అయ్యారే

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

అయ్యారే…!!!

రచన:: కీర్తి ఫ్రీ బర్డ్

అయ్యారే…!!!

ఏమి ఈ గగనమును తాకే సౌధములు…
ఏమి ఈ పడవలను పోలిన వాహనములు…
ఏమి ఈ వంపుసొంపుల రహదారులు…
ఏమి ఈ తీరైన రంగురంగుల ఆకృతులు…

అయ్యారే…!!!
ఎంత చిత్రమో… ఈ నగరపు సోయగములు
ఎంత విచిత్రమో… ఈ నగరపు నాగరికతలు

చిత్రం… భళారే విచిత్రం…
ఈ నగరపు నడిరేయి హొయలు
చిత్రం… భళారే విచిత్రం
ఈ నగరపు అబ్బురపరిచే తలుకుబెలుకులు…
మతితప్పించే నాగరికపు ఆకాశ హర్శ్మాలు
అనాగరికునికి ఎప్పటికీ విచిత్రమే కదా….!

***

You May Also Like

One thought on “అయ్యారే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!