(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
ఆత్మవిశ్వాసమే తోడుగా
రచయిత :: కమల ముక్కు ( కమల’శ్రీ’)
చరిత్ర పుటల్లో స్థానం
సంపాదించాలనే తపన
భావితరాలకు ఆదర్శంగా
నిలవాలన్న కోరిక
కలలను సాకారం చేసుకునే
మనోధైర్యాన్ని ప్రోది చేసుకుంటూ
ఆశయాల లోకాన్ని చేరేందుకు
ఆకాశానికి నిచ్చెన వేసా
అడుగడుగునా ఎదురయ్యే
అవాంతరాలను దాటుకుంటూ
ఒక్కోమెట్టూ ఎక్కుతూ
వెనక్కి లాగాలని చూసే
సవాళ్లను ఛేదిస్తూ
గెలుపు బావుటా ఎగరేస్తా
ఆత్మవిశ్వాసమే తోడుగా ఉంటే
అందని ఆకాశానికైనా నిచ్చెన వేసి
సులువుగా చేరవచ్చని రుజువు చేస్తా…!!!