పర్యావరణం – పచ్చదనం

పర్యావరణం – పచ్చదనం

రచయిత :: మోదేపల్లి. శీనమ్మ

పుడమికి పసిడి కాంతులనిచ్చు పచ్చదనం
ప్రకృతమ్మను పరవశిoపజేయును హరితవనం
ప్రతి ఇల్లు కావాలి ఊపిరిని అందించు సంజీవనం
ఊరూరా అందరూ నాటాలి అశోకవనం

స్వచ్ఛమైన గాలితో సంతోషంగా ఉండదా మన భూతలం
మండే ఎండలో సైతం పర్యావరణం కాదా శీతలం
మొక్కలు నాటి అవుదాము మనం మంచి వ్యక్తులం
మనకి మనమే ఆక్సిజన్ అందించు దాతలం

భావి తరాలకు ఆరోగ్యపు బతుకులిద్దాం
భాధ్యతగా మొక్కలు నాటి ప్రాణవాయువునిద్దాం
నీడనిచ్చు తరువులు నరకడం మానేద్దాం
పండ్లనిచ్చు చెట్లను ఏపుగా పెరగనిద్దాం

ప్రకృతి విపత్తుకు కారకం కావద్దు
పర్యావరణమును కలుషితం కానీయొద్దు
జీవ రాసులకు ద్రోహం తలపెట్టవద్దు
జీవన మనుగడలో నిప్పులు కురిపించవద్దు

అందరూ నాటాలి పట్టుదలతో మొక్కలు
పర్యావరణ పచ్చదనం తెస్తుంది సంతోషాలు
ఇకనైనా మారాలి మానవ వైపరీత్యాలు
ఆహ్లాదంతో నిండాలి అందరి జీవితాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!