ఆత్మ

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

ఆత్మ

రచన: చెరుకు శైలజ

అమ్మ వయసు 90 వరకు వుంటుంది. ఊరిలో ఉంచడం ఇష్టం లేక అన్నయలు సిటీకి తీసుకొచ్చారు. అమ్మ సంతానం 8 మంది ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. కొడుకుల అందరి దగ్గర నెల, నెల వుండేది. అపుడపుడు కూతుర్ల దగ్గరకు వచ్చేది. అలాగే కాలం జరుగుతుంది.
ఒకరోజు అమ్మ తమ్ముడి ఇంట్లో జారి పడింది. అందరం వెళ్ళి చూసాము. అసలు కూర్చున్న దగ్గరి నుండి నడవలేక పోయింది. భయంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. డాక్టర్ చెక్ చెసి తొంటి బొక్క విరిగింది, ఆపరేషన్ చేయాలి అన్నాడు.
రెండు రోజుల తరువాత ఒకరోజు ఆపరేషన్ జరిగింది. అందరము హాస్పిటల్ కి వెళ్ళాము. అమ్మకి దైర్యం చెప్పాము. భయం లేకుండ మంచిగానే చేయించుకుంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒక నాలుగు రోజుల తరువాత మా చిన్న అన్నయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు. తను పడుకొనే వుండేది. కాళ్ళు కదల నిచ్చేది కాదు అందుకే ఒక నర్సుని పెట్టుకున్నారు. ఆమెనే అమ్మకి అన్ని పనులు చేసేది.
ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఒక రోజు ఈవెనింగ్ అమ్మ హర్ట్ అటాక్ తో పోయింది. అన్నయ్య ఫోన్ చేసి విషయం చెప్పాడు. అందరం వెళ్ళాము. లేచి మంచిగా అయ్యి తిరుగుతుంది అనుకుంటే అమ్మ చనిపోవడం చాల బాధేసింది. మరునాడు అమ్మని ఊరికి తీసుకెళ్ళాము. తన పిల్లలను అందరం ఊరు చేరాము. అంతక్రియ కార్యక్రమాలు జరిగాయి.
అమ్మ చనిపోయిన మరుసటి రోజు అందరం ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాము. అమ్మ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంతలో అన్నయ్య కూతురు, కొడుకు, నా కూతురు, కొడుకు అమ్మ అంటు హడావుడి పిలుస్తూ వచ్చారు.
ఏమైంది అని మా పెద్ద అన్నయ్య అడిగాడు.
ఆ పెద్దనాన్న మన ఇంటి ముందు నానమ్మ వచ్చింది. అంటు ఆయాసంతో చెప్పారు.
మేము అందరం నాన్నమ్మ రావడం ఏమిటి? అంటు ఇంటి ముందుకి వెళ్ళాము. మా ఇంటి ముందు వేరే వాళ్ళ ఇల్లు వుంటుంది. వాళ్ల ఇంటిముందు అంటే మా ఇంటికి ఎదురుగా ఒక ముసలామె కూర్చుని ఏడుస్తూ వుంది.
అన్నయ్య కూతురు నాన్నమ్మ ఈమెనే నాన్న అని వాళ్ల నాన్నకి చూపెట్టింది .
అందరు వచ్చారా నేను ఏమి పాపము చేశాను. నా ఇంట్లోకి నేను రాకుండా అయాను.. అంటు తల పట్టుకొని ఏడుస్తుంది.
ఏమి అమ్మ నీకు ఏమీ కావాలి అంటి మా అక్క అడిగింది.
ఏమి నాకు వద్దు. నన్ను నా ఇంట్లో వుండనివ్వకుండ తీసుకెళ్లారు ఇప్పుడు నేను నా ఇంట్లొకి ఎలా రాను. అంటు ఏడుస్తుంది.
అమ్మ నీకు ఎందరు కూతుర్లు, కొడుకులు ఎక్కడి నుండి వచ్చావు. అంటు మా పెద్ద అక్క అడిగింది.
నాకు ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు నాది ఇదే ఇల్లు. నేను ఎక్కడి నుండి రావడం ఏమి? అంది.
మేము అందరం ఆశ్చర్యపోయాము. అప్పుడు మాకు అనిపించింది, ఆమె అమ్మనే అని.
తన ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుంది అనిపించింది. నీకు ఏం కావాలి అని అడిగాము.
నేను ఇంకా బ్రతుకుతా అనుకున్న, ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. మమ్మల్ని అందరిని చూస్తూ మేము ఎవరెవరో చెప్పింది. పిల్లలను చూస్తూ బాధ పడింది.
అమ్మ నీకు ఆకలి అవుతుందా.. రా లోపలికి, ఏమైన తిందువు అని నేను అడిగాను (చిన్న కూతురిని)
నేను ఇంటికి రాలేను నా కడుపు నిండి పోయింది మీ అందరినీ చూశాక అంటు నిలబడింది.
నీకు ఏమి తక్కువ చేయలేదు కదా. నీకు అన్నీ బాగా జరిగేటట్లు చూస్తాము అని మా చిన్న అన్నయ్య అన్నాడు.
నాకు తెలుసురా అందుకే వచ్చాను, పోతున్న.
ఎలా వచ్చావు? ఎక్కడికి పోతావు? అని మేము అడుగుతుంటే.. తడబడుతూ, తూలుకుంటు వెళ్ళిపోయింది.
మా ఊరు మధ్యలో ఒక బజార్ వుంటుంది. అక్కడికి అన్నయ్య కూతురు పట్టుకొని తీసుకెళతారు అంటే వద్దని తన చేతి పక్కకి తోచి వెళ్లిపోయింది. మేము అందరం అలాగే చూస్తూ వుండి పోయాము గుండె బరువుతో.
అవును అమ్మ వచ్చింది. తనకి ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. చేతనైనంత వరకు ఈ ఇల్లుని వదలలేదు. తరువాత అన్నయ్యల వలన తప్పనిసరై సిటీ చేరింది. మధ్య మధ్య ఊరికి తీసుకు వచ్చేవారు. ఈ మధ్యనే అమ్మ పూర్తిగా చేత కాకుండ అవడం వలన తీసుకు రాలేదు, అదే దిగులు అమ్మకి.
ఇల్లు, ఊరు, పిల్లలు, అమ్మ ఆత్మ ఆరాటం తెలిసింది. ఇలా అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము.
ఈ చలిలో అమ్మకి కప్పుకొని ఏమి లేదు. ఎలా అంటు అన్నయ్య అంటే.. తన కూతురు దుప్పటి కావాలని వెతుకుతూ వుంటే నేను నా దగ్గర వున్న బెడ్ షీట్ ఇచ్చాను.
పిల్లలు అందరు వెళ్ళి అమ్మకి అక్కడే అరుగు మీద పడుకున్న ఆమెకి కప్పి వచ్చారట. ఎవరు బాబు అంటు చూసి మళ్లీ పడుకుందట. ఏమి తెలియనట్లుగా అంటే ఆత్మ వెళ్ళిపోయింది అన్నమాట. చాల బాధతో ఆ రాత్రి గడిపాము.
మరల తెల్లవారి పిల్లలు ఆమెను చూడడానికి వెళుతూ ఒక లీఫ్ ప్లేట్లో వేడిగా టిఫిన్ తీసుకెళ్ళి పెట్టీ వచ్చారు, ఆకలితో తిన్నదట.
అసలు జరిగింది ఏమి తెలియనట్లుగా వీళ్ళను చూస్తూ నేను వెళుతున్న అంటు లేచి అలా వెళ్ళిపోయింది అని చెప్పారు.
ఈ సంఘటన జీవితంలో ఒక అద్భుతమైనది అని చెప్పవచ్చు.
అమ్మ తన పిల్లల కోసం తన ఇంటి కోసం వేరే ఆమెలో ఆత్మగా చేరి రావడం ఎంతైనా విచిత్రమైన సంఘటనగా జరింగింది.
తరువాత పదిరోజులు అమ్మ మాకు ఎప్పుడు మరల అల కనిపించలేదు. కన్నతల్లి ఆత్మ అంత ప్రాణముగా కొట్టుకున్నది అని అనిపిస్తుంది.
అమ్మ నీవు పంచిన ప్రేమ అమూల్యమైనది. నీ బిడ్డగా పుట్టినందుకు గర్వ పడుతున్నాను. నీకు శత కోటి వందనాలు తెలుపుకుంటున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!