ఇక వేళైంది

ఇక వేళైంది(కవితా సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీ సుధ కొలచన

సమీక్షకులు: బిక్కి కృష్ణయ్య

శ్రీ సుధ కొలచన కవిత బాగుంది. మంచి feel ని ఇస్తుంది. కవిత ఎత్తుగడే సింబాలిక్ గా ఉంది.
“ఈ చీకటి ఇక చాలు, వెలుగులకు వేళైంది.
తూరుపు సింధూరమై, చిగురుల వాసంతమై”
అనటంతోనే కవిత ప్రతీకాత్మక(symbolic  expression )ఎత్తుగడతో చక్కగా ప్రారంభించారు.
“మోహాలకు రంగులద్ది, బట్టలు మార్చినంత సహజంగా ఏమారుస్తున్నారు.” ఆహా ! ఎంత మంచి పోలిక. బట్టలు మార్చడమంటే ఎంత సుళువో, అలాగే మోహాలకు రంగులద్దే మోసపు నక్కలు న్నాయన్న ధ్వని పూర్వక అభివ్యక్తి ఈ పాదంలో ఉంది. పువ్వై పూసినందుకు కర్కశంగా నలిపేస్తున్నారు. ఎంత సున్నితమైన భావన. అంటే సెన్సిటివ్ నెస్ మనసున్న మనిషిని బాధపెడతారని symbolic గా చెప్పారు. ఇక్కడ పువ్వు మనసుకు ప్రతీక.”నీ హక్కులను కాలరాస్తుంటే, నీ కళ్ళు-నీళ్ళుకాదు. నిప్పులు కురవాల్సిన వేళైంది”
వావ్..కవిత్వం కేవలం, వస్తువిశ్లేషణా సౌంర్యంకాదు. అది కర్తవ్యాన్ని బోధించే కరవాలం. ఈ కవితా పాదాలు వివ్లవ చైతన్యజ్వలితదీపాలు. కళ్ళు కన్నీళ్ళు కాదు, నిప్పులు కురవాలని చెప్పడం పాత expression అయినప్పటికీ. కంటి గెలుపుకు, కోపానికి, నిప్పులు కురవటం అన్న చలన ప్రతీకను ఇక్కడ తప్పక వాడాల్సివచ్చింది. కవితకు ఎత్తుగడ ఎంత ముఖ్యమో. ముగింపు అంతే ముఖ్యం. శిలలను చీల్చి. శిశిరానికి వెరవక. చిగురుటాశవై, వెలుగు పువ్వై, రాతి గుండెలను చీల్చుకుని
వికసించాల్సిన వేళైంది. చాలా మంచి ముగింపు. ఆశావాదం కవితాత్మకంగా గుబాళించింది.
శిలలను చీల్చటం, శిశిరానికి వెరవద్దని చెప్పడం, ప్రతీకాత్మక వ్యక్తీకరణలు. వీటినే poetic -diction లో symbolic expressions అంటారు. ప్రెంచి కవులు బోదలేర్, మల్లార్మేలు ఇలాంటి అభివ్యక్తుల గురించే చెప్పారు. కవిత్వం వచనమై తేలిపోకూడదనుకుంటే, చిగురుటాశ, వెలుగు పువ్వులాంటి పదబంధాల పొదుగుమెరుపురాళ్ళతో కవితాపాదాల gold chains, కొత్త poetic design తయారు కావాల్సిందే. శీర్షిక కవిత్వ ఆత్మను తెలియజేయాలి. అందుకే, ఈ కవయిత్రి “ఇక వేళైంది”అన్న ఆకర్షణీయమైన శీర్షిక పెట్టింది. దేనికి వేళైంది? అది తెలుసుకోడానికే కవిత చదువుతారు. ఎనీ  హౌ good poem.hats of to u సుధగారు. మీరు భావిష్యత్తులో గొప్ప కవయిత్రిగా ఎదుగుతారన్న భరోసాను మీ కవిత కలిగించింది. all the best.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!