మన..స్వేచ్ఛ

మన..స్వేచ్ఛ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీనివాస్ మల్లాడి

మనకూ ఉంది స్వేచ్ఛ
రెక్కలు నరుక్కోవడానికి
గొంతు నులుముకోడానికి
పన్నులు కట్టడానికి
పస్తులుండటానికి

మనకూ ఉంది స్వేచ్ఛ

అమ్మేదానికి రేటు
కొనేదానికి రేటు
అడక్కుండా ఉండటానికీ
మూకుమ్మడిగా
మన ఆత్మ లను మనమే
హత్యలు చేయడానికి
ప్రశ్నల కుత్తుకలు తెంపి
పాతరేయడానికి
మనకూ ఉంది స్వేచ్ఛ

ప్రజాస్వామ్యం ముసుగులో
ఓటు” తో చేసిన పాపం కడుక్కోవడానికి.
ఎందుకంటే
స్వేచ్ఛ ను మందుకీ,డబ్బు కీ
తాకట్టు పెట్టాం మరి.
విడిపించేందుకు “5”సంవత్సరాలు ఆగాలి మరి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!