విజయం రహస్యం

(అంశం:: “సాధించిన విజయం”)

విజయం రహస్యం

రచన :: అలేఖ్య రవికాంతి

విఠల్, యామిని ఇద్దరు అన్యోన్య దంపతులు. విఠల్ బ్యాంకులో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు. యామిని గ్రుహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు నవీన్ ఇంటర్, పాప కుందన పదవ తరగతి చదువుతున్నారు. ఇద్దరు చదువుల్లో చురుకు. నవీన్ కి కలెక్టర్ అవ్వాలని చిన్నపటి నుండి కోరిక.తనకి దేశ భక్తి కూడా ఎక్కువే. ప్రజలకు కొంతైన మంచి చేయాలని తన తాపత్రయం. అందుకనే అహర్నిశలు కష్టపడి చదివేవాడు.

తల్లిదండ్రులు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని  కలలుకనేవారు కాని వచ్చే అరాకొర జీతం ఇంటి ఖర్చులకే సరిపోయేది. పిల్లల చదువులకు డబ్బులు పోగుజేద్దామని ఎంత కాపాయం చేసిన పైసా మిగలక పోయేది. యామిని తన భర్తకి తనవంతు సహకారం అందించాలని మిషిన్ కుట్టడం మొదలెట్టింది. కానీ తనకి ఎప్పుడో కానీ బేరం రాకపోయేది.

నవీన్ తన మిత్రులకు, బంధువులకు ఎప్పుడూ తను కలెక్టర్ అవుతానని చెప్పేవాడు. కొందరు చిన్న పిల్లాడి మాటలని విని ఊరుకునేవారు మరి కొందరు ఎంటీ నువ్వు కలెక్టర్ అవుతావా వెళ్లి అద్దంలో మొఖం చూసుకో ఎంతో కష్టపడ్డా నీకా ఉద్యోగం రాదు. గవర్నమెంట్ జాబ్ రావడం, గ్రూప్స్ కొట్టడం అంత తేలిక కాదని పైగా మీ నాన్న ఓ చిరుద్యోగి ఆయన నిన్ను చదివించలేరు అని విమర్శించేవారు. ఆ మాటలకు నవీన్ బాధపడ్డా ఎలాగైనా కలెక్టర్ అయ్యి వారి నోర్లు మూసేయాలనే కసి తనలో ఇంకా బలంగా నాటుకుపోయింది. బాగా చదివి ఇంటర్ మంచి మార్కులతో పాసయ్యాడు. డిగ్రీ లో ఫ్రీ సీట్ మంచి కాలేజీలో వచ్చింది. కాలేజీలో చేరే లోపు నవీన్ తండ్రి గుండెపోటుతో చనిపోయారు. కుటుంబం మొత్తం తీరని అంధకారంలో కూరుకుపోయింది. చాలిచాలని పెన్షన్ తో కుటుంబం గడవడం కష్టమయింది.

యామినికి కస్టమర్లు కూడా ఎక్కువ రావట్లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో నవీన్ బట్టల షాపులో సేల్స్ మెన్ ఉద్యోగం చేస్తున్నాడు.  ఉదయం నుండి సాయంత్రం వరకు పనితోనే సరిపోతుంది చదువుకోవాలనే కోరిక అలాగే మిగిలి పోయింది. తమకు తెలిసిన వారు కొంత మంది సానుభూతి చూపే వారు మరికొందరు వెళ్లేవాడిని ఆపి  మరీ ఏమైందిరా నీ చదువు..,? పెద్ద పోటుగాడిలా కలెక్టర్ అయితానన్నావ్ మీ బతుకులింతేరా అని ఎగతాళి చేసేవారు…
యామినికి ఈ పనుల వల్ల కొడుకు చదువుకునే కోరిక అడుగంటడం ఇష్టం లేదు అందుకే తను ఇళ్ళళ్ళో పాచి పని చేస్తూ బీడీలు చుడుతూ నాలుగు రాళ్లు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.

నవీన్ తిరిగి కాలేజీకి వెళ్తూ సాయంత్రం హోటల్ లో బేరర్ గా పని చేసేవాడు. వాళ్ళ అమ్మకి  తెలియకుండా స్పెషల్ క్లాసులని చెప్పి జాగ్రత్తపడ్డాడు.

తన దగ్గర డబ్బు కొంత పోగైనాక కోచింగ్ కి కట్టి గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. గ్రూప్స్ మొదటి సారి రాసాడు రాలేదు. చాలా బాధపడ్డాడు..

మరల పట్టుదలతో  రెండోసారి రాసాడు ఈ సారి మెయిన్స్ వచ్చింది. ప్రిలిమ్స్ పోయింది. అయిన ఆశని వదలుకోలేదు. మూడోసారి బాగా పట్టుదలతో చదివాడు. విజయం తనని వరించింది. అందరు తన ఉన్నతికి సంతోషించారు.

నాడు నవీన్ ని విమర్శించిన వారే నేడు అతనిని ప్రశంసిస్తున్నారు. నవీన్ అనుకునట్టే ఆపదలో ఉన్న వారికి తనవంతు సహయం చేసేవాడు. తన ప్రజాసేవకి మెచ్చి ప్రభుత్వం తనని బిరుదులతో  సత్కరించింది…
ఇప్పుడు తను సాధించిన విజయం చూసుకుంటే తనకి ఎంతో గర్వంగా ఉంటుంది..

* * *

తన తండ్రి తనకు చెప్పిన మాటలే నేడు నవీన్ తన పిల్లలకు చెబుతున్నాడు… “చూడండి పిల్లలు, కృషి ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు. మనం అనుకున్నది సాధించేవరకు పట్టు వదలని విక్రమార్కుడిలా ఎప్పుడు సహనంతో ప్రయత్నించాలి, కష్టపడాలి, విజయాన్ని చవి చూడాలి అప్పుడే మనకు ఎదురైన విమర్శ కూడా వేషం మార్చుకొచ్చిన ప్రశంసై మన వెను వెంటే ఉంటుంది “. ఈ మాటని మీరు ఎన్నటికి మరవకండి అని.

కథ సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!