచూస్తూ… తడిసిముద్దయిన రోడ్డు లో ఎటువైపు వెళ్లాలో తెలియక నీళ్లు అక్కడే దిక్కుతోచని స్థితి లో నిండి వుంటే ఆనీళ్ళతో
వాహనదారులు కుస్తీ పడుతున్నారు…
ఇంకొంత మంది గొడుకులు వేసుకొని టైంపాస్ గా వేడివేడి పల్లిలు నెమరు వేస్తూ రోడ్డు పై ట్రాఫిక్ మరి ట్రాఫిక్ పోలీసులు పడుతున్న కష్టాన్ని నవ్వులాటగావీక్షిస్తున్నారు…
అంతలో నే మావారు బాల్కనీలోకి వచ్చి ఏమండోయ్ శ్రీమతి గారు..
ఈ వర్షం పడుతున్న వేల సాయంత్రం చలిలో
వేడి వేడి మిర్చి చేద్దురు రండి అంటు అర్దరు వేసారు..
మరి శ్రీవారి అర్దరు చేయక తప్పుతుందా అంటూ లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాను ….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!