కథ చెప్పవా

కథ చెప్పవా
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయ కిరణాలు, శ్రావణ మేఘాల్లో అక్కడ అక్కడ తెల్లగా, లేత నీలి రంగు, బంగారు రంగు, వెండి రంగు మబ్బులు దట్టంగా ఉన్నాయి. మనుమరాలు దివ్య శ్రీ ని అమ్మమ్మ నిద్ర లేపుతోంది. ఎందుకే అంతా ఖంగారు పని అయ్యాక లేప వచ్చును. అదెలాగో మనం మడి కట్టి పూజ చేస్తాము దాని చేత కూడా చేయుద్దాం, వరలక్ష్మి వ్రతం చిన్ని పిల్లలు కూడా చేస్తారు. దివ్య శ్రీ నీ గట్టిగా తట్టీ లేపింది అమ్మమ్మ పూర్ణ. కూతురు సరోజ మాత్రం నువ్వు దాని పని చూడు నేను బుర్లు, పులిహోర చేస్తాను. వంకాయకూర, మామిడి కాయా పప్పు, కలగాయి పులుసు చేస్తాను. పూజ అయ్యాక కొబ్బరి పచ్చడి దేముడికి కొట్టినది చేస్తాను. సరేనా అన్నది. సరే ఆ చేత్తో కొంచెం క్షిరాన్నము, వడపప్పు, చలిమిడి, పానకము కలిపితే మంచిది. దద్దోజనం, కారం బూరెలు, ఉండ్రాళ్ళు కూడా పెడితే ఎలాగ  తొమ్మిది రకాలు అవుతాయి కదా. ద్రాక్ష, అరటి, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, జామ, నారింజ బత్తాయి, దానిమ్మ, యాపిల్, వెలగ, దబ్బ, నిమ్మ పండ్లు ఇవన్నీ ఈ కాలంలో వస్తాయి. చక్కగా దొరికిన పళ్ళతో పాలవెల్లి కట్టాలి. అమ్మవారికి బిందె పెట్టు కొని, లేదా మర చెంబు పెట్టీ కొబ్బరికాయ పెట్టీ కలశ లో డబ్బులు, అక్షింతలు, నీరు, తమలపాకు, పసుపు వేసి, పసుపు రాసిన కొబ్బరికాయ పెట్టీ రవికల బట్ట మడిచి పెట్టీ, చిన్ని చిన్ని ఆభరణాలతో అలంకరించి, పుల దండ పెట్టాలి. కొందరు వెండి ముఖం పెట్టుకుని కొందరు కాయకి కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు, చెవులు, పెదవులు, అన్ని పెట్టీ చీర కడతారు. ఎవరి ఇంటి పద్దతి వారిది. తరువాత రకరకాల పువ్వులతో పూజ చేసి, వ్రతకథ చదివి, పూలతో కట్టిన తోరం కట్టుకోవాలి అని రాత్రి కథ అంతా చెప్పాను. తెల్లారి ఆలా చెయ్యాలి కదా. అంటూ కథ, మా వ్రతం అంతా చెప్పి, చారుమతి ఐకమత్యం వల్లే అష్ట ఐశ్వర్యాలు వచ్చాయని చెప్పింది. దివ్య శ్రీ అన్ని శ్రద్దగా వింటుంది. వంద ప్రశ్నలు వేస్తుంది. అమ్మమ్మ వస్తేనే గారం, అమ్మ నాన్న దగ్గర కుదరదు. ఎప్పుడు అమ్మమ్మ వచ్చినా రాత్రి ఆరుబయట బాల్కనీలో కూర్చో పెట్టుకుని చక్కగా ఆవకాయ అన్నం కలిపి మీగడ నంచి తినిపిస్తూ కథలు చెపుతుంది. అన్నిటిలో దివ్య శ్రీ నీ హీరోయిన్ గా సృష్టించి చెపుతుంది. దాని వల్ల ఆసక్తి గా ఉంటుంది. కథలో పిల్ల అచ్చు నీలాగే ఉంటుంది. అంటూ మొదలు పెడుతుంది. ఆ అమ్మమ్మ రాత్రి కథ చెప్పాక, బాగా గట్టిగా నిద్ర వచ్చేసింది. ఇప్పుడు నేను రెడీ అయ్యి పూజ చేస్తాను అంటు అనందంగా చెప్పింది. అమ్మమ్మ మనుమరాలికి రియాలిటీ కథలు చెపుతుంది. అసలే తెలివైన పిల్ల, ఫాంటసీ కథలు చెపితే ఆలా కావాలి, ఇలా కావాలి అంటుంది. అందుకు అవి తక్కువ చెపుతుంది.
సరే దివ్య శ్రీ కూడా బంగారు బొమ్మలా అలంకరించుకుని. పూజ చేసింది. పట్టులంగ పైకి పట్టుకుని పసుపు, పారాణి పెట్టుకుంది. మరి బాల వరలక్ష్మిలా ఉంది. సాయంత్రం జడగంటలు పెట్టీ జడకి మొగలి పూల జడ కుట్టింది అమ్మమ్మ. సాయంత్రం పేరంటం చేసి, శనగలు పళ్ళు పంచి పెట్టింది. హారతి కర్పూరం, దీపం కూడా నీరాజనం  ఇచ్చి, పిల్లల చేత పాటలు పాడించింది. చివరగా మళ్ళీ మనుమరాలు అమ్మమ్మ కలిసి ఆనందంగా క్షిరాభి కన్యకకు అంటూ శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన పాడుతూ హారతిని పిల్ల చేత ఇప్పించింది. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే పిల్లలకి అన్ని నేర్పుతారు. అమ్మ, నాన్న యంత్రాల మాదిరి ఉద్యోగంలో బిజీ కదా, పిల్లలకి కథలు చెపుతు ఉంటే సృజనాత్మకత జ్ఞాపకశక్తి పెరుగుతంది. అందుకే మన కథల్ని అనగా అనగా అంటాము. కథ కంచికి మనం మన ఇంటికి, చందమామను చూపిస్తూ అన్నం పెడుతూ..కథ చెపితే, ఆ కథ వింటూ భోజనం తొందరగా చేస్తారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!