ఏమండోయ్ ఓటర్లు

ఏమండోయ్ ఓటర్లు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గాజుల నరసింహ

ఏమండోయ్ ఓటర్లు మందస్తూ ఎన్నికలకు తయారుగా ఉన్నారా.!

     మీరు ఓట్లు వేసి గద్దేల్ని ఎక్కించారు నాయకుల్ని.
మీ ప్రజాసంక్షేమం దేశంలో ఎలావుందో చూస్తున్నారా!
పాలనతీరులో నాయకుల మాటలు పోకడలు గమనిస్తున్నారా!
మీరు ఏం చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకున్నారా.?
ఇదేనా మీరు ఆశించిన పాలన ఇంతేనా దేశ సౌభాగ్యం ప్రజా సంక్షేమం.
ఒక్కసారి నాటి నాయకులను చరిత్ర కారులను అవగతం చేసుకోండి.
“పేద ప్రజల కోసం నిర్బాగ్యుల కోసం ఎందరో మహానుభావులు భూదానాలు చేశారు”. అన్నదానాలు చేశారు.
పచ్చహరితం కోసం తాగు నీటి కోసం చెట్లు నాటించారు, చెరువులు గుంటలు తొవ్వించారు.
కానీ.. నేడు తమ స్వలాభాల కోసం స్వార్థపరులై భూ కబ్జాలు చేస్తున్నారు.
వున్నా గుంటలు చెరువులు కప్పేస్తున్నారు.
“రియలేస్టేట్ పేరుతో ఉపాధి పేరుతో బయలు భూములన్నీ మింగేస్తున్నారు”.
ఈ అవకాశం వాళ్లకు ఎవరు ఇచ్చారు? ఉపాధి హామీ పథకాలు ఊరి పొలిమేరకే పరిమితం అవుతున్నాయి.
శ్రమజీవుల కష్టాల ఫలితాలు  పెత్తంధారుల జేబులోకి వెళుతున్నాయి.
అర్థం పర్థం లేని ఇతర పథకాలా జాడేమిటి వాటి తీరం ఏమిటి..?
గమనించగలుగుతున్నారా.. గమనిస్తూనే వుంటారు. అన్నీ చూస్తూనే వుంటారు.
కాలే కడుపు ఎవరిదో కన్నీటి శోకం ఎవరిదో కదా! జీతాలకు పనిచేసి జీవితాలు ఇవి ఏమీ ఆలోచించవు.
తమ సుఖ సంతోషాలను చూసుకుంటూ ఎక్కడ సౌలభ్యంగా ఉంటే అటు వెళుతున్న కాలం
ప్రజా సౌమ్యంలో మార్పు రాదు నాయకత్వపు ప్రభుత్వాల తీరులో మార్పు రాదు.
“అందుకే చెబుతున్న నాకోసం మంటూ చూడకు మనకోసం అంటూ నడువు అడుగు ధనపిశాచుల భారినుండి,
అవినీతి పరుల భారినుండి లంచగొండ్ల భారినుండి మనం విముక్తులం అవుదాము.
దేశ సౌభాగ్యాన్ని మన సామాన్య ప్రజా సంక్షేమాన్ని మనం కాపాడుకుందాం.
అచీతూచి సమర్థవంతమైన నాయకుని మన విలువైన ఓట్లతో ఎన్నుకుందాము.
“వందేమాతరం వందేమాతరం”..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!