దీప అందాలు అలంకారాలు

దీప అందాలు అలంకారాలు

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

ప్రకృతి లో చల్లని గాలులు మదిలో ఆనంద అనుభూతి నీ కల్జిస్తు ఎన్నో ఆనందాలు శ్రీ కారం చుట్టే ప్రకృతిలో ఈ పండుగ మనం చేస్తాము.

ఒక విధంగా గా ఇది అన్ని దేశాలు ప్రాంతాలలో ఉన్న చాలా రాష్ట్రాల వారు ఆనందంగా వారి వారి పద్దతిలో చేస్తూ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చేస్తారు.

ఈ పండుగ ముఖ్యంగా త్రయోదశి చతుర్దశి అమావాస్య బలి పాడ్యమి గా నూనె దీపాలు వాకిలి ముందు పెట్టాలి. అందంగా ముగ్గు వేసి రంగులు పువ్వులు పెట్టీ ఈ దీపం పెట్టీ పూజిస్తారు దీపంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నది సంధ్య వేళ ఈ లా గుమ్మం ముందు దీపం పెట్టడం వల్ల తప్పక శ్రీ మహా లక్ష్మీ మనింటికి వచ్చి తీరు తుంది ఉంటుంది అన్నది సత్యము..

త్రయోదశి నాడు యమధర్మరజు తన చెల్లెలు యమున దేవి నీ చూడటానికి వస్తాడు అందుకని ఇంటి ముందు దీపాలు పెట్టాలి. చతుర్దశి నరక సంహారం రోజు అందుకని ఆ రోజు దీపాలు పెడతారు దీపావళి రోజు రాక్షస సంహార ఆనంద పండుగగా దీపాలు పెడతారు ఇంక బలి చక్రవర్తి నీ పాతాళానికి వామనుడు తొక్కి పంపిన రోజు ఇలా ఈ పండుగ చేస్తారు. అయితే కార్తీక మాసం మొదలు అవుతుంది కనుక ప్రతి రోజూ దీపం పెడతారు. దీపావళి పేరు చెప్పగానే పటా సు లు స్వీట్స్ జ్ఞాపకం తెస్తాయి.

మట్టి ప్రమిదలో మంచి నూనె గుడ్డ వత్తి వేసి దీపం వెలిగిస్తారు అర్చి లలో వరుసలుగా అమర్చి వెలిగిస్తారు ఇంట్లో అడ మగ అంతా ఆనందంగా చేసే పండుగ ప్రతి ఏడు కొన్ని కొత్త ప్రమిదెలు కోని పెట్టడం చాలా మంచిది

విద్యుత్ దీపాలు వచ్చాక నిత్య నూతనంగా దుకాణాలు భవనాలు అలంకరిస్తున్నారు, అది అయితే వెలిగించడం తేలిక గాలికి ఆరకుండా ఉంటాయి నూనె దీపాలతో పాటు ఈ దీపాలు పెట్టడం ఒక్ అందము. మనం నరక చతుర్దశి రోజు పెద్దలు పిన్నలు కూడా అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టి లక్ష్మి పూజ చేసి స్వీట్స్ నివేదన చేస్తారు.

దీపావళి అమావాస్య రోజున సాయంత్రం పిల్లలచేత. విధి గుమ్మం లో ముగ్గు వేసి అలంకరించి ,గోగు మొక్కల కాండం పై పెద్ద వత్తులు నూనె లో నాని నవి వేసి వెలిగించి తూర్పుకు తిరిగి దిబ్బు దిబ్జు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి అని పడి గోగు కర్రలు నేలపై కొట్టి దక్షిణానికి పడెయ్యలి కాళ్ళు కడిగి కళ్ళు తుడిచి స్వీట్ తినిపించి దీవించి లోపలికి తెస్తారు. దీని వల్ల పితృదేవతలు సంతోషించి వంశం నిల బెడ తారు, ఆతరువాత అంతా పటా సుల పిల్లల చేత దగ్గర ఉండి కల్పిస్తారు నూలు వస్త్రాలు కట్టు కో వాలి

కాకర పువ్వా త్తులు మతాబులు చిచ్చబుడ్లు టపాకాయలు సిసింద్రీ లు తార జువ్వలూ భు చక్రం విష్ణు చక్రం సీరియల్ టపాకాయలు వెన్నముద్ద పాము బిళ్ళలు ఉల్లి పాయలు ఓ ట్లు ఇలా ఎన్నో రకాలు నేడు మార్కెట్స్ లో ఉన్నాయి ఎంత చెట్టుకు అంతా గాలి అని స్తోమత కొద్ది కొంటారు కానీ నూనె దీపాల వరుసలు మాత్రం అందరూ పెట్టాలి. ఈ పండుగ ముఖ్యంగా నరకాసుర వధ లో శ్రీ కృష్ణుని వెంట సత్యభామ ( భూదేవి ) కూడా ఉండి నరకుని వధించి మహిళల విజయానికి ధైర్య సాహసాలకు ప్రతీక గా తర తరాలకు ఆదర్శం ఆదేశము

దీపావళికి తెచ్చిన అట్ట పెట్టెలు అగ్గి,పెట్టెలు రాగి ఊచలు కొబ్బరి చిప్పలు అన్ని వా డి అందమైన వస్తువులు సో ఫాలు కుర్చీలు మంచాలు ఇల్లు వంటివి తయారు చేసి వ్యర్థాలతో అర్థాలు అలంకారాలు అందాల గా కళా త్మక సృజన చెయ్యి వచ్చును పిల్లలకి నేర్పా వచ్చును అని సంక్రాంతి బొమ్మల కొలువులో పెట్టవచ్చును.
కొందరు దశరా నుంచి సంక్రాంతి వరకు బొమ్మల కొలువు పెట్టీ ఉంచుతారు పుణ్య క్షేత్రాల నుంచి తెచ్చి బహుమతి ఇచ్చిన బొమ్మలు అన్ని దాచి ఈ కొత్త వస్త్వులు చర్చ్ అమర్చు తారు ముఖ్యంగా పెద్ద తిరుపతి చిన్న తిరుపతి శ్రీ కాళ హస్తి శ్రీ కాళహస్తి భద్రాచలం విజయ వా డ సింహాచలం శ్రీ శైలం లేపాక్షి ఎటీకొప్పక నిర్మల్ వంటి ప్రదేశాల బొమ్మలు దాచి బొమ్మల కొలువు పెడతారు. దీపావళి తరువాత రోజు పాద్య మి నుంచి కార్తీక మాస సందడి కార్తీక మాసం సోమవారాలు శని వారాలు నాగుల చవితి కార్తీక పౌర్ణిమ వంటి పుణ్యము నిచ్చే పండుగలు చేస్తారు శ్రీ శివ శ్రీ విష్ణు మూర్తి శ్రీ వినాయక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ కేశవస్వామి శ్రీ జనార్ధన స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ కృష్ణ స్వామి వారు దేవాలయాలలో ఆకాశ దీపాలు వంటి వి పెట్టీ ఈ పుణ్య రోజుల్లో ఉపవాసాలు చేసి అభిషేకాలు చేసి భక్తి చాటు కుంటారు ఇలా భారతీయ సంస్కృతిలో ఎన్నో మాసాలు పండుగలు మానవ జీవితానికి సంబంధించి న మెరుగులు ఆనందాలు.
ఒక విధంగా ప్రకృతిని పూజించడం వాతావరణ కాలుష్యాలు నిర్మూలించే పండుగ అని చెప్పాలి సూక్ష్మ క్రిముల నాశనము వల్ల వాతావరణ కాలుష్యం కొంచెం తగ్గుతుంది అని సైన్స్ చెపుతోంది పండుగలు మానవ జీవిత సౌభాగ్యాలు సిరి సంపదలు కూడా శాంతి శుభమ్.
అందరికీ శుభ కాంక్షలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!