మళ్ళీ రావా!

మళ్ళీ రావా!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

నన్ను అడగకుండానే, నా మదిగదిలోకి చేరావు
నా ప్రమేయం లేకుండానే, నా మదిని నీ సామ్రాజ్యం చేసుకున్నావు
నా అనుమతి లేకుండానే, నా గుండెని తాకావు
నా గుండెగూటికి నీవే సామ్రాజ్ఞివయ్యావు
నువు లేని నన్ను ఊహించలేనంతగా నన్ను మాయ చేసావు
నాలో నేను లేనంతగా నన్ను మరిపించావు
నీదే ఈ జీవితం అంటూ రంగుల కలలే చూపావు
మన భవిష్యత్తు పై ఎన్నో ఆశలు రేపావు
కానీ చివరికలా కలలన్నీ కల్లలు చేసి
నను ఒంటరిగా చేసి వెళ్ళిపోయావు
నువ్వు లేని లోకంలో ఏకాకినై ఉన్నాను
ప్రేమ లేని ఈ లోకంలో అనాథలా మిగిలాను
నీతో నా జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
నీతో పంచుకున్న భావాలు నా గుండెని తడుముతున్నాయి
నీతో గడిపిన క్షణాలు నా మనసుని మెలిపెడుతున్నాయి
నీతో మాట్లాడిన మాటలు నా కంటిని తడిపేస్తున్నాయి
నీ ఊసుల బాసలు గుండె చాటున దాగనంటున్నాయి
నీ చూపుల బాణాలు రెప్పల మాటున దాగనంటున్నాయి
తిరిగి రావా ప్రియతమా, ఒక్కసారి నాకోసం!
మళ్ళీ రావా నేస్తమా, నిను ప్రేమించే ఈ మది కోసం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!