జీవితం
రచన: ఎన్. రాజేష్
సృష్టిలో అందాలు, ఆనందాలు,
ఆశలు, అవస్థలు..
జన్మించింది మొదలు
శరీరానికి అలంకరణలు, మెరుగులు..
ఊపిరి ఉన్నంతకాలం ఉపచారాలు, అపచారాలు!
సుఖః దుఖాలు వెంటపడి
వేటాడి ముంచేస్తుంటే.,
మురిపాలతో, తాపాలతో..
మురిసిపోతూ, అలసిపోతూ
ముదిమతో ముగిసి పోతుంది జీవితం!
ఆపై శరీరం కాలిపోయి
బూడిద గా మారుతుంది..
అయినా మళ్ళీ జన్మించాలని
ఆశ పడుతుంది జీవి..
అంకురించి పుష్పించి
ఫలించాలని తరించాలని
తహతహ లాడుతుంది!
నిరాశ నిస్పృహల మధ్య
ముగిసిన జీవితానికి.,
ఇంకో జన్మ ఎత్తాలని
ఇంకేదో ఆశ ఈ జీవికి…
ఇదే సృష్టిలోని మాయ.!
కాల చక్ర గమనంలో
మేలి ముసుగుల ఛాయ.!!
~~~~~~~~~~~~~~~~~~~