నేటి చదువులు

(అంశం:”అగమ్యగోచరం”)  

నేటి చదువులు

రచన ::విస్సాప్రగడ పద్మావతి

ఆనాటి చదువులు ఇంకుల్లో
ఈనాటి చదువులు లింకుళ్లో
సెల్ , లాప్టాప్ , టాబ్ అంటూ
అవసరం ఉన్నా, లేకున్నా ఇవ్వడం
క్లాసులు జాయిన్ అవడం
గేములు ఓపెన్ చెయ్యడం
వీడియోలు ఆఫ్..
యూ ట్యూబులు స్టార్ట్
నెట్ సెట్టింగులు సరిచూడడం పేరెంట్స్ పని
పోర్షన్స్ పూర్తి చేయడం టీచర్ల పని
రక రకాల వీడియోస్ అప్లోడ్ చెయ్యడం
యూ ట్యూబులో షేర్లంటూ వెంటపడడం
విద్యార్థి పని
ఇంటర్నెట్ పై ఆసక్తి
చదువు పై అనాసక్తి
తల్లి దండ్రులకు దిక్కుతోచని దీనస్థితి
ఇవేమీ చదువులు? ఎటు పోతున్నాడు విద్యార్థి?
ఈనాటి చదువులు అగమ్య గోచరమే.
చెప్పేవాడికి తెలీదు..
వినేవాడు వింటున్నడో? లేదో?
వినేవాడికి తెలీదు ఏం చెప్తున్నాడో..
ఆన్లైన్ అంటూ చదువులు అగమ్య గొచరమయ్యే..
ఈ గందర గోళం నుండి
బయటపడే రోజు కోసం
ఎదురు చూడ్డం తప్ప
ఏం చేయలేని అయోమయ స్థితి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!