ఫేస్బుక్ మాయలో

ఫేస్బుక్ మాయలో

రచయిత :: శ్రీదేవి విన్నకోట

ఫేస్బుక్ అనగానే  మనకి గుర్తొచ్చేది ఫ్రెండ్ రిక్వెస్ట్.

ఆన్లైన్ స్నేహాలతో ఒకపక్క అమ్మాయిలు మరోవైపు అబ్బాయిలు ఇద్దరు మోసపోతున్నారు. మనకి అవతల మాట్లాడేది అమ్మాయో అబ్బాయోతెలియదు.

మనకి ఎవరైనా ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగానే యాక్సెప్ట్ చేసి ఓకే చెప్పేస్తాం. అవతల మనతో స్నేహం చేయాలి అనుకునే వారి మనస్తత్వం ఎలాంటిదో మనకు తెలియదు. మనం ఎలాంటి వారమో అవతలి వారికి కూడా తెలియదు. ఇద్దరూ మంచివాళ్లే అయితే  ఎలాంటి గొడవలకు తావు ఉండదు. మంచి వాళ్ళు కాకపోతే నే అసలు గొడవలు మొదలవుతాయి.

ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు ఉన్నా మంచి వాళ్లకి ప్రాబ్లమే. నాకు  తెలిసిన వారికే నిజంగా జరిగిన ఒక విషయం  ఇక్కడ చెప్తాను.

నాకు తెలిసిన ఒక అమ్మాయి  తన పేరు ధాత్రి  తన వయసు 17 కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది . తనకి చాలా ఎక్కువ ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చాయి. చిన్న పిల్ల తెలియని తనం కావడంవల్ల తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ గా ఎక్సెప్ట్ చేసింది. చాలామందితో చాటింగ్ చేస్తున్నా అందులో ఒక అబ్బాయితో  తను మరి బాగా క్లోజ్ అయింది.

ఒక ఆరు నెలల పాటు వారి చాటింగ్ నిర్విరామంగా కొనసాగింది. పడుకున్నా కూర్చున్న తింటున్న ఏం చేస్తున్నా రోజుకు ఉన్న 24 గంటల్లో 16 గంటలు ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తూ ఉండేది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. అందం మీద శ్రద్ధ పెరిగింది. ఎప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా ఉండే  ధాత్రి  ఈసారి క్లాసులో మొదటి పదిమందిలో  కూడా చోటు దక్కించుకోలేకపోయింది.

సెల్ఫోన్  తన లోకం అయిపోయింది.  తల్లిదండ్రుల ఉద్యోగస్తులు కావడం ఏప్పుడు బిజీగా ఉండడంతో  కూతురికి కావాల్సిన సౌకర్యాలన్నీ అమర్చే వారు. తాను ఎప్పుడూ బాగా చదివే అమ్మాయి కావడంతో తన చదువు గురించి తను ఏం చేస్తుంది అని అంతగా  పట్టించుకునే వారు కాదు. ధాత్రి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫేస్ బుక్ లో కొత్తగా పరిచయమైన అబ్బాయితో అలా రోజుకి 10 గంటల చాటింగ్  చేస్తూ  హాయిగా  వారి స్నేహం రోజు రోజుకీ వృద్ధి చెంది చివరికి ఒకరినొకరు చూసుకోవాలి ఒకరినొకరు కలుసుకోవాలని అనిపించేంత బాగా దగ్గరయ్యారు.

అలా అనుకున్నదే తడవుగా ఓ అందమైన సాయంత్రం ఇద్దరూ ఓ పార్క్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ధాత్రి అసలే అందమైన అమ్మాయి. మరింత అందంగా పుత్తడిబొమ్మలా తయారైంది. అతను చెప్పిన సమయానికంటే  ఒక అరగంట ముందే ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్న ప్లేస్ కి వెళ్ళింది. వెళ్లిన  ఒక అరగంట కి అతను వచ్చాడు. అతన్ని సర్ప్రైజ్ చేయాలని ఒక చెట్టు చాటున దాక్కుని ధాత్రి అతను ఎలా ఉంటాడో చూడాలనుకొంది. అతను ఆ దాత్రికి చెప్పినట్టే వైట్ కలర్ షర్ట్. బ్లూ కలర్ జీన్స్ లో అక్కడికి వచ్చాడు. వచ్చి ధాత్రి కోసం వెతుక్కో సాగాడు. అతన్ని చూసిన దాత్రి  ఒక్క సారిగా షాక్ కు గురయింది. అతనికి కనిపించకుండానే కోపంగా ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది.

నా పేరు రమణి. వాళ్ళ ఇల్లు మా ఇంటికి నాలుగిళ్ల అవతలే ఉంటుంది. వాళ్ళ అమ్మ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అప్పుడే ఏదో పని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత తను వచ్చి తలుపు తీసింది. కళ్ళు వాచిపోయి ముక్కు మొఖం ఎర్రగా కందిపోయి ఉంది. ఏమైంది అలా ఉన్నావ్ అని అడిగాను. ఏమీ లేదంటూ తప్పించుకోబోయింది.కాస్త బుజ్జగించి లాలనగా అడిగేసరికి నన్ను హాగ్ చేసుకుని బోరున ఏడ్చేసి జరిగిందంతా చెప్పేసింది.ఇంతకీ ధాత్రి ఇన్ని రోజులు చాటింగ్ చేసింది తాను ఎప్పుడు పూలు కొనుక్కునే  పూలకొట్టు నారాయణ అనే అతనితో. ఇతనికి 40 ఏళ్ళు ఉంటాయి ఇంచుమించు ధాత్రి తండ్రి వయస్సు ఉంటుంది.అతనికి పెళ్లి అయ్యి  ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దాత్రికి గులాబి పూలు అంటే చాలా ఇష్టం. రోజు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు గులాబీ పూలు కొనుక్కుని అతని  పూల కొట్టు ముందే తను రోజు కాలేజ్ బస్సు  ఎక్కుతుంది. అప్పుడే ఏదో మాటల సందర్భంలో తన ఫేస్ బుక్ ఐడిని ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటే నారాయణ విన్నాడు. విని ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆమెకు తన పేరు కాకుండా కొంచెం స్టైలిష్ గా ఉండే వేరే పేరుతో  ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ తర్వాత ఇంత కథ నడిచింది. ఆ దెబ్బతో దాత్రికి గులాబీల పై ఇష్టం. ఆన్లైన్ స్నేహం పై నమ్మకం రెండు పోయాయి.

ఆ తర్వాత ఆ ధాత్రి ఫేస్బుక్ వాట్సప్ అన్ని యాప్స్ అకౌంట్స్ డిలీట్ చేసేసింది. ఆ పూలకొట్టు వైపు కన్నెత్తి చూడడం కూడా మానేసింది. నాలుగైదు సార్లు అతను పలకరించడానికి ప్రయత్నించినా కొట్టినంత సీరియస్ గా చూడడంతో అతను మూసుకుని గమ్మున ఉండిపోయాడు. అతను ఎంబీఏ చదువుతున్నానని చెప్పలేనంత ఆస్తికి ఒక్కడినే వారసుడిని అని తను చాలా హ్యాండ్ సమ్ గా అందంగా ఉంటానని ఇంకా చాలా సొల్లు కబుర్లు చెప్పాడు అని ధాత్రి నాతో చెప్పింది. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు  ఆంటీ కనీసం వయసు అయినా చిన్నది అయి ఉండాలి కదా నాకు ఈడు జోడుగా అని తను అంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తర్వాత నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను.అమ్మ నాన్న తన కోసం ఎంతో కష్టపడుతున్నారో ఆడపిల్ల ఈ రోజుల్లో ఎలా ఉంటే  మంచిదో ఆన్లైన్ స్నేహాన్ని ఎందుకు నమ్మకూడదో.  ఈ వయసులో ఏర్పడేది అంతా  ఆకర్షణ అని. నువ్వు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని. నీకు ఎలాంటి వ్యక్తి కావాలో మీ అమ్మానాన్నలకి నీ కంటే బాగా తెలుస్తుంది. వాళ్లు అన్ని విధాలా యోగ్యుడైన వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు .అప్పటివరకు నువ్వు తొందర పడకు అని తనకు నచ్చచెప్పాను. సరే ఆంటీ ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను ఒకసారి నాకు బుద్ధొచ్చింది అని  తను చెప్పాక ఆప్పుడు  నా మనసు కుదుట పడింది. ధాత్రి  చదువు విషయంలో చాలా తెలివైంది. ఆన్లైన్ స్నేహం విషయంలోనే మోసపోయింది. ఆడపిల్లలందరూ అంతేనేమో. ప్రేమ అనే వేడికి కొవ్వొత్తిలా కరిగిపోతారు.

ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. ఆన్లైన్ స్నేహాలతో ఆడపిల్లలే కాదు కొంతమంది మగ పిల్లలు కూడా మోసపోతుంటారు. మగవాళ్ళలో మోసగాళ్లే కాదు ఆడ ఆన్లైన్ కిలాడీలు కూడా ఉంటారు. కాబట్టి  మనమే జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి  అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది మంచైనా చెడైనా మన చేతులారా చేసుకున్న దానికి ఫలితం మనమే అనుభవించాలి. తప్పుచేసి అయ్యో అని ఏడ్చే కంటే ఎలాంటి తప్పు జరక్కుండా ముందే జాగ్రత్త పడడం ఉత్తమం అని ఆ అభిప్రాయం.  ఇది గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్క యువతి. యువకులు. పిల్లలు ప్రవర్తించాలి.

నేను కూడా ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్ నీ యాక్సెప్ట్ చేయను.

మన జాగ్రత్తే మన కుటుంబానికి రక్ష ఇది అందరూ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఆఖరుగా ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది. ఆన్లైన్ స్నేహమా నీకో నమస్కారం.

ఒక్క స్నేహ అభ్యర్థన. మనల్ని నెట్టేయ్యొచ్చు ఆదం పాతాళానికో. లేదా అవతలి తీరాలకో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!