విచక్షణ

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

విచక్షణ

రచన: యువశ్రీ బీర

జీవిత గమనంలో,
నీ పయనమెచటికో…
రంగుల ప్రపంచం కడు రమ్యమే…
అందు ఊహించని మలుపులలో…
నీ నడకల సవ్వడి ఎటువైపుకో…
అది నీ అంతరంగానికి తెలుస్తూనే ఉంటుందిసుమా…

బాల్యంలో పడిలేచే అడుగులు… తప్పటడుగులైతే,
తల్లిదండ్రులు నడకలు మార్చి…
నడతలు దిద్దుతూ, నడిపిస్తారు…

మరి యవ్వనప్రాయం కోతిలాంటిది…
ఎవరిమాటను లెక్కచేయదది…
అందుకే నీ అంతరంగమే నిను అజ్ఞాపిస్తుంది…
అది గమనించుకు నడిస్తే అంతా మంచే జరుగుతుంది మరి…!

ఊరించే వయసులో…
మనసు పరుగులుతీస్తుంటే…
ఆంక్షల కళ్ళెం వేయాల్సిందే…
అంతరంగం ప్రశ్నిస్తే, నువ్వు ఖచ్చితంగా బదులివ్వాల్సిందే…
లేదంటే నువ్వో
చెడుప్రవర్తనగల మనిషివవుతావు…
మంచిచెడుల విచక్షణ నీ అంతరంగానికి కాక ఎవరికి తెలుస్తుంది మరి…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!