నేనండి మీ భార్యను

నేనండి మీ భార్యను
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆరుణ తోలేటి

వరహాల రావుకి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఆ సంబరాన్ని స్నేహితుల సమక్షంలో జరుపుకుని ఆనందంగా ఇంటి ముఖం పట్టే సమయానికి అనుకోని మలుపోకటి పనిగట్టుకు  తిరిగి అనవసరంగా రోడ్డు ప్రమాదం బారిన అకారణంగా పడ్డాడు. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా ఎలాగోలాగ ప్రాణాలతో కోలుకున్నా మతి మరపు రోగం ఒకటి మాత్రం మహగట్టి గా మెదడుని చుట్టేసింది వరహాల రావుకి. ఎంత వదిలించుకుందామన్నా ససేమిరా అంటూ ఫెవి ఖ్వీక్ లాగా బలంగా అంటుకు పోయింది. అది చాలదు అన్నట్టు మతిమరుపు తగ్గక పోగా
రెండింతలు బోనస్ గా కూడా పెరిగింది. వరహాల రావుని ఆఫీస్ దగ్గర తన భార్య సుజిత తమ్ముడు సుందరం దింపడం. ఆఫీస్ అయిపోయాక  తీసుకువెళ్లడం. రోజూ డ్యూటీలా చేస్తుంటాడు.
సుందరం ఆఫీస్ వరహాల రావు అఫిస్ కి కాస్త దగ్గరే అవడం. సుందరం ఉండేది వరహాల రావు ఇంట్లోనే  అవడం వలన ఆ డ్యూటీ తన మీదేసుకున్నాడు సుందరం. సుజిత తనకి చేదోడు వాదోడుగా ఉంటాడని తమ్ముణ్ణి తన వద్దే ఉంచుకుంటోంది..ఓ రోజు వరహాల రావు అఫిస్ లో ఫైళ్లు తిరగేస్తున్నాడు. ఇంతలో సెల్ ఫోను మ్రోగింది. డిస్ ప్లై లో భార్య సుజిత అని వచ్చింది. అయ్యో, పరాయి స్త్రీ తో మాట్లాడొచ్చా? ఆలోచిస్తూనే “హలొ” అన్నాడు. హబ్బా నేనండి మీ భార్యను. ఇపుడే డాక్టర్ దగ్గరకి వెళ్ళి వస్తున్నాను. మీకొక శుభవార్త నాకు రెండో నెలట, ఈ వార్త తెలిసి యెంత సంతోషపడ్డానో తెలుసా! మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. సెలబ్రేట్ చేసుకుందాం మంచిరెస్టారెంట్ కి వెడదాం, షాపింగ్ చేద్దాం ఇలా చెప్పుకుపోతోంది. ఈ మాటల ప్రవాహంలో తను చదివిన పేరు కాస్తా మరచిపోయాడు. వరహాలరావు ఆలోచనలో పడ్డాడు. ఆవిడ గర్భం గురించి కాదు. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? తనకు పెళ్లి అయిపోయిందా? కాపురం చేసినట్టు ఓ జ్ఞాపకం అన్నా లేదు. బోలెడు సందేహాలు బుర్రను తొలిచేస్తుంటే. పీక్కుందుకు బుర్ర మీద జుట్టు లేక, ఏమి అర్థం కాక అయోమయంలో పడ్డాడు వరహాల రావుమెరుపులా ఓ ఆలోచన టింగు మని వచ్చేసింది. వరహాల రావు బుర్రకి ముందు ఈవిడ పేరేంటో తెలుసుకోవాలి అని, నీ పేరేంటో చెప్పుకో చూద్దాం! అన్నాడు వరహాల రావు. పెద్ద మేధావి లా ఫోజెట్టి. ఎధవ మేధావి తెలివితేటలు ఈమతి మరుపు బుర్రకి. మరచిపోయి చచ్చాను అని చెప్పి చావలేవు. అంది కోపంగా భార్య సుజిత పళ్ళు పట..పటా.. నూరుతూ, అదేం లేదు నాకు అంతా గుర్తుంది. నీకు నాకు పెళ్లయింది. మనం ఒకే ఇంట్లో కూడా ఉంటున్నాం. ఇది చాలా ఇంకా వివరాలు ఏమైనా ఇవ్వాళ అన్నాడు. ఆవేశంగా వరహాల రావు. ఎదవ మేధావి తెలివి తేటలు ఈమతి మరుపుబుర్రకి. తట్టుకోలేక చస్తున్నాం, అంది భార్య విసుగ్గా చిటపటలాడుతూ. ఉన్నది ఉన్నట్టు అంతా పూస గుచ్చినట్టు చెప్తే ఎదవ మేధావి తెలివి తేటలు అంటావు. మరచిపోయాను అంటే మతి మరపు బుర్ర అంటుంటే. నేనేమై పోవాలి. చెప్పు అన్నాడు దీనంగా మొహం పెట్టి వరహాలరావు. సరేలే, గాని మందులు వేసుకుంటున్నారా టైంకి. నగ్న రేఖ ఉందా. తనకి అప్పచెప్పాను ఈ పనులన్నీ. ఒక సారి తనకు ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అఫిస్ లో సెల్ ఫోన్ తనకు నిషిద్ధంట అంది భార్య, బిక్క చచ్చిపోయాడు వరహాలరావు. ఈ నగ్న రేఖ ఎవరో.
అసలు ఈవిడే నాకు గుర్తురావట్లేదు మొర్రో మంటే. నగ్నరేఖను ఎలా పిలుచుకు రావటం. హలో ఇంతకీ మీ పేరేంటో చెప్పనేలేదు. భార్య అన్నారు కానీ యే పేరు అన్నది చెప్పనే లేదు అన్నాడు ధైర్యం చేసి. మండిపోయింది సుజితకి నా పేరు కాదు. ఇంటికి వచ్చాక, నీ భరతం పడతా..నీ తోలు తీస్తా. నిన్ను ఉప్పు పాతర వేస్తా. ఇదిగో చూడు ఇవ్వాళ ఒకటో తారీఖు. ప్రతిసారి జీతం పొయ్యిలో పోసి యెధవ మతిమరుపు మొఖం ఒకటి ఏలాడేసుకుని ఇంటికీ తగలడుతున్నావు కదా! ఇవ్వాళ ఇంటికి జీతం తేకుండా వచ్చావో, చూడు, నా పేరు ఎమ్ ఖర్మ. క్రిందటి జన్మలో నీ పేరు. నీ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ గుర్తుకు వస్థాయి. ఒక్కసారిగా హాఁ..అంటూ ఫోన్ కట్ చేసింది సుజిత కోపంగా.
ఇంతలో అటుగా వచ్చింది ఫైల్స్ పట్టుకుని నగ్నరేఖ ఏమిటి సర్ అలా వణికి పోతున్నారు? పాపం ఎమి జరిగింది, అని అడిగింది. ఎవరో స్త్రీ దేనికో నన్ను ఏదో బలంగా తిట్టినట్టు గుర్తు. అన్నాడు వరహాలరావు. ఏది మీ ఫోన్ ఇవ్వండి. అన్నది ఇచ్చాడు. అంటే, మీకు పెళ్లి అయ్యిందా? సర్ ఏమో అది జ్ఞాపకం రాకే ఇందాకటి నుండి తన్నుకు చస్తున్నాను ఇక్కడ అన్నాడు. ఎవరికో చేయబోయి మీకు చేసి ఉంటారు సర్. ఇది రాంగ్ నెంబర్ అంది నగ్నరేఖ నిర్లక్యంగా మొఖంపెట్టి. హ అది నాకు తెలుసు. నువ్వుకూడా అన్నీ తెలుసుకోవాలి. జాగ్రత్తగా సరేనా అన్నాడు. పరిస్థితిని కవర్ చేసుకుంటూ వరహాలరావు. ఫోన్ చేసింది వరహాల రావు భార్య అని తెలిసినా విషయం దాటేసింది. నగ్న రేఖ. సర్ మీరు ఫైల్స్ మీద సంతకాలు చేసేస్తే నేను ఫైల్స్ తీసుకువెళతాను సర్. అది సరేలే అయితే మనం పెళ్లి చేసుకుందామా? అడిగాడు వరహాలరావు. మీ ఆవిడ ఒప్పుకోదు సర్, నాకు పెళ్లి ఎప్పుడు అయ్యింది. అన్నాడు ఉలిక్కి పడుతూ అయోమయంగా బుర్ర గోక్కుంటూ. హ అయ్యింది సర్, మీ పెళ్లి రోజునే, మీకు మతిమరుపు అని ఎదవ మేధావి తెలివితేటలు మీవి. అని మీ ఆవిడ అభియోగం మీ పైన సర్ అంది నగ్నరేఖ. అలాగా, అయితే మనం పెళ్లి వెంటనే చేసేసుకుందాం. అన్నాడు రోషంగా, వరహాలరావు. అందుకు మా ఆయన ఒప్పుకోరు సర్. నీకెప్పుడు పెళ్లయిపోయింది. అన్నాడు షాక్ గా, నా పెద్దబ్బాయ్యి ఇంకా పుట్టక ముందు అంది నవ్వుతూ. ఈ పెళ్లిళ్లు అన్నీ చిత్రంగా, మనకు తెలియకుండానే ఎలా జరిగిపోతుంటాయో? ఇది సీరియస్ గా ఆలోచించదగ్గ విషయమే మరి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి. ఈ అరాచకాన్ని ఆపేవాళ్లే లేరా? తీవ్రగా ఆలోచనలో పడ్డాడు అతని ఆలోచనలకు అంతే లేదు. పడి పడి పలువిధాలుగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇది ప్రభుత్వ దోషమా? దైవ నిర్ణయమా? వరహాల రావు ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ. సర్..సర్. నాకో సహాయం చేయగలరా సర్. అతి వినయంగా అడిగింది. నగ్నరేఖ ఏంటి అన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు వరహాలరావు. మీరు మంచివారు. అపర మేధావులు. అందుకు మీ దగ్గర చొరవ తీసుకుని అడుగుతున్నాను. కాదు అనరనే నమ్మకం తో, కాస్త అప్పుగా మీ జీతం డబ్బులు మొత్తం ఇస్తారేమో అని. రేపే, రేపంటే రేపే మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సర్. అంది బేలాగా మొఖం పెట్టి నగ్నరేఖ నో..రేపు నేను ఏదో చేయాలి. డబ్బు ఇవ్వడం కుదరకపోవచ్చు అన్నాడు.
వరహాలరావు నిక్కచ్చిగా, అదేంటి సర్ ఇంతక ముందే కదా నీకు ఇస్తాను. అన్నది అసలే నాకు మతిమరుపు, అవసరం నీది ఒక సారి గుర్తు చేయిచాలు. ఎందుకైనా మంచిది అని అన్నారు. కదాసర్ కొంప దీసి మర్చిపోయారా సర్ అంది నగ్నరేఖ అక్చర్యం ఒలకబోస్తూ. నో..నో..నాకు మతిమరుపు లేదుగా, నేనేందుకు మరచిపోతానసలు, నువ్వు నన్ను అడగడం గుర్తుపెట్టుకున్నావో లేక ఎదవ మతిమరుపులో పడి మరచిపోయావో అని నిన్నుచెక్ చేసుకోడానికే ఈ పరీక్ష పెట్టేను. గుడ్ బాగానే గుర్తుంచుకున్నావ్. ఈ పరీక్షలో నువ్వు విన్ అయ్యావ్. నీకు 5 స్టార్స్ వేస్తున్నాను. నీ జ్ఞాపక శక్తి కి అన్నాడు. వరహాల రావు. జీతం డబ్బులు మొత్తం ఇచ్చేస్తూ. ఎధవ మేధావి తెలివితేటలు, వీడు..వీడి బొంద బిల్డప్పులను. వీడు వేస్తాట్ట. నా జ్ఞాపకశక్తికి 5 స్టార్  మార్కులు. భరించలేక చస్తున్నాం వీడి బుర్రతో అయిన వీడి మతిమరుపు వలనే గా ఆఫీస్ స్టాఫ్ అంతా బాగుంది. నేను బాగుకుంది. స్టాఫ్ లోని వారు ఈ విషయం ఎక్కడా బయటకి పొక్కించకుండా ఎప్పటిలానే అందరికి తలో ఇంతా పడేసి, అర్జన్టుగా లలితా జ్యూవెల్లరీస్ కి వెళ్ళాలి. డబ్బులు ఊరికే రావు. గుండుగాడు చెప్పినట్టు అనుకుంటూ ఆనందంగా, వరహాలరావు జీతం డబ్బులు పుచ్చుకుని ఎంచక్కా క్యాబ్ ఎక్కి చక్కాపోయింది నగ్నరేఖ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!