బావతో నా రోజు

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

బావతో నా రోజు

రచన: జయ

ఎప్పుడు చెప్పే మాటే కానీ
ఈరోజు ఇంకా కొత్త గా ఉంది.
మనస్సులో ఏదో చిన్న అలజడి.
ఏదో దగ్గరతనం.
మనస్సుకు చిన్న సంతోషం.
సొంతం అనే భరోసా
ఏమో ఎప్పుడు నీ ఆలోచనే బావ
కానీ ఈ రోజు సరికొత్తగా ఉంది.
నీతో ఇలా ఏకాంతం గా ఈ గదిలో ఇలా.
బాగుంది కదా బావ.
హ్మ్మ్ అవును పిల్ల బాగుంది.
ఈ పందిరిమంచం.
ఆగరవత్తుల ధూపం.
నీ తలలో తురుముకున్న మల్లెల సువాసన,
నీ సొగసైన నీ రూపం.
నీ అమాయకమైన కాటుక కనులు.
తీయనైన నీ పెదవులు .
అన్ని మధురమే పిల్ల ఈ రేయి.
మన జీవితంలో మరుపురాని రేయి,మన ఈ తొలి రేయి కావాలి బావ.
ఆహా.! దేవి గారికి కవితలు ఉప్పొంగుతున్నాయి ఏమిటో.
చీ.. పొ బావ.
ఆహా. అలాగే పిల్ల.
ఓయ్ బావ పొమ్మంటే ఇంకా ఇంకా దగ్గరికి వస్తావ్ ఏంటి.
హే ఆగు, అనే మాట పూర్తి కాకముందే ఇరు పెదవులు ముడిపడి,
ఒకరి ఒకరు పరవశంలో  లోకాన్ని మరచి ప్రేమ రసఝరి లో మునిగిపోయి ఉండగా
డోర్ కొట్టిన శబ్దం తో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి
బావ వదులు ఎవరో పిలుస్తున్నారు.
అబ్బ ఈ టైం లో ఎంటే వీళ్ళ గోల.
వుండు బావ చూసి వస్తా.
డోర్ ఓపెన్ చేసి చూసి అత్తమ్మా మీరా.
హా అవును.
ఎడి వాడు ఎడి?
బావ అత్తమ్మా పిలుస్తున్నారు అని తలుపు కి అడ్డంగా నిలుచు నే సమాధానం చెప్పే సరికి.
సీతమ్మ నవ్వుకొని, సరే లే వాడిని ఒక సారి నా దగ్గరకి రమ్మాను అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఓయ్ బావ పిలిస్తే రావే.
అత్తమ్మా వచ్చి నిన్ను రమ్మాని చెప్పి వెళ్లిపోయారు ,వెళ్ళిరా ఒకసారి.
ఇప్పుడా మంచి మూడ్ లో ఉన్నానే, పొద్దున అడుగుతా ఎందుకో.
ఓహ్ అలాగా ఆ పప్పులు ఏమి ఉడకవు గాని ఒకసారి కనిపించి రా.
అబా… వెళ్లి తొందరగా వచ్చేయి బావ,
నో ఇప్పుడు కాదే.
నా ముద్దులమొగుడు చెప్పిన మాట వింటాడు గా .
ఆహా..
సరే నువ్వు రెడి గా ఉండు.
ఓహ్ మర్చిపోయా అని సెల్ఫ్ లో నుంచి ఒక కవర్ తీసి ఇచ్చి ఇది వేసుకొని వుండు ఇటు వెళ్ళి అటు వచ్చేస్తా. అని ఒక ముద్దు పెట్టి నవ్వు తూ వెళ్లిపోతాడు.
సీతమ్మ దగ్గరకు వెళ్లి అమ్మ పిలిచావ.
హా అవును రా.
రేపు ఉదయం మీరు ఇద్దరు.
మావయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాలి.
ఎందుకు అమ్మ?
ఒరేయ్ నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు.
నాకు తెలుసు రా నీ ప్లాన్ ,మావయ్య  నాతో అంతా చెప్పారు.
అది అమ్మ ,నేనే చెబుదాము అనుకున్న కానీ దానికి సర్ప్రైజ్ ఇద్దాము అని ఎవరికి చెప్పలేదు.
సరే లేరా నాకు అర్ధం అయ్యింది కానీ, వెళ్లి పడుకో.
పొద్దునే బయలుదేరి వెళ్ళాలి గా.
అని చెవి మెలిపెట్టి నా కొడుకు పెద్ద వాడు అయ్యిపొయాడు కదా.అని నవ్వుకొని వెళ్ళిపోతుంది.
అమ్మ అని పిలిచే సరికి
ఏంటి నాని చెప్ప రా
అమ్మ నువ్వు ప్రశాంతం గా నిద్రపో ,పొద్దుటే ఇక నిన్ను లేపను, మేము రెండు రోజుల్లో వచ్చేస్తాము.నువ్వు జాగ్రత్త అమ్మ.
సరే రా మీరు నా గురించి ఆలోచించకండి.నేను జాగ్రత్తగా నే ఉంటా.
మీరు క్షేమంగా వెళ్ళి రండి,మావయ్య వాళ్ళని ఆడిగానని చెప్పు.
సరే అమ్మా. నేను చెప్పాను లే జరిగింది అంతా, నువ్వు ఏ పరిస్థితి లో ఈ పెళ్ళి చేసుకోవలిసి వచ్చిందో ,నువ్వు ఏమి ఫీల్ అవ్వకు మావయ్య వాళ్ళు కూడా ఏమి అనలేదు, మీ ఇద్దరిని పంపించమన్నారు.
సరే అమ్మ థాంక్యూ సో మచ్ అమ్మ.
ఎందుకు రా నాని, అది మా ఇద్దరిని అర్ధం చేసుకుని మా పెళ్ళి ని అంగీకరించినందుకు.
పొ..రా. పొ నీ బోడి థాంక్స్ ఏమి వద్దు కానీ
తొందరలో నాకు బుల్లి మనవడిని ఇవ్వండి.
ఓస్ అంతేనా మనవరాలిని కూడా బోనస్ గా ఇస్తాం అమ్మ.
ఓరిని… అని నవ్వి పెళ్ళి అయిన ఈ అల్లరి మానవ కన్నయ్య నువ్వు.
హా.. హా..
సరే  అమ్మ అని కౌగిలించుకొని గుడ్ నైట్ సీతమ్మ.. అని ముద్దు గా పిలిచి రూమ్ లోకి వెళ్ళి.
ఓయ్ పిల్ల ఎక్కడ ఉన్నావ్.
వేసుకున్నవా లేదా ఆ డ్రెస్ .
ఒక సారి కనిపించవే పిల్ల.!
ఆగు బావ ఈ  జీప్ పట్టడం లేదు.
అవునా వస్తున్న ఆగు.
ఓయ్ నువ్వు ఎక్కడికి అక్కడే వుండు,నా తిప్పలు ఏవో నేను పడతా.
ఎంటే పడేది ఇప్పుడు ఇద్దరం ఒకటే ,నా దగ్గర నీకు సిగ్గు ఎందుకే.
వస్తున్న ఆగు, వెళ్లి అబ్బా పిల్ల ఏమున్నవే.
పొ.. బావ అలా చూడకు,
అబ్బో అది అంతా సిగ్గే.
హ్మ్మ్,
తిరుగు వెనక్కి అని జీప్ పెట్టి మెడ ఒంపుల్లో ఒక ముద్దు ఇచ్చి.
పిల్ల ..
బావ..
ఎంటే. ఉహు ఏమి లేదు.
సరే పదా ఇక్కడే ఉంటే చాలా జరిగిపోతాయి.
అవును ఎక్కడికి బావ.
ఏ చెబితే గాని రావా.
వస్తా ,ఎక్కడికి అత్తమ్మా ఒక్కరే వుంటారు గా అని.
అమ్మ కి చెప్పలే నువ్వు పదా అని కార్ డోర్ తీసి స్వాగతం పిల్ల .మన మొదటి ప్రయాణం.
మొదలు పెడుతున్నాం.
బావ.! హ చెప్పు పిల్ల.
అది నేను నిన్ను బావ అని పిలుస్తున్న కదా.
హా అవును ఇప్పుడు ఏమైందే.
నేెను నీకు మావ కూతురు ని కాదు,కనీసం బంధువును కాను కదా,మరి నువ్వు కానీ అత్తమ్మా కానీ ఏమీ అనలేదు ఎందుకు నన్ను.
ఓహ్ ఆదా ! తింగరి వరస పెట్టి పిలవాలి అంటే
చుట్టరికము,రక్తసంబంధమే అవసరం లేదే.
నా అనే భావం,స్వచ్ఛమైన మనస్సు ,ప్రేమ,ఆప్యాత ఉంటే చాలే.
హ్మ్మ్ థాంక్యూ బావ.అని నుదిటి పై ముద్దు ఇచ్చి గట్టిగా కౌగిలించుకొని అలానే చూస్తూ ఉంటుంది.
సరే పిల్ల నువ్వు కాసేపు నిద్రపో నిన్నటి నుంచి రెస్ట్ లేదు నీకు.
మరి నువ్వు, ఇద్దరం నిద్రపోతే కార్ ఎవరు డ్రైవ్ చేస్తారే నువ్వు నిద్రపో.
సరే బావ అని తనని చూస్తూ నిద్రపోయిన తన పిల్లని చూసుకుంటూ ఇళయరాజా మ్యూజిక్ వింటూ వాళ్ళ ప్రయాణం ముందుకు సాగింది.

ఓయ్ పిల్ల లే వచ్చేసాము. తన నుదిటిమీదా ముద్దు పెట్టి లేపేసరికి.
నెమ్మదిగా కళ్ళు తెరచి చూసేసరికి .
నులువెచ్చని కిరణాలు ఒక పక్క.
అప్పుడే మబ్బుల చాటుకు వెళుతున్న చంద్రుడు. తెల్లవారుజాము చుట్టూ జలపాతం ,
మనస్సుకు హాయిని ఇచ్చే కోయిల గానం.
పచ్చని ప్రకృతి.
పడి పడినట్టు పడుతున్న తొలకరి జల్లులు.
తనకి ఇష్టమైన వాతావరణం ఒక పక్క, తన ప్రాణం అయిన బావ ఒక పక్క ఇక తన ఆనందానికి అవధులు లేవు.
కార్ దిగి అద్భుతమం బావ. ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. అని జలపాతం లోకి దిగి కేరింతలు కొడుతూ ఏ హే అని చేప పిల్ల లా తుళ్ళి తుళ్ళింతల్లో ముంగితేలుతున్నా తన పిల్లని దగ్గరకు తీసుకొని ఇద్దరి నడుములకు కలిపి చున్నీ తో గట్టి ముడి వేసి ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ వర్షం లో జలపాతం క్రింద
ఇరు దేహాలు ఒకటిగా ముడిపడి కోయిల సంగీతం వింటూ, సూర్య ,చంద్రులు ఇద్దరు ఎదురుగా ఉన్నప్పుడు
చిరు చెమటతో తడిచిన నీ నుదుటి చిరు స్వేదం నా పెదవుల దాహం తీరుస్తుంటే… మత్తు ఎక్కిన నీ కనుల అంచుల నా రూపం దాగే సమయాన నీ ఊపిరి లో నా ఆశ కలిసి
ఓ ఉల్లాసం, ఓ ఉద్వేగం నీలో నాలో
మన ఎద లయలు పంచుకుంటూ
తన్మయత్వం చందన పరిమాళాలై
సృష్టికి మూలమై నిలిచే కలయికలో ఇరువురం ఒక్కటై పోదాం బావ అన్నావ్ గా గుర్తుందా పిల్ల.
ఇది నా చిలిపి కోరిక అన్నావ్ గా .
అవును బావ తడిచిన కనులో కన్నీరు కూడా కలిసి పోయి.
చిరు ఆశ తిరగ
కలిసే తనువులు తపనలు పెంచగా
పెదవులు చుంబించగా
వెచ్చని నీ శ్వాస లో నా శ్వాస
నా లేత ప్రాయాలే నీ మగసిరి కి నీరాజనం చేస్తూ నీలో కలిసి పోన బావ.
I love you బావ.
నా చిన్న చిలిపి కోరిక ,నా బావతో నా రోజు నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి.
****************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!