ప్రశ్నించే హక్కుగా మొలకెత్తరా?

ప్రశ్నించే హక్కుగా మొలకెత్తరా?

రచయిత: సోంపాక సీత

కన్నెపిల్ల చేతిలో రోజాగా విరుస్తుంది ఓ ప్రేమపొర !
వాట్సప్ లో ఛాటింగ్ లా తేలుతుంది ఓ మైకపు పొర !
మెసెంజర్ లో దూసుకొస్తుంది ఓ ఫేక్ బుక్ పొర !
అనుదిన వసంతాలై విరబూస్తున్న పొరలన్నీ మనసు అరలను గుప్పిటపట్టజూసే అగ్గి తెరలే..!!

కురూపినైనా విశ్వసుందరిగా జిగేల్మనిపిస్తామనే
పార్లర్ పొరలు !
బట్టతలెందుకు ? వారంలో జుట్టుమొలిపిస్తామనే బులపాటపు తెరలు !

పొరలు,తెరలు గుడిగుడి గుంజాలాటల్లో
ఆడగాలి కనపడితే శకునిపాచికలై,కప్పల్ని మింగజూసే సర్పరాజులై నాట్యాలాడతాయి..!

లోటెక్ లు కొన్ని,హైటెక్ లు కొన్ని రాజ్యమేలుతున్న మాయా మహల్ రా ఇది..

ఓరి అర్భకుడా..! ఇప్పుడు నీకు తెలవాల్సింది ఈ ‘టెక్కులు’ కాదురా!!
నిప్పుల గుండంలో ఈదుతున్నా స.హ చట్టపు చుట్టంతో నిలబడాలిరా..
ప్రశ్నించే హక్కుగా మొలకెత్తరా ఇప్పటికైనా ?

You May Also Like

2 thoughts on “ప్రశ్నించే హక్కుగా మొలకెత్తరా?

  1. పార్లర్ పొరలు…బులబాటపు తెరలు…👌
    ఆడగాలి సోకితే శకుని పాచికలై…👌👌
    స.హ.చట్టపు చుట్టం గురించి
    ఆద్యంతం చైతన్యాన్ని తట్టిలేపే రచన👌👌💐💐💐
    సీత గారూ

    1. ధన్యవాదాలు చంద్రకళగారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!