అవధులు దాటిన ఆనందం..

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

అవధులు దాటిన ఆనందం..

రచన: జీ వీ నాయుడు

రాధిక, రాము ఒకే ఊరి వారు. ప్రాధమిక పాఠశాల నుంచి విశ్వవిధ్యాలయం వరకు ఇరువురు ఒకే గ్రూప్, ఒకే కళాశాల. దీంతో వీరు మొదట కాస్త దూరంగా ఉన్నా, కాలక్రమంలో స్నేహితులు గాను, ప్రేమికులుగాను రూపాంతరం చెందారు. పోటీ పరీక్షల్లో నెగ్గి, ఇరువురు ఒకే శాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.. ప్రేమ కాస్తా చిగురించి వివాహ ప్రతిపాదన వరకు వచ్చింది. నిత్యం ఇరువురు ప్రేమ దాహంలో మునిగిపోయేవారు. ఇరువురు వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇరువురు కులాలు వేరు కావడం తో అమ్మాయి తరుపు నుంచి అడ్డు ఫుల్ల పడిందీ.. అమ్మాయి తండ్రి ఓ కాంట్రాక్టర్. సంపదకు కొరవ లేదు. ఎట్టి పరిస్థితులు వచ్చినా ఈ వివాహం జరగదు అని ఖరాకండిగా తేల్చి చెప్పారు అమ్మాయి తండ్రి లోకనాధ్ రెడ్డి.
రాధిక తన తండ్రి తన మాట వినకుండా ఉంటాడా అనే బలమైన విశ్వాసం తో ఉండేది. ఇలా కులాలు కుంపట్లు రాజేస్తాయని ఊహించలేదు. తండ్రి అంటే అత్యంత భయం ఆది నుంచి. ఒక రోజు ధైర్యం కూడ గట్టుకుని, తండ్రి తో మాట కలుపుతూ, రాము చాలా మంచివాడు అని ఒక మాట బాణం లా విసిరింది రాధిక.
అంతే తండ్రి ఉగ్రరూపం చూసి భయబ్రాంతులకు గురైంది.
ఒక వ్యక్తి ని ప్రేమ అనే ముసుగు వేస్తే మంచివాడు ఐపోతాడా అని గర్జించేటప్పటికి రాధిక మౌన వ్రతం లొకి జారుకుంది.
ఇక లాభం లేదు. తండ్రి మాట వినకపోతే ఏమౌతుందో అనే భయం రాధిక ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ” నాకు తెలిసిన ఓ అబ్బాయి ఉన్నాడు. మంచి ఆస్తిపరుడు. మర్యాద కు డోకా లేదు. వారం లో పెండ్లి చూపులు. సిద్ధం గా ఉండు ” అని హుకుం జారీ చేసాడు తండ్రి.
ఇంతే ఇక తాను ఒకటీ తలచిన దైవం ఒకటీ తలుస్తుంది అని మనసులో బాధగా ఉన్నా తండ్రి ఆలోచన వైపే అడుగులు వేసింది రాదిక.
పెండ్లి తంతు పూర్తి అయింది. రాధిక ఓ సంపన్నుల ఇంటికి కోడలు అయింది. ఆరు నెలలు తిరగలేదు. భర్త విడాకులు. మళ్ళీ పుట్టింటికి పరిమితం అయింది రాధిక. రాము మాత్రం వివాహం చేసుకోకుండా అలాగే ఉన్నాడు. రాధిక తండ్రి కీ ఈ ఆలోచనలు అధికం అయ్యాయి. ఆరోగ్యం క్షీనించింది. ” అమ్మా.. రాధిక., నేను చాలా తప్పు చేశాను తల్లి. నన్ను క్షమించు. నీ మనసు ను గాయపరిచాను. నేను ఎంత కాలం ఉంటానో తెలియదు. నీకు తల్లి ప్రేమ తెలియదు. నువ్వు రామును వివాహం చేసుకో. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకరోజు రామును ఇంటికి తీసుకొని రా. అన్నీ నేను మాట్లాడుతా ” అంటూ రాధిక చెయ్యి పట్టుకొని తండ్రి రోదిస్తూ చేసిన తప్పు ను అంగీకరించాడు లోకనాధ్ రెడ్డి.
తండ్రి కోరుకుంటున్నారు, ఇక నాకే మీ ఇబ్బంది అనుకున్న రాధిక తన మనసులో ఘాడంగా ప్రేమ ను పెనవేసుకున్న రాము ను తనతో పాటు ఇంటికి తీసుకొని వచ్చింది. తండ్రి దగ్గర కూర్చొని పెట్టింది. ” రామూ.. నేను చాలా తప్పు చేశాను. నా ముద్దుల కూతురు మనసు గాయపరి చాను. నీ మనసు ను కాకావికళం చేశాను. మీ ఇద్దరి బంధం చాలా గొప్పది. నాలో ఉన్న అహంకారం నాకు కళ్ళు తెరిపించింది. మనస్ఫూర్తిగా మన్నించి మీరు ఇద్దరు వివాహం చేసుకుంటే చూసి ఈ తనువు చాలించాలి అని ఉంది ” అంటూ రాము వద్ద బోరుమన్నాడు లోకనాధ్ రెడ్డి.
విడిపోయిన బంధం మళ్ళీ ఎదురు కావడం తో రాధిక రాము లో తెలియని ఆనందం పెల్లుబుకింది. ” మామయ్య.. మీరు కులం, సంపద చూసారు. ఇప్పుడు అవి రెండు ఏమైనా మీకు సాయం చేశాయ. ప్రేమ ముందు ఏదీ కొలబద్ద కాదు. రాధిక నేను చదువుకున్న సమయం లోనే మమ్మల్ని దేవుడు భార్యాభర్త లు గా రాసి పెట్టారు. దైవ నిర్ణయం అంతిమం. నేను అప్పుడు.. ఇప్పుడు ఒకటే. నాలో మార్పు లేదు. రాధిక నాకు ఓ దేవత. పెండ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ దీవనలే మాకు శ్రీరామ రక్ష ” అంటూ రాము మాట ఇచ్చారు. అంతే ఓ గుడిలో రామూ రాధిక మెడలో తాళి కట్టి పెళ్ళి తతంగం పూర్తి చేశారు. ప్రేమ జంట ఆనందం అవధులు దాటింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!