ముద్దు గుమ్మ

(అంశం:” తుంటరి ఆలోచనలు”)

ముద్దు గుమ్మ

రచన: యాంబాకం

కొబ్బరి లంక అనే ఊరి లో కనకమ్మ అనే ఆవిడ నివసిస్తున్నారు. ఆమెకు ఒక కూతురు పేరు చామంతి కనకమ్మ చిన్న వయసులో నే భర్త ఒంటరిగా వదలి అతని సుఖం అతను చేసుకొన్నాడు విధివిషాత్ చనిపోయారు. అప్పటి నుండి కనకమ్మ కొబ్బరి లంక లోనే చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకోంటూ జీవనోపాధి గా చేసుకొని జీవించి సాగింది..బిడ్డ కోసం, భర్త చనిపోయిన కూడా గండెను రాయి చేసుకొని బిడ్డ భవిష్యత్ కోసం కోరికలు అదుపులో పెట్టుకోని టిఫిన్ సెంటర్ లో వచ్చిన ఆదాయం తో కూతురి ని ఒక ఆయన చేతిలో పెట్టేవరకు తన కళ్ళలో పెట్టుకొని పెంచసాగింది. కనకమ్మ కూతురు చామంతిని.

కనకమ్మ కూతురు చామంతి ని ప్రేమగా ప్రాణంగా అతిగరాబంగా క్రమశిక్షణ తో పెంచసాగింది. అలా!అలా! చామంతి కూడా చామంతి పువ్వులా అందంగా సున్నితంగా చూడగానే అందరి కళ్ళు కుట్టేల పెరిగింది. కనకమ్మ కూతురికి చక్కగా చదువు చెప్పించదలచి కొబ్బరి లంక లోనే స్కూల్ లో చెరిపించింది.
చామంతి మొక్కలు పూల తోటలతో పాటుగానే ఒక్క మాటలో చెప్పాలంటే ముద్దు గుమ్మ లా ఉంటుంది. పకృతి తో పాటు ఇంటర్మీడియట్ వరకు కొబ్బరి లంక లోనే పూర్తి చేసింది అప్పటికి యుక్త వయస్సు వచ్చేసింది చామంతి కి కనకమ్మ కూడ ఎదో కాస్త కూస్తో కోబ్బరి లంక లో ఆస్తి పాస్తులు సంపాదించింది. కనకమ్మ చామంతి కి పెళ్లి చేసి తన భాధ్యత తీర్చు కోవాలని ఆలోచనలో పడింది.ఇప్పుడు చామంతి పాప కాదు యువతి ఎలా ఉందంటే చక్కని రూపం పొంగే గోదావరి గల,గల లా తోనికిసలాడే కడలి పొంగులా చామంతి వర్ణానికే వర్ణం.లా కనబడుతుంది ముద్దు గుమ్మ లా! చామంతి.
చామంతి ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి డిగ్రీ కళాశాల లో చేరె ఆలోచన ఉంది. ఇంక అమ్మ తో ఏమి చెప్పలేదు అందులో సమ్మర్ సెలవులు, చామంతి కి బోర్ గా ఉంది అమ్మ తో చెప్పి అలా తన క్లాస్ మేట్ ప్రభ ఇంటికి వెళ్లి వస్తానని అమ్మ పర్మిషన్ తో వెళ్ళింది ప్రభ ఇంటికి చామంతి ప్రభ చదువు లో క్లవర్ కాక పోయిన బుక్స్ చదివే అలవాటు ఉంది ప్రభ కు , నవలలు స్వాతి చందమామ కథలు సినిమా పత్రికలు ఇలా బుక్స్ నాలేజ్డ్ ఉంది ప్రభ ఇంట్లో రుక్మిణి కళ్యణం శకుంతల ధుశ్యంతుని పరియణం రాధాకృష్ణ ల పారాయణం ఇలా శివపార్వతుల కళ్యాణం ఇతిహాసాలు బుక్స్ ఉన్నాయి.
చామంతి ప్రభ ఇంటికి చేరుకుంది. ప్రభ చామంతి ని చూడగానే తన క్లాస్ మేట్ తన ఇంటికి వచ్చిన సంతోషంలో ఎగిరి గంతులు వేస్తూ ఎదురు వచ్చి లోపలికి తీసుకెళ్లి పిచ్చాపాటి గా కబుర్లు చెప్పుకుంటూ గడిపేరు వచ్చి చాలా సేపు కావడంతో వెళ్ళి వస్తాని చామంతి చెప్పగా ఇంట్లో అందరిని పరిచయం చేసింది ప్రభ. చామంతి ఇంటికి పొబోతు ప్రభ ని చామంతి ఇంటికి ఆహ్వానించింది ఇలా వారు ఒకరి ఇంటికి ఒకరు రావడం పోవడం అలవాటు గా మారింది దాంతో బాగా దగ్గర అయినారు. ఒకరోజు మాటల్లో కొన్ని బుక్స్ మొక్క గొప్పతనం గురించి ప్రభ చామంతి కి చెప్పగా చామంతి తన స్నేహితురాలైన ప్రభ ను కొన్ని బుక్స్ అడిగి తీసుకొని పోయి చదవటం మొదలు పెట్టింది. ముఖ్యంగా ధుశ్యంతుడు శకుంతల ను అరణ్యంలో కలిసే దృశ్యం.ధుశ్యంతుడు అప్పుడే శకుంతల ను. చూసి అమె అందచందాలను చూసి వర్ణించడం అక్కడే ఆ క్షణము శకుంతల. ధుశ్యంత మహరాజు ల వివాహం ఆడటం అందులో ఆయన చక్రవర్తి కావడం వారి మొదటి చూపు లు వారి మధ్య తోలి విరహం ధుశ్యంతుడు శకుంతలను శకుంతల రాజును కవ్వింపు ఇలా కథ లోని మదురిమలు చామంతిని ఆకట్టు కొంటూ చదవ సాగింది ఇలాగే రాధాకృష్ణ ప్రేమాయణం రుక్మిణి కళ్యాణం ఇలా చదవగా చాల సంతోషంగా ఫీల్ అయి తన క్లాస్ మేట్ ప్రభ ను మెచ్చుకొంది. అప్పటి నుంచి బుక్స్ నాలెడ్జ్ పెరిగింది చామంతి కి అందరూ బుక్స్ చదువుతారు చామంతి క్లాస్ మేట్ ప్రభ కూడ బుక్స్ చదువుతుంది కాని అందులో నిమజ్జనం కాదు కానీ కొందరు అందులో విమర్శ అయిపోతారు అలాంటి వారులో చామంతి ఒకటి. ఇలా బుక్స్ ఫిడ్ంగ్ తోనే చామంతి సమ్మర్ సెలవులు కాస్త కరిగి పోయాయి. కనకమ్మ కు కూతురి పెళ్ళి గురించి చుట్టాలతో మంతనాలు మొదలు పెట్టి చామంతి కి చక్కని సంబంధం చూడ సాగింది. ఒక శుభవేళ కూతురి ని పిలిచి సున్నితంగా ఒప్పించింది ఈ విషయాన్ని తన క్లాస్ మేట్ ప్రభ తో చెప్పింది చామంతి తను ఒక ఆటకూడ పటించింది ప్రభ కనకమ్మ ఒక చక్కటి అబ్బాయి తో చామంతి వివాహం కుదిరింది. ముహూర్తం కూడ పెట్టుకున్నారు.చామంతి లో తుంటరి ఆలోచనలు చిగురించాయ్ రాధా కృష్ణుల కేలీ కలాపాలు వారి తుంటరి అలోచనలు తనలో కుదపసాగాయి రాధ కృష్ణుని తన దొంగ చాటు తుంటరి చేష్టాలు రాధ ను మురళీ గానం తో తాపాన్ని కలిగించే రీతిని తన కాబోవు తన ప్రియునితో ఊహించుకొని తనలో తానే సిగ్గు పడటం ఏ యువతి కై ఆ టీనేజ్ లో కలిగే తుంటరి అలోచన లే కదా! ” ఆ టీనేజ్ లోనే తను ఎవరు అని మరిచి తన్మయత్వం లోకిపోయే జీవిత పరమార్ధం తెలుసు కోనేరోజులు ఆ తుంటరి ఆలోచన లే ఒక్క మానవులే కాదు ఈపకృతి లో ఉన్న సకలజీవులకు ఈ తుంటరి అలోచన సహజమే కదా! ఇలా చామంతి ఒక్క రాధ కృష్ణుల తుంటరి తనమే గాక రుక్మిణి కళ్యాణం లోని భక్తి భావాలు శివపార్వతుల కళ్యాణం లోని కరునారసం ఇలా తను చదివిన ఇతిహాసాల లోని తుంటరి అలోచనలను ప్రియుని కొరకు దాచివుంచి తన తోలివలపు ప్రేమ ప్రియునికి అందించాలని” ఊహలలోకి వెగిసింది. అమ్మ చెప్పినట్లు గానే పెళ్లి చేసుకొంది “ముద్దుగుమ్మ”కనకమ్మ కంఠ ఆనందభాష్పాలు చిందాయి.
—————————————–

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!