వస్త్రాలపై చిత్రాల అలంకరణ

వస్త్రాల పై చిత్రాల అలంకరణ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: నారుమంచి వాణి ప్రభాకరి

ఆధునిక యుగం లో ఎన్నో అందాల వస్త్రాలు అలంకరణ రీతిలో రక రకాల హస్త కళల ప్రాముఖ్యతా ఉన్నది. ఇవి ఇంటివద్ద గృహా ఉపాధిగా బాగుంటుంది. ఆర్థికంగా కూడా ఉపయోగము, చీరాలపై అలంకరణలు చిత్రాలు బాటిక్,కలం కారి, టై అండ్ డై యి ఫాబ్రిక్ పెయింటింగ్, స్తేన్సిల్ వర్క్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. నచ్చిన చిత్రాలు సినరీస్ చీరల పై చెయ్య వచ్చును. ఇది ప్రత్యేక కోర్సు ఉన్నది ఇవి ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలలో కోర్స్ చెయ్య వచ్చును.
కావాల్సిన రంగులు బోర్డ్స్ కూడా కొనుక్కుని ఈ బిజినెస్స్ చెయ్య వచ్చును. నాకు తెలిసిన ఆమె ఈ తరహా బిజినెస్ ఇంటివద్ద చేస్తున్నారు. కుటుంబ మంతా ఆమె కి సహాయం చేస్తారు. దీనికి అనుబంధంగా రోలింగ్ కూడా పెట్టుకుంటే మంచి ఉపాధి. లయన్స్ వంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కోర్స్ వస్త్రాలపై చిత్రాలు నేర్పి ఫాబ్రిక్ కంపెనీ సర్టిఫికెట్స్ ఇచ్చాము. వారికి బ్యాంక్ లోన్ కూడా ఇస్తారని చెప్పారు. కళల ద్వారా ఎన్నో ఉపయగాలున్నాయి. ఈ తరహా గా చిత్రించిన బొమ్మలకు నగలు, ఎంబ్రాయిడరీ వంటి వానితో అలంకరిస్తే ఇంకా బాగుగా ఉంటాయి. కళలను జీవన రవళులు గా మార్చుకుంటే కాలం ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ కోర్స్ కాల పరిమితి 15 రోజుల నుండి మూడు నెలల వరకు ఉంటుంది. ఇందులో ఇంకా ప్రావీణ్యత కావాల్సిన వారు సర్టిఫికేట్ కోర్స్ , డిప్లొమా కోర్సు, బీ ఫ్ స్
ఎం ఫ్ ఎస్, వంటి డిగ్రీ పిజి కోర్స్ లు చెయ్య వచ్చును. ఇది హస్త కళకు సంబంధించినవి కనుక ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. మన్నిక అందము బాగుంటాయి. కొంచెం కళా సృష్టికి కళాసృష్టి చేరి ఎంతో అందమైన వస్త్రాలు మన సొంతం అవుతాయి. కలంకారీ వర్క్ ఇవ్వాళ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఎన్నో చిత్రాలు గతంలో కాటన్ కి మాత్రమే పరిమితము, ఇప్పుడు అన్ని రకాల వస్త్రాల పై ఈ డిజైన్స్ తయారు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఈ వృత్తికి అంకిత మయ్యి గ్రామాలు మొత్తం ఈ డిజైన్లు వస్తున్నాయి. కనుక ఈ కళల గురించి వివరాలు బాగా తెలుసుకుని పని ప్రారంభిస్తే ఎంతో కీర్తి, డిజైన్స్ వెయ్యడం రాని వాళ్ళు వేసిన డిజైన్ కి రంగులు పూయ వచ్చును. లేదా డిజైన్ మధ్యకు కుంచెతో రంగులు పూయ వచ్చును ఆసక్తి ఉంటే ఈ విద్య సులువుగా నేర్వ వచ్చును.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!