నా విజయం

(అంశం:: “సాధించిన విజయం”)

నా విజయం 

రచన :: జీ వీ నాయుడు

అవి నేను చెన్నై లో పీజీ చేసే రోజులు. ఓ రోజు సాయంత్రం ఒక సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటగా సెమినార్ లో పాల్గొనే వారి జాబితా రూపొందించే ప్రక్రియ ఆరంభం అయింది. ఒక అరగంట లో ఆసక్తి చూపే విద్యార్థుల జాబితా కు మైకులో ప్రకటన వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వారు ఈ కార్యక్రమం నిర్వాకులు. సుమారు కొన్ని వేల మంది అడితోరియం లో ఆశీనులయి ఉన్నారు.. మొదటగా సుమారు 50 మందికి పైగా విద్యార్థినీవిద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు వీరంతా తమిళ్లు. ఓ అయిదు మంది తెలుసు వారు కూడా పేర్లు నమోదు చేసుంటున్నారు.. అ సమయం లో కొందరు తమిళ విద్యార్థులు స్టేజి మీదకు వెళ్లి పేర్లు నమోదు చేసుకునే వారి పట్ల గోళ చేస్తున్నారు. వీలలు వేస్తూ ” ఏయ్ ఆంధ్ర గోల్టీ ” అంటూ రచ్చ చేస్తున్నారు. దీంతో అవమానం తో తెలుగు విద్యార్థులు వారి పేర్లు ఉపసంహరించుకుని పోటీ కి దూరం గా ఉండి పోయారు. అయితే నాకు ఈ దృశ్యం చాలా బాధ అనిపించింది. నాపేరు నమోదు కోసం స్టేజి ఎక్కగానే ఇక కోతులకన్నా హీనంగా గోళ చేసారు . గోల్టీ అంటే తెలుగు అర్ధం ఎదవ అని అర్ధం.ఆగలేదు గోళ. నేను మైకు తీసుకుని ” మేము ఎదవలుమో లేక బంగారు పథకం గ్రహితులమో రెండేళ్లు పూర్తి అయ్యాక చూడండి.. తెలుగు పౌరుషం ఏమిటో తెలుస్తుంది.. నేనే ఈ వేదిక ఫై నుండి బంగారు పథకం స్వీకరించి చూపుతా ” అని పెద్ద సవాలు విశరాను.. దాన్ని వారు వ్యంగ్యం గా తీసుకొని ఇంకా గలభ చేశారు. రెండేళ్లు మరో ప్రపంచం తో సంబంధం లేకుండా చదివి పీజీ లో గోల్డ్ మెడల్ సాధించాను.. అదే స్టేజి మీద ఓ విశ్రాంత న్యాయ మూర్తి చేతుల మీదుగా బంగారు పధకం స్వీకరించాను. ఆ సమయం లో ఎందుకో తెలియదు నా లో దుఃఖం ఆగలేదు.. నాకు ముఖ్య అతిధి మైకు ఇచ్చి మాట్లాడమన్నారు.. ” ఈ విజయం నాది కాదు.. తెలుగు వారిని గోల్టీ లు అన్న తమిళ్ విద్యార్థులది. ఈ పథకం మీకే అంకితం ” అని ముగించాను.. ఇది నా విజయం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!