అతిధి పెళ్లి

అతిధి పెళ్లి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యుడితో పాటు కృత్తిక ఉద్యోగం పరుగు. రకరకాల స్నేహితులు ఎన్నో రకాల జీవిత మధనల పరంపరలో మగ్గి పోతూ నలిగి పోతూ జీవన గమ్యాన్ని ఎంచుకోవాలని తపనలో సాహసం చెయ్యడం తప్పదు. ఆడపిల్ల ఇంటిపని, వంటపని నేర్చుకోవాలి దానితో పాటు, ధైర్యంగా, సహసంగా అన్ని పనులు చేయాలి. ఉదయం బాక్స్ సర్దుకుని సిటీ బస్ లో బయలుదేరీ, గంట తరువాత ఆఫీస్ దగ్గరలో బస్ స్టాప్ లో దిగి వెళ్ళాలి కొంచెం దూరం ఉంటుంది. ఉద్యోగం తప్పదు కాదా! వడి వడిగా అడుగులు వేస్తుంటే, అమ్మా ఇప్పుడే వేడి వేడి గా కాల్చిన మొక్క జొన్న పొత్తుల వాసన నాసికా పుటల్ని తాకుతోంది. వెంటనే అమ్మ మీకోసం రెడీ గా పొట్లం కట్టాను తీసుకోండి. అన్న పిలుపు వినిపించింది. అది విన్న గొంతు, వెంటనే వెనక్కి చూసింది. ఓ ప్రక్క వాన చినుకులు పడుతున్నాయి. వేడి పొత్తుల ఘుమ..ఘుమ లు మనస్సుకు హత్తు కుని ముక్కు పుటాలు చేరుకున్నాయి. సరే అంటూ రెండు పొత్తులు వెడువి కోని బ్యాగ్ లో పెట్టుకుని ఆఫీస్ చేరుకుని వర్క లో మునిగింది. వంటిగంటకి ఫోన్ వచ్చింది, చిన్నప్పటి ఫ్రెండ్ అతిధి పెళ్లి ఈ ఊరు వచ్చి చేస్తున్నారు. పెళ్లికి పిలువడానికి వచ్చారు అని అమ్మ చెప్పి ఫోన్ వారికి ఇచ్చింది.
హలో బాగున్నావా ఉద్యోగంలో ఉన్నావు. నీ ఫ్రెండ్ అతిధ పెళ్లి నువ్వు అమ్మని తీసుకుని రావాలి.
ఊరు మధ్యలో ఉన్న శ్రీ వేంకటేశ్వర టాకీస్ దగ్గర ఉన్న కొత్త ఏసీ ఫంక్షన్ హాల్. అక్కడ ఆటోలు ఎప్పటి కప్పుడు ఉంటాయి తప్పక రండి అని ఫోన్ లో చెప్పారు. సరే ఆంటీ తప్పకుండా వస్తాను అన్నది.
అన్నయ్యని ప్రయోజకులు చేస్తే ఇంటి భాధ్యతలు పట్టించు కోకుండ విదేశాలు వెళ్లి పోయారు.
అమ్మ, నాన్నను చూస్తూ కృతిక తల్లి, తండ్రులు ప్రేమ పొందుతూ ఉన్నది. మంచివాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి, ఎప్పుడూ దొరుకుతాడు అని ఎదురు చూస్తున్నారు. దాని ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతోంది. ఇంకా ఇది మిగిలింది. మగ పిల్లలు కూడా పెళ్లి చేసుకోండి రా అంటే, అవకాశం వచ్చింది వదులు కో కూడదు అంటూ వెళ్లి పోయారు. ఈ రోజు ఇంటికి వెళ్ళే సమయంలో వెండి కొట్టుకు వెళ్లి వెండి కుందులు కొనాలి. అనుకుంటూ పనిలో దూరింది. ఆ రోజు పేపర్ పూర్తి చేసి పెట్టే రేపటికి ఆర్టికల్స్ రెడీ చేసి పెట్టీ, లీవ్ లెటర్ ఇచ్చి ఇంటికి అరు గంటలకి బయలు దేరింది. కృతిక ఒక పత్రిక ఆఫీసు లో సబ్ ఎడిటర్ చేస్తోంది. ఫి. జి అయ్యాక ఖాళీ ఎందుకని జాబ్ లో చేరింది. ఇంటికి వస్తుంటే మళ్ళీ మొక్క జొన్న పొత్తుల పచ్చివి కొన్నది. అమ్మ, నాన్న కి ఆచారం కూడా..ఇంటికి వచ్చి కుక్కర్ లో ముక్కలు చేసి వేసి ఉదికించిధి. మెత్తగా అవుతాయి. ఆరు విజిల్స్ వచ్చాక కట్టేసి దింపి చల్లార్చి ప్లేట్స్ లో పెట్టింది. అమ్మ నిమ్మరసం పిండి, కారం జల్లించి.
ఇంకా అమ్మన్నాన్న మాటల్లో పడి, వాళ్ళ చిన్న తనం విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు. జొన్న గింజలు వలిచి కొన్ని చిన్న గిన్నె లో పెట్టారు. కొన్ని తిన్నారు. కృతిక స్నానం చేసి బట్టలు మార్చుకుని. రెండు కప్పుల బియ్యం కడిగి కుక్కర్లో పెట్టింది.
ఉదయమే అమ్మ తనకి క్యారేజ్ సర్ధి ఇస్తుంది. ఒక్కోసారి అన్నం ఇంట్లోనే తినేసే వెడుతుంది. ఆఫీస్ వర్క్ ను బట్టి వెడుతుంది. ఈ రోజు ఉదయం కూరలతో పాటు, మొక్కజొన్న కూర కూడా
అన్నది. అవును ఉల్లి ముక్కలు, మిక్సి పట్టి ఉడికించి చల్లార్చి అందులో ఈ గింజలు వేసి మసాలా ఖరం మళ్ళీ చల్లితే ఎంత బాగుంటుంది అన్నారు. సరే అంటూ కృత్తిక వెళ్లి నాన్న అడిగాడు అని ఏవిధంగా చేసింది. మళ్లీ వచ్చి కూర్చుని రేపు పెళ్లికి నువ్వు వస్తున్నావా! అన్నది. అనట్లు మరిచాను వెండి కుందులు తెచ్చాను అన్నది.
ఏమో మీ నాన్న వెళ్ళమంటే వస్తాను. ఆయన ఒక్కడు ఉండలేను అంటారు కదా! అని తల్లి పూర్ణ నిట్టూర్చింది. సరే ఉదయం ఇంటి దగ్గర పెళ్లి కూతురుని చేస్తారు. అక్కడే భోజనం అన్నారు. అప్పుడు ఇద్దరం వెళదాం అన్నది. సరే పడుకో ఉదయం లేవాలి అన్నది. ఆరోజు సీరియల్స్ కి అమ్మ సెలవు ఇచ్చింది. ఉదయాన్నే లేచి ఇడ్లీ వేసి అందరూ తిని. తండ్రికి పప్పు మామిడి కాయా వండి కొబ్బరి పచ్చడి చేసి, టేబుల్ పై పెట్టీ పట్టు చీరలు కట్టి తల్లి కూతురు వెళ్ళారు. మేము బ్రేక్ ఫాస్ట్ అక్కడ తింటాము అన్నారు. సరే అని చెప్పి గేటు తాళము వేసి వెళ్ళండి నేను లోపల టి.వి చూస్తు ఉంటాను అన్నాడు. సరే అని తల్లి కూతురు బయలు దేరారు. దారిలో కనకాంబరం పూల దండ మూర ఎనబై రూపాయలు పెట్టీ కోని తల్లి కూతురు పెట్టుకున్నారు. ఆకుపచ్చ కంచి పట్టుచీర జాకెట్ తల్లి, ముదురు గులాబీ అపూర్వ చీర జాకెట్ కూతురు కట్టుకుని తెల్లగా అందంగా ఉన్నారు. నగలు సింపుల్ గా చిన్న నెక్లెస్ పెట్టుకున్నారు. ఆటో ఎక్కి వెళ్ళారు. ఇంటిముందు ఆటో దిగుతుండ గానే ఎదురు వచ్చి అతిధి తల్లి లోపలికి తీసుకు వెళ్ళింది.
అంతా ఈవెంట్ వాళ్లు చూసుకుంటారు. పెళ్లి కూతురు తల్లి కూడా అందరితో కబుర్లు చెపుతూ భాధ్యత లేకుండా హాయిగా ఉన్నది. అతిధిని బంగారు బొమ్మలా అలంకరించారు. వస్తువులు కూడా బ్యూటీ పార్లెల్ వాళ్ళు తెచ్చి అలంకరించారు.
చాలా బాగున్నాయి నగలు అవి కూడా, ఓ వంద మంది అయ్యారు బంధువులు, మోగ పెళ్లి వారు అంతా కలిసి కబురులు, ఈ కబుర్లు వాయనాలు అయ్యాయి. సరే భోజనాలకి అందరికీ పిలుపు వచ్చింది. వెళ్లి తిన్నారు అన్ని బాగున్నాయి. ఇది చిన్న హాలు పెళ్లికి పెద్ద హాలు ఉన్నది. అని అడ్రస్ చెప్పింది. అలాగే వస్తాను అంటూ బయలు దేరారు పెళ్లి కూతురు చేతిలో తెచ్చిన గిఫ్ట్ పెట్టారు.
అతిధి తల్లి ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఇద్దరికీ చీరలు పెట్టింది. ఎప్పుడు ఎందుకు ఆడ పిల్ల పెళ్లి కదా అన్నారు. అయితే ఏమి ఇది ఆఖరు పెళ్లి.
మగపిల్లలు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. చెల్లెలి పెళ్లి ఘనంగా చెయ్యాలని ఉన్న ఊరు వచ్చి చేస్తున్నారు. అని రాత్రి పెళ్లికి సాయంత్రం వచ్చేయండి అన్నది. మీరు బట్టలు తెచ్చుకుంటే ఇక్కడ నుంచే అంతా కలిసి వెళ్దాంము. మరి మీరు తప్పకుండా రండి అన్నది. సరే అంటూ బయలు దేరి ఇంటికి వెళ్ళారు తాళం తీశారు. తండ్రి భోజనం చేసి పడుకున్నాడు.
చప్పుడు చెయ్యకుండా వెళ్లి బట్టలు మార్చుకుని వీళ్ళు పడుకున్నారు. అలసట వల్ల వారికి నిద్ర బాగా పట్టింది. నాలుగు గంటలకి మెలుకువ వచ్చి, లేచి టీ తాగి మళ్ళీ పెళ్లికి రెడీ అవ్వాలి అనుకున్నారు.
తండ్రి నువ్వు వేళ్ళు, మీ అమ్మ వద్దు నాకు టిఫిన్ చెయ్యాలి. ఉదయం కూడా వెళ్ళింది సాయంత్రం నువ్వు వెళ్ళు పర్వాలేదు అన్నాడు. సరే అంటూ కృతిక రెడీ అయ్యి వెళ్లింది. హాలు చాలా పెద్దది ఓ వెయ్యి మంది ఉంటారు. అందరికీ చక్కగా ఎవరికి నచ్చిన చాట్, టిఫిన్స్ కూల్ డ్రింక్స్ ఐస్క్రీమ్ అన్ని స్టాల్స్ గా పెట్టారు. మళ్ళీ రాత్రి ఏడు గంటలకి డిన్నర్ ఉన్నది. అని కూడా మైక్ అనౌన్స్ మెంట్ ఉన్నది. ఓ ప్రక్క డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది. చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఏదైనా పెట్టీ పుట్టాలి. అతిధి రూమ్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. పెళ్లి పది గంటల ముహూర్తం కనుక ముహూర్తం లోగా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. సరే పెళ్ళికొడుకు, పెళ్లి కూతుర్ని రిసెప్షన్ కి ఏడుగంటలకు కూర్చో పెట్టారు. కృతిక తెలుసున్న వారి తో మాట్లాడి అతిధి భర్తను పరిచయం చేసుకుని, భోజనం చేసి రాత్రి తొమ్మిది గంటలకి వాళ్ళతో వెడతాను పెళ్లి అయ్యేటప్పటికి బాగా రాత్రి అవుతుంది. అని చెప్పి బయలు దేరింది. అందరూ హడావిడి లో ఉన్నారు. సరే నాలుగు అడుగులు వేసి ఆటో పిలిచింది. ఎక్కడికి అన్నాడు. బస్ స్టాండ్ ప్రక్కకి అన్నది. సరే నూట పాతిక ఇవ్వండి అన్నాడు. నువ్వు ఎవరిని ఎక్కించా వద్దు డబ్బు నేనే ఇస్తాను అన్నది. సరే అన్నది ఎక్కి కూర్చున్నాక ఒక్క నిముషం అంటూ ఓ కుర్రాడు మాట్లాడాడు.
సరే అంటూ ముందుకు నడిపి ఆపాడు. ఇద్దరు ఎక్కారు ఇంకో అడుగు వెడుతుండగ నడుస్తున్న ఆటో లోకి ఇంకో ఇద్దరు ఎక్కారు. ఇదేమిటి నేను ఎవరినీ ఎక్కించ వద్దు అన్నా కదా! మళ్ళీ వీళ్ళు ఏమిటి? వాళ్ళ ముఖాలు మాటలు కృతిక గ్రహించింది. వాళ్ళు రైల్ వే గేట్ దగ్గర దిగుతారు. రోజు ఎక్కుతారు అన్నాడు..సరే కానీ నేను ఒక్కర్తిని అని చెప్పను నాకు పళ్ళ లగేజ్ ఉన్నది. పళ్ళ కొట్టు దగ్గర ఆపు అని చెప్పింది. కొంచెం కదల గానే అనుమానం వచ్చింది. వాడు పళ్ళ కొట్టు దగ్గర ఆపాడు వాళ్ళను తప్పించుకుని కిందకి దిగి పళ్ళ కొట్టులోకి వెళ్ళింది. నువ్వు వాళ్ళని దింపిరా నేను ఇక్కడ ఉంటాను అన్నది. వాళ్ళకి ఇంకా ఎక్కదు అని తెలుసుకుని ఉంటారు. అందుకు ముందుకు వెళ్లి చూశారు. ఈ లోగా అన్నయ్య ఫ్రెండ్ స్కూటర్ మీద వెడుతూ ఈ సమయం లో మార్కెట్ కి వచ్చి పళ్ళు కొంటున్నావు ఏమిటి? అన్నాడు. అక్కడ ఉన్న అటు చూపించి విషయం చెప్పింది. నువ్వు నా స్కూటర్ పై రా ఇంటికి తీసుకు వెళాతానన్నాడు. అని స్కూటర్ ఎక్కించుకు బయలు దేరాడు అది చూసి ఆటో వెళ్లి పోయింది. అప్పుడు కృత్తిక కు వాళ్లపై అనుమానం రావడం వల్ల ఆటో వాడికి పళ్ళు కొంటానని చెప్పి దిగడం మంచిది అయ్యింది.
మర్నాడు పేపర్లో న్యూస్ అటో లో కుర్రాళ్ళు మాదిరి బ్యాగ్లు పట్టుకుని ఎక్కి రకరకాల మోసాలు, డబ్బు లు సెల్ ఫోన్లు మాయం చేసే ముఠా వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు..రాత్రి వేళ ఆటో లో వెళ్ళ వద్దు
అని వేశారు. న్యూస్ ఛానల్ ల్లో కూడా చెప్పారు.
ఆడపిల్లలు దూరంలో ఉద్యోగం చేసినా, రోజు ఎదో ఒక సమస్య ఎదురు కోవాలి, ధైర్యం గా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయం ముందు ఇంట్లో చెప్పలేదు. బ్రతుకు నాటకంలో ఎన్నో మార్పులు ఇంటి లోపలి వచ్చి, అతిధి నీ దింపి తల్లి తండ్రితో కొన్ని కబుర్లు చెప్పి వెళ్ళాడు. ఆ సమయం లో అన్నయ్య ఫ్రెండ్ రావడం అదృష్టం అని తల్లికి తండ్రి కి చెప్పింది. నానటీ బ్రతుకు నాటకము అని మనకు అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పాడు. అధి తెలుసుకుని మనిషి అవకాశాన్ని బట్టి విజ్ఞతతో జీవితం గడపాలి. ఈ రోజుల్లో భార్య భర్త ఉద్యోగాలు ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకోవడం కుదరక హాస్టల్ లో పెట్టీ చదివిస్తున్నారు. పేపర్ చూస్తే రోజు ఎదో ఒక విషయం. ధైర్య సాహసాలు విషయాలు చదువుతూనే ఉంటాము కానీ అతిధి కళ్ళతో ఆ మనుష్యుల్ని చూసింది. కాలేజ్ బ్యాగ్స్ తో ఉన్నారు..యువత వాళ్ళ అధిక ఖర్చుల కోసం ఈ మార్గం ఎంచుకున్నారు. అని ఒక పెద్ద వ్యాసం రాసి పేపర్లో వేసింది. ఎడిటర్ గారు మంచి వ్యాసం ఇచ్చారు అని మెచ్చుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!