వాగ్గేయకార వైభవము

అంశం: సంగీతము

వాగ్గేయకార వైభవము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

వినాయకుడు వీణ పేరు లకుమ
సరస్వతి వీణ పేరు కచ్ఛపి
నారదుడి వీణ పేరు మహతి
ఇలాంటి అద్భుత పేర్లు పెట్టీ
మానవ జీవితానికి గొప్ప విద్యను ప్రసాదించారు.
ఇంకా తుంబురుడు రాఘవేంద్రుడు ఆంజనేయుడు వీరంతా విశిష్ట సంగీతా ఆరాధకులు, రాజుల కాలంలో అశ్వమేధ యాగానికి వీణ నాదంతో అద్భుతంగా వాదన ఉండేది. ఇలా ఎంతో అపూర్వంగా ప్రతి శుభ కార్యనికి ముందు సంగీతం వాయిద్యాలు మంగళ వాయిద్యాలు కూడా ఉంటాయి. సంగీత విద్వాంసులను సత్కరిస్తారు వేదాలు పురాణాలు కూడా వీణకు ఘన స్థానం ఇచ్చారు, ప్రాచీన కాలంలో గర్భవతి అయిన రాణులకు పుంసవనం చేసేక వీణ వాయిద్యం నిరతరం ఒకరి తరువాత మరొకరు వేదంలోని రుక్కు వాయించేవారు దీని వల్ల స్త్రీ శిశువు పురుష శిశువుగా మారడానికి ఈ విధంగా చేసేవారు ఇది వేదంలో చెప్పబడింది. ప్రాచీన గ్రంధములలో వేద విశ్లేషణ ముఖ్య ఉద్దేశం తెలుపడానికి సంగీతం కూడా ప్రధాన అంశము ధర్మ, అర్థ ,మోక్ష కామలు కళల వల్ల ముఖ్యం గా నవ విధ భక్తిమార్గములు లో ఈ సంగీత శాస్త్రం ముఖ్య పాత్ర అని చెప్పాలి.
64 కళల్లో 5 కళలు ముఖ్యంగా అలవర్చుకోవాలి..
యోగి పొందే ప్రయోజనాలు ఈ సంగీతం ద్వారా పోంద వచ్చును . అద్వైతసిద్ధికి అమరత్వ లబ్దికి గానమే సోపానం అని చెప్పారు కాళిదాసు..
1 శైసవ్ సౌఖ్యస్ట విధ్యా నమ్మ్
2 యౌవన వుష మాపి నామ
3 వార్ధక్య మపి వృత్తి నామ్
4 యోగి నాంతే
తనుత్వజమ్ ఇవి ఉత్తమ మానవుని లక్షణాలు కానీ ఇవి ప్రతి సామాన్య జీవికి సాధ్యం కాదు.
యోగ పరంగా చూస్తే
ఇళ +పింగళ_ నాడు లు ఆనందంలో రాజస తామస సాత్వికంగా జ్ఞానికి సుషున్నత్ కల్గుతుంది హృదయాన్ని కదిలించే కరిగించేది సంగీతము. కానీ ఎక్కువ సాధన చెయ్యాలి ప్రత్యేక శిక్షణ పొందాలి. కానీ నేడు ప్రయాణ వాహనాలలో కూడా సంగీతం ఉంటోంది సినిమా సంగీతం మనచుట్టూ వై ఫే లా ఉన్నాయి. రాఘేవెంద్రుని వీణ నాదం తో మత గురువు అర్చించి మత గురువుగాను విప్ర నారాయణుడు శ్రీ రంగనాథుని కళ్ళను చూస్తూ కీర్తిస్తూ మోక్ష ము పొందారు. మీరా జయదేవుడు నేటి స్వామీజీలు ఈ సంగీత యోగ ద్వారా ఎన్నో మంచి ఫలితాలు పొందుతున్నారు.

వాగ్గేయ కార వైభవము

శ్రీ త్యాగాజస్వామి వారు పెద్ద తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి నప్పుడు దర్శన సమయం దాటి నది అని చెప్పినప్పుడు త్యాగ రాజు గారు గౌళీ పంతు రాగంలో తెరతియగ రాదా ! అనే కీర్తనలు ఆశువుగా పాడ గానే తెర తొలిగి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు అప్పుడు అక్కడివారు ఎంతో ఆశ్చర్యం ఆనందం చెందారు.
2 దీక్షితార్ వారు గొప్ప విద్వాంసులు ఎట్టాయ పురం రాజ్యంలో క్షామం వల్ల పంటలు లేక భాధ పడుతున్నారు. సంగీత యజ్ఞం ద్వారా పంటలు పండించాలని చెప్పినప్పుడు, 200 మంది విద్యార్థులతో ఆయన అమృత వర్షిణి రాగం పాడుతూ వర్షాన్ని కురిపించారు పంటలు పండి దేశం సుభిక్షంగా అయ్యింది.
3 సుబ్బరామయ్య దీక్షితార్ శిష్యులు కడుపు నెప్పితో బాధ పడుతుంటే బుధ గ్రహ కీర్తన రాసి పాడి కడుపు నెప్పి తగ్గించారు. ఈ విధంగా తొమ్మిది గ్రహాలకు కూడా కీర్తనలు చేసి మనకు అందించారు.
4 . తాన్ సేన్ దీపక్ రాగంలో పాడిన పాటలు దీపాన్ని వెలిగించడం జరిగింది
5 . శ్రీ శ్యామ శాస్త్రి అమ్మ వారిపై ఎన్నో ఘన మైన కీర్తనలు రచించి పాడారు.
ఇలా మన వాగ్గేయ కారులు మనకు నిధిలా ఎన్నో కీర్తనలు క్షేత్ర దర్శనంలో ఆశువుగా పాడి మనకు అందించారు. మన దేవుడి సంగీతానికి ఎంతో ప్రతిభ ఉన్నది. ఆంజనేయుడు రాతి నుంచి వీణ సంగీతం పాడి బయటకు తీసి తన ప్రతిభ చూపారు.
శ్రీ కృష్ణుడు మురళి నాదంతో గోవులు పాలు అధికంగా ఇచ్చాయి. గోపికలు నాట్యము తన్మయత్వంతో చేసేవారు. బ్రహ్మ దేవుడు తన సృష్టి నీ ఆ వాణి వీణా నాదం వింటూనే చేస్తారని ప్రతీక, శ్రీమాత నీ నాద నామ స్వరూపిణి అని కూడా కీర్తిస్తారు. 300వ నామం శ్రీ లలిత సహస్రము లో ఉన్నది. శ్రీనివాస అలిమేలు మంగను గద్యంలో రాగాలతో కీర్తిస్తారు. సంగీతం కేవలం ఏడు అక్షరాలతో కొన్ని కోట్ల మేళకర్త రాగాలతో జనక రాగాలు నుంచి జన్య రాగాలు పుట్టి ఎన్నో కీర్తనలు మనకు ఉన్నాయి. శ్రీ అన్నమయ్య 32 000 కీర్తనలు రాస్తే, శ్రీ త్యాగయ్య 24,000 కీర్తనలు రాశారు. వాల్మీకి రామాయణంలో 24, 000 పద్యాలకు త్యాగయ్య 24,000 కీర్తనలు రాశారని చెపుతారు.
ఇలా వాగ్గేయ కారులు వేల కొలది కీర్తనలు మనకు తరగని ధనం లా అందించారూ. సామవేదం వల్ల ఎంతో ఉపయుక్తములు ఎన్నో తరాలకు ఉన్నాయి.
సైన్స్ పరంగా చూస్తే ఫ్రెంచ్ దేశంలో ఒక రైతు పక్షుల భాధా నుంచి పంట గురించి సంగీతం శాస్త్రం విద్వాంసులకు చెపితే కాపాడుకోవడానికి ప్రతిరోజూ సంగీత సాధన చెయ్యమని గురువు చెపుతారు. వయోలిన్ మధురంగా వాయించడం వల్ల పంట బాగా పెరిగింది. ఈ విషయం వృక్ష శాస్త్రజ్ఞులకు చెపితే వారు వారి పద్దతిలో పరిశోధన చేసి సంగీతాన్ని మొక్కలు కూడా ఆస్వాదిస్తాయని చెప్పారు. ఆ ప్రకారం క్రమం తప్పకుండా
పంటను కాపాడుకుంటూ గాలి మర ఒక ప్రక్క వయోలిన్ సంగీతం ఇంకో ప్రక్క వినిపిస్తూ పంటను అద్భుతంగా పెంచి గురువులను, శాస్త్రజ్ఞులకు ఆశ్చర్య పరిచాడు. ప్రయోగ శాలలో గాజు బీకర్లు రెండు పెట్టీ రెండు చిన్న మొక్కలు కుండిలు పెట్టారు.
వీటిలో ఒక దానికి సంగీతం వినిపించారు. అది కొత్త పత్రాలతో చిగురులతో తొడిగి బాగాపెరిగింది. రెండవది ఆకులు రాల్చి మోడుగా మిగిలింది. ఈ ప్రకారం కూడా నిరూపించారు. సంగీతానికి మొక్కలు పరవశిస్తాయి అని నిరూపణ అయ్యింది.
కాలం అనుగుణంగా రాగాలు ఉదయం భౌళి భూపాలము, సాయంకాలము మలయ మారుతము ఇలా పాడాలి కానీ నేటి తరంలో కచ్చేరీలు సాయంత్రం వేళ అందుకు తగిన కీర్తనలు పాడుతున్నారు. రోగాలపై పరిశోధన ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క రాగము శరీరంపై ప్రభావం చూపుతుంది. శ్రీ రాగం వాళ్ళ అజీర్ణము కడుపు నొప్పి వంటివి తగ్గుతాయని చెపుతారు. హిందుళం మానసిక వత్తిడి తగ్గిస్తుంది. శంకరాభరణం బి.పి ని రక్తప్రసరణ తగ్గిస్తుంది. కాభేరి, ఆరభి హృదయ రోగాలు తగ్గిస్తాయి, శివరంజని, రేవతి కొంచెం నెమ్మదిగ ఉంటాయి. కల్యాణి, మోహన ఈ రాగాలు మనసుకు హాయి హాయిగా ఉంటాయి. మనిషి జీవితానికి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. లెక్కలు, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, ఫిలోషపి, ఫీజియలజి , సంస్కృతం, బయలిజీ , ఆయా ప్రాంత భాష తప్పనిసరి కన్నడం వారు కన్నడం, తమిళ్ వారు తమిళం, మలయాళం హిందీ తెలుగు ఇలా ఆయా ప్రాంత భాష ద్వారా కీర్తనలు పాటలు జాన పదులు లలిత భావ సంగీతం ఉంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!