సుఖదుఃఖాలు

అంశం: చీకటి వెలుగులు

సుఖదుఃఖాలు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

కోపతాపాల నడుమ మధురిమలు
చిటపటలా చిందించేను సరసాలు
అలక పానుపు పైన పవలింపులు
ఆనంద సంసారంలో తీపిగుర్తులు

దుఖమే రాబోయే సుఖానికి ఆనవాళ్లు
ఇప్పటి చీకటి చెప్పే రేపటి వెలుగుకి స్వాగతాలు
పూర్వపు రోజులు గడచిన గుర్తులు
భవిష్యత్ కై వెయ్యాలి ప్రణాళికలు

జీవితంలో కష్టసుఖాల కావడి కుండలు
చీకటివెలుగుల సమ్మోహనాలు
సూర్యచంద్రుల దాగుడుమూతలు
మన మనసుల్లో ఎన్నో వేల కలలు

కలల కై స్వీకారమే నీ విజయాలు
విజయాలే నీ ఉన్నతికి కారకాలు
మనసుకు తీసుకోవద్దు చేదు జ్ఞాపకాలు
కలత పెట్టవద్దు ఎవ్వరి మనసులు

లోకంలో ఎన్నో రకాల మనుష్యులు
ఉంటారు నరకాసురలాంటి రాక్షసులు
ఉండాలి నీలో సత్యవంటి లక్షణాలు
నీ ధైర్యమే పారద్రోలును జీవిత చీకటులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!