మొదటిజ్ఞాపకం

మొదటిజ్ఞాపకం

రచన: పుష్పాంజలి

ఒక ఉన్నత పాఠశాలలో రెండుజడలతో ఒక బ్యాగ్ భుజమునకు తగిలించి వారి మామయ్యతో పాటు ఒకింతా ఆనందంగా అత్రుతగా  ఒకింతా బిడియంగా నడుస్తు ఉన్నా పాపతో ఇదే చిట్టితల్లి నీ తరగతి గది  అని వదలిపెట్టారు వాళ్ళ మామయ్య అలాగే వెనుదిరిగినారు.

అది ఆరవతరగతి బి/సెక్సన్ తరగతి గదిలోకి బిత్తరచూపులతో  వెళ్ళింది.అక్కడా కొంతమంది పిల్లలు అప్పటికి చేరి ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు.

ఆ చిట్టితల్లి  పేరు ఆకాంక్ష   తరగతి గదిలోకి వెళ్ళి మొదటివరుస వదలి రెండవ వరుసలో కూర్చొడానికి సంసిద్ధం అయ్యింది ఆకాంక్ష  .. ఆ ప్రక్కనే వాణి ఇటువైపు మతి , భవానీ ముందు ఉషా, గీతా, ఉషారాణి ,జయపద్ర తన వెనుక లైన్ లో  ఈశ్వరి అమరావతి  తనకు కూడ వైపు లైన్ లో అబ్బాయిలు శ్రీను ,సతీష్ రమణ, వేంకటేష్ శేఖర్ ,సత్యా, కూమార్  అటువైపు కూర్చొని  ఉన్నారు.

ఒకరికి ఒకరు  పరిచయం చేసుకున్నారు. తన పేరు చెప్పింది అకాంక్ష అని చెప్పాంగానే అబ్బా నీ పేరు చాలా బాగుంది నీలాగే అన్నారు అందరు  అకాంక్ష చిరునవ్వు నవ్వి ఊరుకొంది . క్లాసు టిచర్ రావడముతో  క్లాసులో నిశ్శబ్దం ఎర్పాడింది. సార్ తనకు తను పరిచయం చేసుకుంటూ నా పేరు ప్రవీణ్ రెడ్డి  అంటూ మీకు ఇంగ్లీషు మాస్టర్ ని అని వరిచయం చేసుకున్నారు.

అందరి పిల్లలను నిలబెట్టి  పేర్లు తెలుసుకున్నారు
అకాంక్ష వంతు వచ్చింది తన పేరు చెప్పింది  నీ పేరు నీవ్వు రెండు అందంగా ఉంది అమ్మాయి అంటూ మాస్టర్ కితాబ్ ఇచ్చారు  . ఆ తరువాత  ఇంగ్లీషు ఉపవాచకం  మొదటిగా కథతో మొదలు  పెట్టారు
అందరు శ్రద్ధగా విన్నారు ఆ తరువాత ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. మధ్యలో  రేపటికి ఒక నాలుగు ప్రశ్నలు ఇస్తున్నాను రేపు నేర్చుకొని రావాలి గంట మ్రోగడంతో ఆ మాస్టర్  నిష్క్రమణ  తెలుగు సారథి మాస్టర్ గారు వచ్చారు.

తెలుగు మాస్టర్  సారథి గారు క్లాసులో  అందరిని పరిచయం చేసుకున్నారు   తరువాత ఒక చిన్న కథ చెప్పారు  అలా ఆరోజు ఆందరు క్లాసు టీచర్లు రావడం పరిచయం చేసుకోవడం తోటి ఆరోజు గడిచిపోయింది.
తరువాత రోజు ప్రశ్నలు వేసివారు అన్నింటిలోను చురుకగా ఉండేవారు ఒక ఆరుమంది ఉండేవారు.

అకాంక్ష  స్వతహా  చాలా తెలివైంది చాల ధైర్యం అయ్యింది కానీ , ఆ దైర్యం అవసరము అయినప్పడు బయటికి వస్తుంది  ఆటలు ఆడాలి ఆంటే పిల్లలు అందరు అకాంక్ష జట్టు  ఒకరోజు కబడీ ఆడాలి అనుకున్నారు , భవానీ అకాంక్ష నేను మాత్రం నీ జట్టు ఎవరి సంగతి ఎలాగైనా పోనీ , అలాగే లే భవానీ  ఆడపిల్లలు అందరం ఒకే జట్టుగా  ఉందాం  ఏ విషయంలోనైనా సరేనా .

అలా మొదలైన పాఠశాల జీవితం ఆటలు ఆనందంగా దొర్లుతున్నాయి.రోజులు నిమిషాలలా ,ఎవ్వరి కోసము కాలం వేచి చూడదు కదా ? అది జట్టు పిల్లలు మధ్యలో పొటీ నడుస్తోంది 8వ తరగతికి వచ్చారు పిల్లలు.

ఒకరోజు స్కూల్ లో టూర్ వేసారు  2రోజుల టూర్ అది వేకువజామున బయలుదేరి వెళ్ళితే మరునాడు రాత్రికి ఇంటికి తిరిగిరావచ్చు అని   అది మద్రాసు టూర్ మహబలిపురం గోల్డన్ బీచ్  అష్టాలక్ష్మి గుడి ,మెరిన్ బీచ్ అక్కడ చాలా ప్లేస్ లు తిరిగి రావాలని ప్లాన్ తో బయలుదేరినారు  టూరిస్ట్ బస్సులో పిల్లలు అందరు ఉత్సాహంగా  ఉన్నారు .

బస్సు బయలుదేరింది చెన్నై చేరింది  గుడి దర్శనం తరువాత బీచ్ లు దగ్గర  అందరు జట్టుగా ఉన్నారు అందరికీ కన్నా కాస్తా పెద్దగా అనిపించే ఈశ్వరి తను కూడా అంకాక్షతో ఉంది .

గోల్డన్ బీచ్ లో ఆకాతాయిలు  గోల ఎక్కువగా ఉన్నప్పటికి బీచ్  అక్కడ రాజు లా ఉండే  ఇద్దరు వ్యక్తులను నవ్వంచిడానికి ప్రయత్నం చేసారు. ప్రయోజనం శూన్యం కానీ సరదాగా గడిచిపొయింది .

మహాబలిపురంలోని సముద్రంలోకి  దిగినారు అందరు  అందులో  వాణి జారిపడింది. అకాంక్ష  ఎలాగో దిగి తనను నేర్పుగా లాగింది  లేకుంటే ఆ అలలుతో పాటు లోపలికి వెళ్ళిపోయ్యి ఉండేది వాణి ప్రాణం రక్షించినందుకు టిచర్స్ తో పాటు విద్యార్థులు అందరు అభినదించారు అకాంక్షని. అయ్యో నేను ఏమి అంతా గొప్పపని చేసాను అని , లేదులే టిచర్  నేను  కొంచం లౌక్యంగా ధైర్యం ఉపయోగించినాను  అంతే.

మహాబలిపురం రోడ్డు మీదాకి వచ్చి కుడావైపుకి తిరిగారు అక్కడా టిచర్స్  ఉండడంతో  కొంతదూరంలోనే  ఒక కొండ ఎక్కాలి …అందరు అక్కడ  పురాతనమైన కట్టడాలు వింతలు చూస్తున్నారు మైమరిపొతూ   పై నుండి చూస్తూంటే ఆనందముగా ఆహ్లాదకరంగా ఉంది .

అకాంక్ష గమనించికుంది తమతో పాటు ఉండవలిసిన ఈశ్వరి కనపించలేదు  అంతే  తనకు ఆ కట్టడాలు వెనక్కి పరుగుతీసింది ఒక్కతే … కొంచం గుబురుగా ఎత్తుగా ఉంది  అక్కడ  బయటకు లోపల ఏమి జరుగుతుంది కనిపించి అవకాశం లేదు .ఆంతా గుబురుగా పెద్ద పొదలా ఉంది .

ఆ పొద వెనక్కి వెళ్ళింది అకాంక్ష ఒక్కతే అంతా అక్కడ ముగ్గురు కుర్రాళ్ళు చెన్నె గోల్డన్ బిచ్ నుండి పాలో ఉయినట్లు ఉన్నారు. వాళ్ళు డిగ్రీ చదవే వయస్సు ఉన్నవారు ఈశ్వరిని లాగుతున్నారు…. తను తప్పించికోవడానికి ప్రయత్నం చేస్తుంది .ఆ దృశ్యం చూసిన అకాంక్ష కి ఒక్కనిమిషం బుర్ర మొద్దుబారింది
చటుక్కున ఒక ఆలోచన వచ్చింది అంతే సార్ మేడమ్ మన ఈశ్వరి ఇక్కడ ఉంది మేడమ్ అని అరవసాగింది.
దానితో ఆ కుర్రాళ్లు ఆ  అమ్మాయిని వదలి ఇంకా పైకి గుట్టు మీదాకి  పరిగెత్తారు.

అకాంక్ష ఒక నిమిషం ఆలస్యం చేయకుండా ఈశ్వరి చేయి పుచ్చుకుని లాక్కుని పరిగెత్తి  తమ సముహం దగ్గరకు పరుగుతీసీంది  ఈశ్వరి భయపడి ఉన్నప్పటికీ అడగింది మేడమ్.సార్ లు ఎక్కడ అని,  నేను ధైర్యం తెచ్చుకుని తెలివిగా అలా అరిచినాను..  వాళ్ళు ఎవ్వరు లేదు ఇక్కడా మనమే అక్కడికే వెళ్ళదాం  .

ఈశ్వరి తీసుకుని వస్తుంటే సార్ లు మేడమ్ వాళ్ళు చూసి ఎదో జరిగింది అని గ్రహించి అకాంక్ష వైపు వచ్చారు .ఏమి జరిగింది అని అడగానే ఈశ్వరి ఒక్కటే ఏడుపు అప్పుడు  జరిగింది చెప్పింది ఏమిటి అంటే ఈశ్వరి కాస్తా వెనుకకు ఉండే ఆమెను చూసిన కురాళ్ళు వచ్చి గట్టిగ నోరు మూసి వెనక్కి లాక్కుని వెళ్ళిపొయారు సరిగ్గా అది సమయంలో అకాంక్ష అక్కడికి రావడం తనను రక్షించిన వైనం చెప్పసాగింది ఈశ్వరి

అందరు అకాంక్ష చుట్టుముట్టి అబినందనలు తెలియచేస్తూ ఉన్నారు మేడమ్స్ ఏకంగా అకాంక్ష కు ముద్దులు పెట్టాసాగారు .. అటువంటి క్లిష్ట సమయంలో మంచి తెలివి ధైర్యం ఉపయోగించే ఒక అమ్మాయి మానప్రాణులు కాపాడింది అని పొగడ్తలతో ముంచుతున్నారు.

అందరు బస్సు ఎక్కారు ఇద్దరు ప్రాణములును కాపాడిన అకాంక్ష హిరోయిన్ అయ్యింది . జెండావందనం ఆగష్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం ఆరోజు కలెక్టర్ గారి చేతులు మీదుగా ఒక అవార్డు తీసుకుని అకాంక్ష మాట్లాడుతూ నేను ఎదో మొండిగా సాహసం చేసినాను కాని దీనికి ముఖ్యంగా నా తల్లితండ్రులు గురువులు  నా సమయస్ఫూర్తికి కారణమైన వారు ,ఈ గొప్పతనం నాది కాదు అని స్పిచ్ ఇస్తుంటే  ఇంకా గొప్పగా  అనుకుంటున్నారా  అకాంక్ష గురించి ప్రజలు అధికారులు  టిచర్స్ .

చాల రోజులు వరుకు ఆ సంఘటన ఎవ్వరు కూడా మర్చిపొలేదు  పేపర్ లో రావడం తన కూమారై ఫోటో అది చూసి అందరు పొగుడుతూ ఉంటే అకాంక్ష తమ కూమారై అయినందున చాల గర్వంగా ఉంది  బంధువులతో తల్లితండ్రులు అంటూ ఉంటే  అది విన్నా అకాంక్ష ఒక సాహసం నాకు మరిచిపొలేని మొదటి జ్ఞాపకం ఇచ్చింది కదా ఆనుకుంది. నేను జీవించి ఉన్నంతకాలం ఇది గుర్తుకు వస్తే ఆ అనుభూతి బాగుంటుంది. నా మొదటి జ్ఞాపకం ఎప్పటికీ ఇదే.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!