గాలిలోని దీపాలు

(అంశం:”అగమ్యగోచరం”)  

గాలిలోని దీపాలు

రచన ::క్రాంతి కుమార్(ఇత్నార్క్ )

మరు క్షణంలో బ్రతుకుతామో
లేదో తెలియని సమయంలో
అర చేతుల్లో ప్రాణాలను
పెట్టుకొని భయపడుతూ
భరోసా లేని జీవితాన్ని అనుభవిస్తూ
ప్రాణాలను పణంగా పెట్టైన
తన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని
క్షణక్షణానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటూ
ఇష్టదైవాన్ని మనసులోనే మౌనంగా
స్వచ్ఛమైన భక్తితో పూజిస్తూ
అగమ్యగోచరంగా అయిపోయిన
బ్రతుకుల మీద ఆశలను
పెంచుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న
హృదయాల్లో శాంతి కుసుమాలు
మళ్ళీ వికసించేది ఎప్పుడో
తడి ఆరిపోయిన పెదవులపై
చిరునవ్వు పూసేది ఇంకెప్పుడో
చీకటి మేఘాలు కమ్ముకున్న
ముఖాలలో వెలుగులు నిండేది ఎప్పుడో

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!