కలసిన జంట

అంశం: విడిపోయిన బంధం మళ్ళీ ఎదురైతే..

కలసిన జంట

రచన: యాంబాకం

   సింహపురి పటణంలో సుబ్బరాయుడు,రొయ్యల వ్యాపారి. అతనికి ఒక కొడుకు పేరు బాల నాగయ్య అంటే వారు నాగ దేవత ను పూజితారు. అందుకే నాగ వచ్చేటట్టు బాల నాగయ్య అని పేరు పెట్టి ముద్దు గా బాలు అని కొందరు నాగా అని పలిచు కొననేవారు.

     బాలు అందగాడు చదువులోను ఆటలలో బుద్ది గా ఉండేవాడు. యుక్త వయస్సు రాగానే బాలు కి పెళ్ళి చేయాలని బాలు నాన సుబ్బరాయుడు పెళ్ళి చూపులకు కొడుకు ను రాజమండ్రి కి పంపేడు.

     బాలు టైయిన్ లో రాజమండ్రి ఫస్ట్ క్లాస్ లో బయలుదేరగా! అదే ట్రైన్ లో బాలు తో పాటు మరోక పెళ్ళి వారు కూడ ఎక్కినారు. అందులో ఒక అతను బాలు ను చూసి పరిచయం చేసుకొని  నా పేరు భూషయ్య “బాబు నేను పెద్ద వాన్ని అడుగు తున్నాను. నాకొక్క సహయం చేస్తావా! “అని అడిగాడు. బాలు నాకు వీలులైతే ఒకే అంకుల్ అన్నాడు భూషయ్యతో.

“నాకు సహయం చేయటంవల్ల నీకేమి నష్టం వుండదు.నా వంశం నిల బెట్టిన వాడవుతావు”అన్నాడు భూషయ్య .”నేను ఏమి చేయ్యాలి”అన్నాడు బాలు.

రాజమండ్రి లో సింహచలం అనే గౌవర్నమెంటు ఉద్యోగి ఆయనకు రూప అనే కుమార్తె చక్కని చుక్క నా కొడుకు కి చేసుకొందామని పొతున్నాము. వారికి నా కొడుకు  ఎలా ఉంటాడో తెలియదు. కాక పోతే నీవు మా అబ్బాయి వయస్సు కొంచెం అటు,ఇటుగా నీలా ఉంటాడు. నీవు నాతో వస్తే నీవే నా కొడుకు అని చెప్పి నిన్ను పెళ్లి కొడుకును చేసి .నీకు రూప తో పెళ్ళి జరిపించి నీవు అమ్మాయి మెడలో తాళి కట్టి పెళ్ళి అయిపోయాక నీ దారిన నీవువెళ్ళు, నా దారిన నేను నా కొడల్ని తీసుకుపో తాను. ఈపని నీవు చేస్తే నీ రుణంపడి ఉంటా బాబు”!అన్నాడు. భూషయ్య.

     భూషయ్య మాటకి బాలు కంగు తిని  చాలా గొడవ అవుతుందేమో, అమ్మ నాన్న కు తెలిస్తే ఇంకేమన్న ఉందా అని ఆలోచిస్తూ ఉండగా భూషయ్య మాట ఇచ్చావు నేను ఉన్నాగా అంతా నేను చూసుకొంటా పెళ్లి  అయిపోగానే నేను మీ అమ్మ నాన్న లతో స్వయంగా వచ్చి జరిగింది చెప్పుతాను.ఇప్పుడు అంత టైమ్ లేదు అనగా బాలు ఒప్పుకొన్నాడు. సాయంత్రానికి రాజమండ్రి కి చేరి హోటల్లో దిగారు.

     పెళ్ళి బృందం వారికి భూషయ్య  బాలు తన కొడుకు అని  చెప్పమన్నాడు. పెళ్ళి బృందం “ఊ”కొట్టారు.  పెళ్లి బృందం,బాలు తో సహా రాజమండ్రి లో ని పెళ్లి కూతురు ఇంటికి పోయి వారికి బాలు తన కొడుకు అని పరిచయం చేసాడు. అందరికీ బాలు నచ్చాడు. రూప బాలు కి నచ్చింది కానీ బాలు అసల పెళ్లి కొడుకు కాదు పెళ్లి అవగానే తన దారి తాను వెళ్ళి పోవాలని,  అది తెలిసిన వాడై బాలుమెలగసాగాడు.        భూషయ్య  పెళ్లి పనులు తెలివిగా జరిపంచి ముహూర్తం కూడా పెట్టించి బాలుని పెళ్లి కొడుకు గా మార్చాడు.  బాలు కి రూపతో వివాహం జరిపించాడు..  ఆ రాత్రి వధువు వరులను గది లోకి పంపారు.

      బాలు గదిలో కి పోతున్న సమయంలో భూషయ్య బాలు ని వదిలించు కునే పని లో పడ్డాడు అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కుని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా కాస్త ఈ రాత్రికి ఎలాగో రూప ను మాయ మాటలతో నిద్రపుచ్చమన్నాడు. భూషయ్య.

కానీ బాలు “రూప కి ఎమికాడు, కానీ అందరూ చేస్తుండగా నే వేదమంత్రాల చదువు తూ రూప మెడలో మూడు ముళ్లు వేశాడు”. బాలు!  కానీ రూప కు తెలియదు బాలు పెళ్లి బృందం తో కలసి మోసం చేస్తున్నాడని.

      ఈనిజం! బాలు తల్లిదండ్రుల కు తెలిసి రూప అమ్మ, నాన్న లకు తెలిసినా రూప కు నిజం తెలిసినా ఏమౌతుందో అని
బాలు రూప గురించి మనోవేదన పడుతూ, రూప ను చూడక పోగా ఆమె తో మాట్లాడ లేదు కదా! కనీసం చూడలేదు రూప కేసి,కానీ రూప ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూప తన పై ప్రేమగా ఉన్నాడా!.లేక ఇష్టం లేదా అని ఆలోచిస్తూ మౌనంగా పడుకొంది.
బాలు అలోచనలో పడ్డాడు రూప కు తెలియకుండా, గది లో నుండి బయట కు వచ్చాడు తను రాజమండ్రి కి వచ్చిన పని గుర్తు చేసుకుంటూ!.వస్తుండగా  బాలు తల్లిదండ్రులు తన కొడుకు రాజమండ్రిలో పెళ్లి చూపులకు కూడ పోక ఎమైనాడని  రాజమండ్రిలో కొడుకు ను వెతకసాగారు. బాలు రోడ్డు లో నడుస్తూ పోతుండ గా బాలు తల్లిదండ్రలు బాలు కి కనిపెట్టి వెంటనే ఏమి మాట్లాడకుండా సొంత ఊరికి తీసుకొనివచ్చేశారు.  రూప మెలుకోని బాలు గది లో నుంచి ఎక్కడ కు పోతున్నాడని ఎవరికి తెలియకుండా బాలు వెనుక నే రాసాగింది. అది బాలుకు కూడ తెలియదు ఇంత లో ఇద్దరు బాలు ని తీసుకొని పోవడం గమనించింది రూప, రూప తో పాటు భూషయ్య. భూషయ్య బాలు ని ఇంత ఈజీగ ఉదిలి పోయి నందుకు సంతోపడ్డాడు.

         తల్లారై పెళ్లి వారు బయలుదేరడానికి,పెళ్ళికూతురుతో సహా ప్రయాణం అవుతుండగా రూప భూషయ్య  ను బాలు రాత్రి నుండి కనపడలేదు  మీ అబ్బాయే కదా ఎక్కడా అని అడిగింది. అబద్ధాలు చెప్పి,అబ్బాయి నేరుగా ఇంటికి వస్తాడు అనగా అందరూ, సింహాచలం,వారి భార్య,రూప అందరూ కొత్త కదా భూషయ్య మాటలు నమించాడు.
.
కాని బాలు కి రూప నే గుర్తు కు వస్తుంది. తెలిసో తెలియకో రూప మేడలో తాళి కట్టిన వాడు. రూప దూరం కావటం బాలు కు బాధ గా ఉంది.ఇంతలో రూప బృందం భూషయ్య ఇంటికి చేరారు కానీ అక్కడ బాలు లేడు. అప్పుడు  రూప  భూషయ్య ను” ఏమండీ అందరూ కనబడు తున్నారు.గాని బాలు ఎక్కడా అని కనిపించడం లేదు  అని వినయంగా అడిగింది భూషయ్యనీ. భూషయ్య “నీ భర్తనా”?అడుగో!అంటూ భూషయ్య  తన కుమారున్ని చూపించాడు.

     రూప వెంటనే పట్టరాని కోపంతో, “నా భర్త ఈయన! ఏంటి అంతా అయోమయంగా ఉంది.ఇది ఎందో మా ఇంటికి పోయి మానాన తో చెప్పి అసలు సంగతి తెలుస్తా! అని వెంటనే రూప ఘటువుగా అనే సరికి  రూపనుతోడు చేసి అమ్మగారింటికి పంపించేసి తాను ఉండి పోయిడు భూషయ్య.

     రూప తన అసలు భర్త కోసం పరితపించసాగింది. ఆయన బతికి ఉన్నాడా అన్న భయం కూడా అమెను పట్టుకొన్నది భూషయ్య బాలు కై మైనకీడు కలిగించాడేమో భూషయ్య అని అలోచించసాగింది… ఈ లోపు ప్రాణాలతో రూప కు జరిగిన అన్యాయం అమె తండ్రి కి అయిన సింహచలం కు చెప్పిగా సింహాచలం “భూషయ్య ఇంతమోసంచేస్తాడా! ఉండు వాడి పని పడతాను ” లేచి వెంటనే భూషయ్య, వారి పెళ్లి బృందం తో బాలు చేసిన మోసాన్ని పోలీసు లకు రిపోర్ట్ చేసి వెంటనే తన కూతురికి న్యాయం చెయమని అడిగి ఇంటికి వచ్చేవాడు. పోలీసులు వారి పనులో వారు ఉన్నారు.

ఇక్కడ బాలు వాళ్ళ నాన్న కొడుకు కు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టినాడు. బాలు రాజమండ్రిలో జరిగిన విషయం చెప్పడానికి బయపడుతూ ఉన్నాడు. ఇలా బాలు రూప విడిపోయి సంవత్సరం గడిచిపోయింది.

రూప నాన సింహచలం పోలీస్ స్టేషన్ కి పోయి మరలా రిపోర్టు ఇచ్చాడు. పోలీసులు భూషయ్య ను వారి బృందాన్ని పట్టకొని విచారణ చేయడం మొదలు పెట్టారు.

     బాలు కి  కొత్త సంబంధం వచ్చింది వారితో పెళ్లి కుదుర్చకోవడానికి బాలు అమ్మ నాన్న చుట్టాలతో కలసి తిరుపతి కి ప్రయాణం అయియ్యారు. ఇక్కడ రూప “విడిపోయిన బంధం మళ్ళీ ఎదరైతే” ఎంత బాగుంటుంది. బాలు ని ఎలగైనా కలవాలి బ్రతుకున్నాడని తలిస్తే చాలు అని మనసులో అనుకుంటూ బాధ పడసాగింది.

     బాలు వాళ్ళ నాన్న కు కొంటి  సాకు చెప్పి తిరుపతి కి తాను పోకుండా రూప కు జరిగిన అన్యాయంలో తానుకూడా బాగం పంచుకొన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని రూప ఇంటికి వస్తూ ఉన్న బాలుని పోలీసులు.  పట్టుకునని స్టేషన్ కు తీసుకెళ్ళి జరిగిన దానికి బాలును సెల్లో వేసారు.

బాలు నాన, అమ్మ తరుపతి నుండి రాగానే బాలు కనపడకుండా పొవటం తో కంగారు పడ్డారు. ఇంతలో పోలీసులు సుబ్బరాయుడు కి పోన్ చేసి బాలు స్టేషన్  ల్లో ఉన్నాడని, బాలుచేసిన నిర్వాహం పోలీసులు చెప్పగా, వెంటనే సుబ్బరాయుడు, భార్యను తీసుకుని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ కు పోయి ఏమి జరిగిందో   అడిగారు. ఇంతలో భూషయ్య, వారి బృందాన్ని కూడా పోలీసులు స్టేషన్ కి తీసుకొచారు. భూషయ్య తన కొడుకు కురూపి అని అతనికి ఎవరూ పిల్లని ఎవరూ ఈయడం లేదని అందుకే బాలు కనపడగానే మంచివాడు,అందంగా ఉన్నాడని. ఇలా వాడుకున్నాను. బాలుది ఏమి తప్పు లేదని ఒప్పు కొన్నాడు. ఇంతలో అక్కడకి రూప, సింహాచలం కనిపంచగానే బాలు కిఎక్కడ లేని ఆశ్చర్యము వేసింది. రూప బాలు ని చూడగానే కలిగిన ఆనందానికి హద్దులు లేవు.

తరువాత సింహాచలం, సుబ్బరాయుడు ఒకరి నొకరు పరిచయం చేసుకొని పోలీసులు ద్వారా ఒకటైనారూ. బాలుకి అల్లుడికి జరగళలసిన మర్యాదులన్ని జరిగాయి.
కొంత కాలం అత్తవారింట ఉండి, బాలు,రూప తో సహా సింహపురికి వెళ్ళి పోయారు.అక్కడ సుఖంగా జీవించారు. పెళ్ళి బృందం లో ఒకడు “విడిపోయిన బంధం మళ్ళీఎదురరైతే”.అనగా అందరూ తీయగా ఉంటుంది. అని నవ్వేరు,”కలిసిన జంట”ను చూసి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!