తెలియని లోకం

తెలియని లోకం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

మనిషి పుట్టేది భూలోకం
పెరిగేది మరోలోకం
ఊహలు పండించుకొనేది ఒక లోకం
కళలు కనేది ఒకలోకం
పుట్టిన ప్రతి మనిషి తేలుతారు
ఎదో లోకంలో
జీవించే ప్రతి జీవికి ఉనికే ఒకలోకం
పనిచేసే వారికి పనే లోకం
సోమరి పోతులకు నిద్రేలోకం
చదువు కొనే వారికి చదువేలోకం
వయస్సు వచ్చిన వారికి ప్రేమే లోకం
కొత్త జంట కి అదోలోకం
భార్యభర్త లకి పిల్లలే లోకం
కొత్త పెళ్ళి కొడుకుకి భార్యే లోకం
తాగుబోతు కు మత్తే లోకం
దైర్యవంతుడిది ఒక లోకం
పిరికి వానిది ఒకలోకం
వ్యసనపరుడికి వ్యసనమేలోకం
సంపాదించేవారికి డబ్బే లోకం
అత్తకి కోడలే లోకం
బిక్షగాడికి పొద్దే లోకం
భక్తుల కు దైవారాదనే లోకం
రాజకీయ నాయకులకు పదవే లోకం
ఇలా పుట్టిన మొదలు మనిషి
చూసే లోకాలు కొల్ల
మనిషి ఆశించే లోకం దేవలోకం
మనిషి చివరికి చేరేది యమలోకం ఈమధ్య లో ఉండే లోకాలు
ఊహా లోకాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!