రంగుల ప్రపంచం

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

రంగుల ప్రపంచం

రచయిత :: సావిత్రి కోవూరు

స్థాయిలను నీవే గుర్తించుకో, నీ గమ్యం ఏంటో నీవే ఎంచుకో,
అందరాని ఆశలకు పోయి అగచాట్ల పాలై, అల్లల్లాడకు,

అందంలో రంభవనీ,ఊర్వశివనీ ఆకాశానికెత్తేస్తారు, నటనలో నటరాజుకే గురువువని ములగ చెట్టు ఎక్కిస్తారు,

ఆత్మీయుల మంటారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు,

అవివేకంతో నమ్మినవంటే, అధఃపాతాళానికి తొక్కేస్తారు,

రంగు రంగుల ప్రపంచంలో, రాజ్యాలేలుతావంటారు, రంగులు మార్చే ఊసరవెల్లులు కొందరు,

వారి మాటలు నమ్మావంటే నీ జీవితమే హారతి కర్పూరం అవుతుంది,

కలలు కంటూ కూర్చోకు, కలలను నిజం  చేసుకునే దిశగా అడుగులు వేయి,

కృషి, సాధన, దీక్ష, ధైర్యమే నీ కోరిక సాధనాలు పట్టుదలతో సాధించలేనిది ఏమీ లేదు.

అర్హతలన్నీ సాధించు, అంబరమే నీకు హద్దు అవనిలోని ఆనందమంతా నీ సొంతమే,
అందరూ హారతి పడతారు

ముఖప్రీతి మాటలకు లుంగితివో ముఖము చూపలేని స్థితికి వస్తావు

నీ అర్హతలు ఎరిగి మసులుకో, అందరాని కోరికలకు ఆశ పడకు,

ఆకాశానికి నిచ్చెన వేసినట్టు, ఆధారం లేక కుప్పకూలేవు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!