పుస్తకం
రచన :వనపర్తి గంగాధర్
పుస్తకం కాదది హస్తభూషణం
అది మన మస్తిష్క భూషితం
మానవ వ్యక్తిత్వ వికాసం
జ్ఞానాన్వేషణకు మూలం
మేధోమధనానికి దారిచూపు జ్యోతి
ప్రపంచ జ్ఞానానికది విజ్ఞాన వీచిక
జీవితానికి చేయును దిశా నిర్ధేశం
భవిష్యత్తుకు మార్గం వేసే కరదీపిక
పుస్తకం ఓ విజ్ఞానబాండాగారం
నిను నడిపిస్తుంది వెన్నెల దారిన
నీ జీవితాన కురిపిస్తుంది జ్ఞాన సుమాలు
విద్యార్థుల జీవితాన ఎగిరేస్తుంది విజయ బావుటా
నువ్వు నమ్ముకో పుస్తకాన్ని
పుస్తకంతో చేయుము నెయ్యము
నిను నడిపించును
నిజమైన జ్ఞానమార్గమున
నిను నిలబెట్టును
ఉన్నత విజయాల శిఖరాన