(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
అంతరంగం ప్రశ్నిస్తే
రచన: కాంతి శేఖర్ శలాక
కాటుక కళ్ళ మాటున
కరిగిన కలలెన్ని
తిలకం దిద్దుకునే ప్రతిసారీ
నుదుటి రాతను నిందించుకున్న సందర్భాలు ఎన్ని
చిరునవ్వు చిందించే పెదాల వెనుక
బాధను దాచుకున్న నిముషాలు ఎన్ని
సమాజం కింద
తల్లిదండ్రుల కట్టుబాట్ల కింద
అత్తమామల ఆంక్షల కింద
అన్నీ తనే అని నమ్మించిన మనిషి దాష్టీకం కింద
అమ్మా అమ్మా అంటూనే
అమ్మకి ఆశలుంటాయి, ఆసరా కావాలి అని గుర్తించని సంతతి కింద
నలిగిపోతూ కూడా
నా ఇల్లు నా వాళ్ళు అనే బంధాల బంధనాల మధ్య
నీ ఆత్మసాక్షి కి ఇష్టంగా ఒక్క క్షణం అయినా గడిపావా అని
అంతరంగం ప్రశ్నిస్తే…
మౌనమే జవాబు…
ఈ దేశం మహిళ ది…
**********************
👌👌👏👏