మన్ను౼మిన్ను

// మన్ను౼మిన్ను //

 రచయిత:: ప్రసాదరావు రామాయణం

గురుతు చేసుకుంటున్నా తియ్యని.కన్నీటితో
పచ్చని చేలలో స్వచ్ఛమైన పైరుగాలి తింటూ
పరువెత్తిన రోజులు
ఆ చెట్లగాలితో ఆ పక్షులతో
సహజీవనం చేసిన రోజులు
ఆ పచ్చని పొలాల్లో ఈనాడు
పురుగుమందులూ ఎరువుల కంపూ!

గురుతు కొస్తున్నాయి
ఆనాడు కొలనులో కమ్మని నీరు త్రావిన రోజులు
కలువపూలు కోసుకుంటూ!

నిజం చెప్పు మిత్రమా,!నీటిని.కొనడం.లేదా ?
ఖర్మ కాలి గాలినీ కొంటున్నావు
ప్రకృతిమధనం చేసావు అత్యాశల పర్వతంతో
అమృతం పుడుతుందని ఆశిస్తూ
అఘోరించు హాలాహలం పుట్టింది
ఆ’ మిన్ను’ విషం
ఈ ‘మన్నూ’ విషం
ఆ గాలి విషం
ఈనీరు విషం
ఆ అంబుధి విషం
నీ అన్నపు మెతుకు విషం
నీ మస్తిష్కమూ విషం
నీకు నువ్వే విషం
నీవు కూర్చున్న కొమ్మను నీవే
నరికేశావు
ఇప్పుడు ఏడ్చి ఏం చేస్తావులే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!