పరివర్తన కథల పుస్తకం నుంచి కథ

పరివర్తన కథ ల పుస్తకం నుంచి కథ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: డాక్టర్ మృదుల గారు

సమీక్షకులు: నారుమంచి వాణి ప్రభాకరి

మంచి మానవత్వము, నిర్మల మనస్తత్వము, నీతి నిజాయితీ కలిగి యువతను తీర్చి దిద్దిన విశ్రాంత అధ్యాపకురాలు, ప్రధాన ఆచార్యులుగా కొన్నాళ్ళు చేసి రిటైర్ అయ్యాక మల్లవరంలో గాంధీ గారి అనాద ఆశ్రమం, శ్రీ చర్ల గణపతి శాస్త్రి వృద్ద ఆశ్రమం ఎంతో సమర్థ వంతంగా ఆదరిస్తూ  నిర్వహిస్తున్నారు. అంతే కాదు సాహిత్య సేవలో కూడా ఘనులు, శ్రీ చర్ణ గణపతి శాస్త్రి చారిటబుల్ ట్రస్టు ద్వారా సాహితీ ప్రచురణలు కూడా ఉన్నాయి. సమాజాన్ని చదివి చూశారు, విద్య వంతులైన యువకులు, ఇంజినీర్ చదివిన యువకులు కూడా వచ్చి ఇక్కడ చక్కని సేవ అంశాలు నేర్చుకుంటున్నారు. ఎన్నో పదవులు, ఎన్నో అవార్డ్స్ పొందిన ఈమె అతి శాంతంగా సామాన్యంగా ఉంటారు. అక్క డాక్టర్ విధులతో కలిసి ఐదు వృద్ద ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లి సుశీల నుంచి తండ్రి గణపతి శాస్త్ర కళా ప్రపూర్ణ, రాజలక్ష్మీ అవార్డ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పొందిన ఆయన పద్దతులన్ని అలవర్చుకున్న వీరు అత్యంత నిరాడంబర జీవితంలో ఉన్నారు. మృదుల భావ వీచికలు, పరివర్తన, కవిమిత్ర త్రిపుర సంగమము ఆశ్రమ కథలు, అమృత సుధలు. ఇందులో పద్దెనిమిది కథలు, ఆధునిక భగవద్గీత రచించారు. ఆవు వద్దు అనే కథ, ఆదిలక్ష్మీ అనే ఇల్లాలు. ఉదయం పని హడావిడిలో ఉండి పనిలో నిమగ్న మైనది. మడి ఆచారం పరిశుభ్రం కడగటం వంటి ఎన్నో పనులు పూర్వం చేసేవారు. ఒక యోగేశ్వరుడు వచ్చి అమ్మ బిక్షందేహి అన్నాడు. దానికి ముందుకు వెళ్ళ పనిలో ఉన్నాను అన్నది. మళ్లీ రెండవ సారి పిలిచాడు. అదే మాట అన్నది.
మళ్లీ మూడవ సారి పిలిచే టప్పటికి కోపంగా వచ్చి విసురుగా మాట్లాడింది. మూడు సార్లు పిలిచి వెళ్లిపోయాడు. మళ్లీ అమెలో ఒక విధమైన మార్పు వచ్చి భయం భక్తి కలిగి, గుమ్మలోకి వెళ్లి పిలిచింది. అతను వెనక్కి నవ్వుకుంటు వచ్చాడు. మీరు నా మాటకి కొప్పడక నవ్వుకుంటు వచ్చారు. నన్ను క్షమించండి అన్నది. నేను మీ మాటకి భాధ పడలేదు. అసలు నేను పట్టించుకోలేదు. ఆ ఇల్లాలు ఆశ్చర్య పడింది, పచ్ఛాతాపంతో చెప్పింది. అమ్మ మీరు నాకు ఆవును ఇచ్చినా, రోజు గడ్డీ పెట్టలేను. మీరు నాకు ఆవును ఇచ్చిన నాకు వద్దు అని చెపుతున్నాను. నేను మీ మాటలే పట్టించుకోలేదు. ఇంకా మీ ఆవు నాకు వద్దు అన్నాడు. మీరు అన్న మాటలు మీ దగ్గరే ఉన్నాయి. మీరు నా మనసు గ్రహించలేదు. కనుక ఎవరైనా ఎదుటి వారిని విమర్శిస్తే అధి వారికే ఎదురు వచ్చి చెందుతుంది. కనుక కోపం, విసుగు, చిరాకు, ఉన్నప్పుడు విమర్శ వద్దు. అని చెప్పే నితీ కథ ఇది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!