నాడు – నేడు

నాడు – నేడు

రచన :: మంగు కృష్ణకుమారి

విరగపూసిన మల్లెలు
తోడుగా పసివారినవ్వులు
గంపలతో దిగుతున్న మావిడి పళ్ళూ, పిల్లా పాపతో వచ్చేపోయే చుట్టాలు దినమంతా వండి వార్చే నారీమణులు
పిల్లల ఆటలతో కళగా వాకిళ్ళూ ఎండాకాలమన్న మాటే తలపు రానివి ఆనాటి తియ్యటి రోజులు!

రోజంతా ఎసి లో వాల్చిన శరీరాలు, ఓ గంట విద్యుత్ పోతే ఇస్సూ హస్సూలూ, సిగ్గీ, జొమాటో తిళ్ళు, సెల్లో టివియో లోనే రోజంతా కాలక్షేపాలు ఫోన్ లోనే ఇష్టమయినవారితో
పలకరింపులూ, ఇల్లూ మనసూ బోసిపోయి కళ లేగా ఈరోజులు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!