పరిణయ మధురిమలు

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

పరిణయ మధురిమలు

రచన: క్రాంతి కుమార్

మాట పెదవి దాటని క్షణాన
అహం అలంకారమై నిలుస్తున్నప్పుడు
మనసు మౌనంగా వేధిస్తున్నా
అపార్థం శిఖరమై నిలిచే వేళలో
చిలిపి సరసాలు తుంటరి గాలితో
అలకల సరాగాలను గుర్తు చేస్తూ
కష్టాల కడలిని చిరు నవ్వుతో
అలవోకగా దాటిన జంట ఏదని ప్రశ్నిస్తూ
ఉల్లాస తీరంలో తోడుగా ఒకరికి ఒకరై
నడిచిన అడుగులేవని అడుగుతూ
గడచిన సమయంలో చెప్పుకున్న
ఊసులేవని మదిని సృజిస్తూ
గడపాల్సిన కాలానికి కలిసి చేసుకున్న
బాసలు జాడ కానరాలేదని
మధురమైన ప్రేమ అనురాగ క్షణాలు
ఊహల్లో గుసగుసలాడుతున్నాయి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!