(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
ఆకాశానికి నిచ్చెన
రచయిత :: వైష్ణవి
గెలుపు నీ సొంతమైతే…..
ఓటమి నాకు చుట్టం
అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది
తెలివి నీకు సొంతమైతే….
తెగువ నాకు రక్తం
ఎప్పుడూ ప్రవహిస్తూనే
ఉంటుంది
ఆకాశం నీకు హాదైతే
అవకాశమే నాకు నిచ్చెన
ఎంత ఎత్తైన ఎక్కేస్తా తేలికగా…..