ప్రేమ ఎంత మధురం..

అంశము: మన్మథ బాణం

ప్రేమ ఎంత మధురం..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎస్.ఎల్. రాజేష్.

ప్రేమ ఎంత మధురం..

నీ తలపే నాకు జీవం
నీ మరపే నాకు శాపం
మంచు ముసుగేసుకున్న
పచ్చని పైరు లాంటి
నిన్ను చూడగానే ఒళ్ళంతా
పులకరింత.
ఇంద్ర ధనుస్సు లాంటి
నీ పెదవి చాటు చిరునవ్వు
కలిగించే గిలిగింత.
నీ కాలి అందెల సవ్వడి
గుడి గంటల నాదమై
వినిపిస్తుంది.
నీ చెంత నున్న చాలు
వసంత కోకిలనవుతాను.
మన కలయిక గురుతులు
మన్మథ బాణాలు తగిలి
మరింత చేరువ చేస్తాయి.
నిత్యమైనది, స్వచ్ఛమైనది
అమ్మ బువ్వ లాంటి మన ప్రేమ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!