ఆడపిల్ల వ్యధ

 ఆడపిల్ల వ్యధ

రచన:: అశ్విని సంకేత్

ఏమని చెప్పను నా బాధ! ఎంతని చెప్పను నా వ్యధ!!

ఆడపిల్లగా పుట్టబోతుంటినంట. అమ్మానామన్నలు మాట్లాడుకుంటే వింటిని.

నేను వాళ్లకు భారం అంట. అందుకే చేస్తున్నారు నాకు భార విముక్తి అంట.

ఇంకా లోకం తెలియని పసిగుడ్డును నేను.బారం అనుకుంటున్నారు నన్ను.

జీవరాశి పుట్టుకకు కారణం ఆడజాతి. ఆ ఆడదే భారం అనుకుంటితి  ఈనాటి జాతి.

నాన్న పుట్టింది ఒక అమ్మకి.మరి ఎందుకు బరువు అనుకున్నారు నన్ను ఈ అమ్మకి.

ఇది ఒకందుకు మంచిదే. ఆడపిల్లగా పుడితే అప్పుడు కామాంధుల కబంధ హస్తాల్లో పడి చావడం కాన్నా ఇదే నయం.

అందుకే ఇప్పుడు ఇలా కళ్ళు తెరవక ముందే కళ్ళు మూస్తే మంచిది.

అసలు పుట్టుకకు కారణం అయిన మమ్మే, ఇలా చేస్తే అసలు పుట్టుక అంటూ ఉంటుందా ఈ నరజాతికి.

నరజాతి సమస్తం సమాప్తమవుతుంది.వద్దు అందుకైనా నేను పుట్టి తీరవలే.

అమ్మానాన్నలతో చెప్పి నా బ్రతుకు నాకు ఈయవయా దేవా!

నీవు కూడా ఆడపిల్లను అని చిన్నచూపు చూడక నా ప్రార్థనను  వినిపించుకోవయ్యా!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!