ఆశల దేహం

ఆశల దేహం

రచయిత: స్వప్న మేకల

ఏ గమ్యం వైపో ఊపిరి పయనం
ఏ ఆశల వెంటో ఊహల ప్రయాణం..
కదిలే మబ్బుల్లా అంతరంగపు ఆలోచనలు
ఎగిరే పక్షుల్లా ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి…

ఆకుపచ్చని ఆశలు అవధులు దాటి
ఏ తీరాన్నో చేరాలనుకుంటాయి..
చిక్కుముడిని విప్పి చింతలేని
జీవనాన్ని గడిపేయాలనుకుంటుంది..

స్వార్ధపు తొడిగిన దేహం
ఆశల నిచ్చెన ఎక్కి రెక్కలు విప్పింది…
కలలొలికిన కన్నీటి తెర ఉప్పనై ఎగిసింది..
ఇపుడు మట్టితో దేహం కప్పబడింది..
చివరికి ఆశల నిచ్చెన మట్టిపై మళ్ళీ మెలిచింది..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!