క్రిమి సంహారానికై

క్రిమి సంహారానికై

రచన: వాడపర్తి వెంకటరమణ

మనమేమన్నా కలగన్నామా
అనుకోకుండా ఓ అతిథొచ్చి
నెత్తినెక్కి తాండవమాడుతుందని

మనమేమన్నా ఊహించామా
క్రిమిలా మెలమెల్లగా చొచ్చుకువచ్చి
కొండచరియలా విరుచుకుపడుతుందని

నిరుడు తెగిపడ్డ శకలాలింకా
చెల్లాచెదురుగా కనిపిస్తూనే ఉన్నాయి
నిన్నటి ఆశల వసంత వనాలన్నీ
మోడుబారి ఏకధాటిగా విలపిస్తూనేవున్నాయి

విషం చిమ్ముతున్న ఈ విషమ కాలంలో
విచ్చలవిడితనానికి కాస్త తాళం వేసి
మంచి రోజుల ఉషస్సులు ప్రసరించేదాకా
నిబంధనల మాలలు మెడలో వేసుకుని
మనవంతుగా క్రిమి సంహారానికి పాటుపడదాం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!