సృజన మిరాకిల్  లైఫ్

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సృజన మిరాకిల్  లైఫ్

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు మంచు రేఖలు చీల్చుకుని బయటకు వచ్చి మానవాళిని మేల్కొలుపుతున్నాడు. మాసాలలోకెల్ల విశేషమైనట్టీ మార్గశిర మాసము నేనే కిరీటి అని పాట పాడుతూ అమ్మ సంజన పూజ చేస్తోంది. అమ్మో ఇంకా మెలుకువ రావడం లేదు లీలగా పాట వినిపిస్తోంది. నాన్న సుబ్బారావు అనే సుభాష్ గా పిలువబడే ఆయన సుహస్ గా పిలువబడే అన్న సృజనకు సపోర్ట్ చేసే వ్యక్తులు.
ఎప్పుడైనా సృజన ఆలస్యంగా నిద్ర లేస్తే నాన్న బాగా సమర్ధిస్తారు. సృజన లేమ్మా, మీ అమ్మ పూజ అయ్యింది అని పిలిచాడు. అలాగే నాన్న లేస్తున్న అంటూ దుప్పటి తొలగించి లేచింది. అప్పటికే బారెడు పొద్దు వచ్చింది గబ గబ తేమిలి డైనింగ్ హాలు కి వచ్చింది. సంజన సోషల్ టీచర్ గా వేరే ఊరిలో చేస్తుంది. కొడుకు లేక భర్త స్కూటర్ పై ఆటో స్టాండ్ కి దింపుతారు. అక్కడ నుంచి ఆటో ఎక్కి గంట ప్రయాణం చేసి స్కూల్ కి వెళుతుంది. ఎవరితోను కూడా సామరస్యంగా ఉండదు.
సృజనకు చిన్నప్పటి నుంచి బామ్మ రాజ కుమారుడు కథలు, ఇంగ్లీష్ కథలు చెప్పేది. అందులో రొట్టెలతో ఇల్లు పంచదార టాప్ బిస్కట్లు తలుపులు ఐస్ క్రీమ్ సరస్సు వంటివి ఉండేవి, ఆ కథలు వింటుంటే అందులో తానే రాకుమారిగా ఊహించుకుని ఆలోచనలలో నిద్ర పోయేది. కలలో అది నిజంగా తానే అన్ని వెళ్లినట్లు భావించేది. అందాల రాజ కుమారుడు తెల్ల గుర్రంపై వచ్చి తనను తీసుకెళ్ళి పెళ్ళాడి నేమిలి సింహాసనం పై కూర్చున్నట్లు కల వచ్చేది. తెల్లారి అమ్మకు చెపితే సంతోషించి మంచి భర్త వస్తాడు అనేది పెళ్లి తరువాతే అసలు జీవితము అంటూ ఉండేది.
చదువుతో పాటు టైప్ నేర్పించారు, సంగీతం నేర్చుకున్నా బాగుంటుంది. అనేది ఎదురు మెడలో గొప్ప విద్వాంసురాలు ఉండేది. ఆమె దగ్గర సంగీతం నేర్చుకో అంటే వద్దు సంగీతం,సాహిత్యం కూడా గుడ్డ పెట్టవు. నీకు కావాలి అంటే కంప్యూటర్ నేర్పిస్తాను పాతిక వేలు కట్టి అయినా సరే అనేది కానీ సృజనకు కళలు అంటే ఇష్టము కానీ తల్లి సంజన ఒప్పుకొలేదు. సరి కదా డిగ్రీ అవగానే పెళ్లి అన్నది.
వచ్చిన సంబంధాలు  పిల్లకి కొంచెం పళ్ళు ఎత్తు అన్నారు. కళ్ళ జోడు ఉన్నది అన్నారు. పళ్ళ కి క్లిప్ వేయించింది. కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టించారు ఇవన్నీ సృజనకు బాధ కారంగా ఉన్నాయి.
ఎంతో గొప్ప పెళ్లి సంబంధం కోసం తనని ఎన్నో రకాలుగా తల్లి అలంకరించేది ఎవరితోను మాట్లాడ కూడదు ఇంట్లో తలుపు లు వేసుకుని కూర్చోవాలి.
అన్న హాస్టల్ అమ్మానాన్న ఉద్యోగాలు ఇల్లు తొమ్మిదికి ఖాళీ డిగ్రీ అయ్యాక ఏదైన కోర్సు చెయ్యాలని కోరిక తల్లి ఒప్పుకోలేదు.
ఒక రోజు అమ్మ నాన్న బయటకు వెళ్లారు సృజన టిఫిన్ తిని ముసుగు తన్ని పడుకున్నది.
గాఢంగా నిద్ర పోయింది. పన్నెండు గంటల ప్రాంతంలో తండ్రి వచ్చి తలుపు కొట్టాడు
ఏమి సమాధానం లేదు ఇంట్లో కాలింగ్ బెల్ ఉన్నా సరే స్విచ్ ఆపి ఉంచుతారు. పిల్లలు అస్తమానం కొడతారని బెంగ విసుగు సంజనకి. అందుకని లోపల స్విచ్ ఆపి ఉంచుతుంది. ఫోన్ చేశాడు ఎన్నో సార్లు పిలిచాడు కానీ రిప్లై లేదు పిల్ల లేదా ఏమిటి?బయటకు వెళ్ళి ఉన్నదా అని టెర్రస్ కి వెళ్లి చూసి వచ్చాడు ఎక్కడ లేదు. మళ్లీ ఫోన్ అదేపనిగా చేశాడు. చివరికి స్క్రూ డ్రైవర్ పక్కింట్లో అడిగి తీసుకుని విప్పడం మొదలు పెట్టాడు. సుత్తితో కొట్టడం మొదలు పెట్టాడు. సృజనకు నెమ్మదిగా ఆ శబ్దాలకు మెలుకువ వచ్చింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఏమయ్యావా అని కంగారు పడుతున్నాను నువ్వు నిద్ర పోయావా ! అన్నం తినలేదు అన్నాడు
నాకు ఆకలి లేదు టిఫిన్ తిన్నాను. తండ్రి సరే ఈ రోజు ఆఫీస్ పని వేరే వాళ్ళు చూస్తారు. అందుకని నేను వచ్చేసాను అంటూ పట్టు కెళ్ళిన క్యారేజీ విప్పి కూతురికి, వడ్డించి తను తిన్నాడు. ఒక విధంగా తల్లి పిల్లని భయ పెట్టీ బాధిస్తుంది. ఏమి నేర్చుకో నివ్వదు. కనీసం ఆడపిల్ల చీర అంచులు
చీర ఫాల్స్ చొక్కా జాకెట్ బత్తములు కూడా కుట్టనివ్వదు. పుస్తకాలు కూడా తనకు నచ్చిన ఫాంటసీ కథలు చదవాలి ఎప్పుడు గొప్పగా ఉండాలి కాలు కింద పెట్టకుండా అందలం ఎక్కించే అల్లుడు కావాలి ఇది సంజన కోరిక కానీ సృజన మాత్రం ఊహకు నిజానికి ఎంతో తారతమ్యం ఉన్నది అని చిన్న పిల్ల అయినా సృజన అనేది. ఎన్నో ఇంజినీర్ డాక్టర్ సంబందాలు చూసింది. కానీ ఇంజినీర్ ఇంజినీర్ చదివిన పిల్ల డాక్టర్ డాక్టర్ చదివిన పిల్ల కావాలి అన్నారు. ఎంత ఎక్కువ కట్నం ఇచ్చినా దొరక లేదు. చివరికి బిజినెస్ చేసే డబుల్ పిజి చేసిన కుర్రాడు వచ్చాడు. తల్లిని ప్రభుత్వ ఉద్యోగి కావాలి.
ఇల అన్ని సంభందాలు తల్లి వద్దు అంటుంది. పోని చదువు లేక ఏదైనా కళలు అంటే  వద్దు అంటుంది. సృజనకు చాలా విసుగు వస్తోంది.తిండి తిని పడుకోవడం లేదా తల్లి వచ్చాక సూక్తులు వినడం అలవాటు అయ్యింది. ఏ పని చేసినా విసుగు కొనేది. అయితే ఆ వచ్చిన బిజినెస్స్ సంబంధం కుదుర్చి పెళ్లి చేసెయ్య మన్నది తల్లికి కోపం వచ్చింది నీ యోగం బాగా లేదు అంటూ సనుగుతూ పెళ్లి కుదిర్చింది దీనికి కారణం సృజన తన పెద్ద తల్లికి ఈ విషయం చెప్పింది. అంతే చెల్లెలు పెంకితనం తెలిసిన ఆమె సృజన కు మంచి చెయ్యాలని ఈ పెళ్లి ఖాయం చేసింది ఇదిఓప్పు కోవడానికి కారణం ఉన్నది. కొడుకు తన క్లాస్ మెట్ శిల్ప ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనిచెప్పాడు అంతే కాదు తన జీతంలో లోన్ పెట్టీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని వేరే ఉండటానికి తయారు అయ్యాడు. సంజన గుణం తెలిసిన ఎవరూ బంధువులు గుమ్మం తొక్కరు అందుకని కొడుకు సుహస్ హాస్టల్ నుంచే ఉద్యోగము అక్కడ నుంచి వివాహం నిర్ణయించుకుని తల్లి తండ్రికి చెప్పి సృజన పెళ్లి చెయ్యమని చెప్పాడు. సంజన ఈ పెళ్లికి ఓప్పుకోవడము ఒక మిరాకిల్ అని చెప్పాలి ఆమెకి హై స్టటస్ కావాలి కథల్లో రాజ కుమారుడు జీవితం లో వస్తాడా అన్నట్టు సృజన బాధ పడేది కానీ ఒక ఉద్యోగస్తులు కన్న ఎక్కువ స్టేటస్ ఉన్న పెళ్లి కొడుకు శ్రవణ్ రావడం సృజనకు ఎంతో ఆనందం కలిగింది.
ఇద్దరే కొడుకు లు పెద్దవాడు కెనడా, రెండవ వాడు శ్రవణ్ పెద్ద ఇల్లు ఇంట్లో కింద పెద్ద మాల్ ఉన్నది. సొంతము అడబడుచులు లేరు, అత్తగారు తల్లి కన్న బాగా చూస్తోంది కుట్లు అల్లికలు, అత్తగారు నేర్పేది సంగీతం మాస్టారు వచ్చి నేర్పేవారు. ఊళ్ళో రేడియో స్టేషన్ ఉన్నది. టీవీ చానెల్ ఉన్నది. కోడలికి విద్య నేర్పించి రేడియో ఆర్టిస్ట్ ను చేసింది. అది సృజనకు ఎంతో మెరకిల్ వంటలు కూడా ఛానెల్ లో చెయ్యడానికి పంపింది కోడలు ఇష్టాలు తెలిసికొని ఆమెను మంచి సెలబ్రిటీ గా తయారు చేసింది.
కేవలం తల్లి సంకుచిత భావాలకి సృజన బాధ పడింది కానీ తన అదృష్టం బాగా ఉన్నది అందుకే మంచి విలువ కలిగిన కళా కారిణి గా నాలుగు ఏళ్ళల్లో అత్తగారు తనకి ఎంతో గుర్తింపు తేచ్చి ఉత్తమ అత్తగరిగా ఒక ఛానల్ వారి నుంచి బిరుదు పొందింది. ఏదైనా సరే మనిషికి నచ్చిన మార్గం లో జీవితం సుగమనం చెయ్యాలి అందుకు పెద్దలు కథలు చెప్పి ఊహల్లో ఉంచడం కాదు నిజ జీవితంలో ఆచరణ చెయ్యాలి ఏది ఏమైనా సృజన అదృష్ట వంతురాలు ఆమె కన్న కలల కళల ద్వారా సార్థకత చెందించుకున్నది. మరి ఇది మిరాకిల్ కదా శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర అమృత కీర్తనల్లో చెప్పిన సారాంశం పుట్టుట గిట్టుట నిజము నట్ట నడిమ పని నాటకము అన్నట్లు పుట్టింట కష్ట పడినా అత్తింటి కళల ద్వారా సార్థకత చేసుకోవడానికి మంచి అత్త గారు, భర్త లభించారు బెస్ట్ ఆఫ్ లక్ .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!