వృక్షోరక్షతి రక్షితః

వృక్షోరక్షతి రక్షితః

రచన:: డా. బాలాజీ దీక్షితులు పివి

చెట్టు నేలకు గొడుగు
సృష్టికిది ప్రాణం
ప్రాణులకిది ఆధారం
ఇది ఓ
అందని విశ్వరూప రహస్యం
మన బ్రతుకుకు రూపదృశ్యం

ప్రాణవాయువు కావాలన్నా
ప్రాణధార కురవాలన్నా

అందంతో మురిపించాలన్నా
ఆనందం అందించాలన్నా
సుగంధమై స్పృశించాలన్నా
సమయానికి ఆకలి తీర్చాలన్నా
ప్రకృతికి వరం… పచ్చని చెట్టు

మానవజాతి మనుగడకు
సృష్టి సమతుల్యమునకు
నేలతల్లి సజీవానికి
వృక్షాలే ఆధారం…
వాటినిరక్షిస్తే …అవే మనలను కాపాడతాయి
వృక్షోరక్షతి రక్షితః

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!