మంచు కురిసే వేళలో

మంచు కురిసే వేళలో
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

వేకువజామున తొలి వెలుగులో
తూరుపు చిక్కబడే సమయాన
మంచు తుంపరలలో
పక్షుల కిలకిల రావాలతో
చల్లని పిల్లతెమ్మెర లాంటి
గాలి నన్ను సున్నితంగా పలకరించగా,
నా అణువు అణువు పులకరిస్తూ
ప్రకృతిలో మమేకమై
నీ నామమే కలవరిస్తూ,
ఆనందాల అంచుల్లో విహరిస్తూ
ఆత్మీయంగా చిరు జల్లు సైతం
నేనున్నానని నన్ను ఆశగా చేరగా,
నా మది సంతోషాల సంగమమై నను ప్రేమతో అలరించగా,
ప్రతిక్షణం అపురూపమై,మధురక్షణాలను ఎదనిండా నింపుకుని
నా జ్ఞాపకాలను ప్రోదిగా చేసి
ఉదయపు లేలేత వెలుగు జిలుగుల మనోహరమైన ఉషోదయం కొరకు
నింగి నుంచి జారిపడే ప్రత్యూష తుషారంలా
మరోసారి అలుపెరగని నయనాలతో
వెతికే నా తొలి చూపు
తనువంతా కనులై నీవే నేనై
నీ కొరకే చూసే ఎదురుచూపు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!