తాత చెప్పిన బంధం విలువ

తాత చెప్పిన బంధం విలువ (కవితా సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన సుజాత కోకిల

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగా, బంధాలు కూడ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. జననం నుండి మరణం వరకు జీవితంతో పోరాడాలి. కనురెప్పలు తెరిచిన నుండి వెలుతురు కోసం వెతకాలి. అలిసిపోని జీవితాలు, అలుపెరగని పోరాటాలు, ఒకే చెట్టుకు పూచిన పువ్వుల్లా పరిమళాలను వెదజల్లుతూ దారిని వెతకాలి. దేవుడున్నాడని తెలిసిన జ్ఞాని అజ్ఞానాన్ని కోరరాదు. మాటలు రాని మనిషి మాట్లాడలెేరనేది ఎంత నిజమో, విధి రాసిన రాత ఎవరు కూడా మార్చలేరనేది కూడా అంతే నిజం, ఏదీ మన చేతిలో లేనప్పుడు దేవుడిపై భారాన్ని వేస్తాం. ఆ దేవుడే మనకు ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిని వెతుక్కోవాలి కాని ధైర్యం కోల్పోవద్దు. ఏది సత్యం, ఏది అబద్ధం, జీవితమే ఒక భ్రమ, ప్రాణం పోస్తాడు ఆ దేవుడెే పావులుగా చేసి మరి ఆడిస్తాడు ఆ దేవుడే. దేవుడు ఆడే చదరంగంలో ఓడిపోక తప్పదు. ఏదీ శాశ్వతమని ఏం ఆశించి వచ్చావు. ఏమి సాధించావని ఏమీ పట్టుకు పోతావు. ఎవరూ తోడు వచ్చారు నీ వెంట, ఎవర్ని అడుగుతున్నావు నీ వెంట రమ్మని. ఎంతమంది నీ వెంట వచ్చినా కాటివరకేనని తెలుసుకో, మంచిగా ఉంటే నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!